నాగ పంచమి రోజు పుట్టలో పాలు పోస్తున్నారా? అయితే ఇది ఓసారి చదవండి.

నాగ పంచమి రోజు పుట్టలో పాలు పోస్తున్నారా? అయితే ఇది ఓసారి చదవండి.

శ్రావణ మాసం.. ఎంతో పవిత్రమైన మాసం. ఈ నెలంతా వివిధ పూజలతో అమ్మవారిని సేవించడంతో పాటు వ్రతాలు, నోములు చేస్తూ.. ఆ అమ్మ అనుగ్రహం కోసం ప్రయత్నించడం మామూలే. శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదో రోజు పంచమి నాడు నాగ దేవత అనుగ్రహం కోసం నాగ పంచమి (naga panchami) జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగ జరుపుకోవడం వెనుక కొన్ని కథలు కూడా ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజును జరుపుకునే సందర్భంలో.. మనం కూడా నాగ పంచమి ప్రత్యేకతతో పాటు.. ఈ రోజు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..

instagram

ఒకప్పుడు ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణు మూర్తి.. ఏదైనా వరం కోరుకోమని అడగగా.. దానికి ఆయన తాను ఉద్భవించిన శ్రావణ పంచమి రోజు అందరూ సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడట. దానికి విష్ణుమూర్తి సరేనని బదులిస్తూ.. ఆ రోజుని నాగ పంచమిగా నామకరణం చేశాడట. ఆ రోజు నుండి.. ఆ పర్వదినాన నాగ దేవతల పూజలను చేయడం ఆనవాయితీ వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నాగ పంచమి రోజున.. దేశవ్యాప్తంగా అందరూ నాగ దేవతలకు పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోయడం ఈ రోజు ప్రత్యేకత. అలాగే నాగ దేవత విగ్రహాలకు పాలు, నీళ్లు, పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తారు. పసుపు దారాలను చేతికి కట్టుకుంటారు. ఈ రోజునే కొందరు గరుడ పంచమిగా కూడా జరుపుకుంటారు.

నాగ పంచమి రోజు.. శ్రీ కాళహస్తీశ్వరుడికి అభిషేకం చేయించిన వారికి సకల సంపదలు చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి. రాహు, కేతు దోషాలు, సర్ప దోషాలు, కాల సర్ప దోషాలు తొలగించుకోవడానికి ఈ పూజలు చేస్తారట. అలాగే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అనంత పద్మనాభ స్వామికి  ఈరోజు అభిషేకాలు, అలంకారాలు చేయిస్తారు. ఇలా చేయించిన వారికి ఆర్థిక సమస్యలు ఉండవని నమ్మకం. అలాగే ఈ రోజు నాగులను పూజించి ఉపవాసం ఉన్నవారికి విషబాధలు ఉండవట. నాగ దోషాలు, కాల సర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

సోదరులకి చెప్పే రక్షాబంధన్ విషెస్ (Raksha Bandhan Quotes In Telugu)
Instagram

నాగ పంచమి రోజున పాలాభిషేకాలు, పూజలు వంటివి చేసినా ఫర్వాలేదు. కానీ చాలామంది నాగ దేవత రూపంగా భావిస్తున్న సర్పాలకు పాలు (milk) పోయడం, గుడ్లు తినిపించడం వంటివి చేస్తుంటారు. అయితే పాములు పాలు తాగుతాయి, గుడ్లు తింటాయి.. అన్నది అపోహ మాత్రమే. కాబట్టి కేవలం పూజలు, అభిషేకాలు చేయడం తప్ప పాలు తాగించాలని ప్రయత్నం చేయడం తప్పు. మరి, ఇలా పాలు తాగించడం, గుడ్లు తినిపించడం వంటివి చేయడం తప్పైనప్పుడు.. అవి మన పెద్దవాళ్లు ఎందుకు చేశారు? వాళ్ల నుంచి వచ్చిన ఆచారాన్నే కదా.. మనం ఇప్పటికీ పాటిస్తున్నాం..? అని చాలామంది అనుకుంటారు. కానీ మన పెద్దవాళ్లు ఈ ఆచారాన్ని ప్రారంభించడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది.

