(Bathukamma Celebrations in