 

Instagram

పూర్వం సర్పాల సంఖ్య ఎక్కువగా ఉండేది. అలాగే.. ఆ కాలంలో  జనావాసాలు అడవులకు దగ్గరగా ఉండేవి.  ఈ క్రమంలో నిత్యం సర్పకాటుకి గురై మరణించే జనాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. ఈ క్రమంలో తాము పాము కాటు బారిన పడకూడదని.. తమకు విష బాధలు ఉండకూడదని నాగ పంచమి రోజు సర్పాలను పూజించే ఆచారానికి పలువురు అంకురార్పణ చేశారు.

అంతేకాదు.. అప్పటి ధర్మశాస్త్రాల ప్రకారం ఏ జంతువునీ చంపకూడదని నియమం. అన్ని జీవాలకు తమతో పాటు జీవించే హక్కు ఉందని.. ఆ హక్కును కాలరాయకూడదని ఆ శాస్త్రాలు చెబుతుండేవి. కాబట్టి పాములను చంపడానికి కూడా వెనుకాడేవారు. అయితే పాముల ప్రత్యుత్పత్తిని తగ్గించి.. వాటి సంఖ్యను తగ్గించాలని భావించారు. సర్పాలకు పాలు, గుడ్లు అర్పించాలనే నియమాన్ని పెట్టారు. అయితే దీని అర్థం అవి వీటిని తింటాయని మాత్రం కాదు.

Instagram
వినాయక చవితి విశిష్టత మీకు తెలుసా? (Vinayaka Chavithi In Telugu)

పాముల ప్రత్యుత్పత్తి మిగిలిన జీవాల కంటే కాస్త ప్రత్యేకం. ఆడ పాములు ఓ ప్రత్యేకమైన వాసనను విడుదల చేస్తాయి. దానిని గుర్తించిన మగ పాములు వాటిని చేరుకొని జంట కడతాయి. పాలు, గుడ్లను.. పాముల పుట్టల పక్కన పెడితే అవి ఒకటి, రెండు రోజుల్లోనే పాడైపోయి.. కొన్ని రోజుల వరకూ దుర్గంధాన్ని వెదజల్లుతాయి. ఈ దుర్గంధం వల్ల ఆడ పాములు విడుదల చేసిన వాసనను.. మగ పాములు గుర్తించలేవు.

తద్వారా ఆ కాలంలో పాముల్లో ప్రత్యుత్పత్తి జరగకుండా వారు ఆపేవారు. ఇది పాములు కలిసి, గుడ్లు పెట్టే కాలం .. కాబట్టి ఈ కాలంలో వాటిని అడ్డుకుంటే చాలు.. వాటి సంఖ్య తగ్గుతుందని వారు భావించారు. కాబట్టి అలా పుట్టల దగ్గర పాలు, గుడ్లు పెట్టాలనే నియమాన్ని పెట్టారు. అయితే తర్వాతి కాలంలో.. ఇదే పద్ధతిని  ఒక ఆనవాయితీగా ప్రారంభించాక.. అందరూ దీన్ని పాటించడం ప్రారంభించారు.

మైసమ్మ.. పోచమ్మల బోనం చేయంగ.. బోనాల జాతరలో ఆడిపాడంగ..!

కానీ ఇప్పుడు రాన్రాను పాములు సంఖ్య తగ్గుతూ వస్తోంది. పంటకు హాని కలిగించే ఎలుకలు, పందికొక్కుల వంటి వాటిని తగ్గించేందుకు.. పాముల అవసరం ఎంతైనా ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఈ క్రమంలో పాములకు పాలు, గుడ్లు.. వంటివి సమర్పించనవసరం లేదంటున్నాయి కొన్ని ప్రజా సంఘాలు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.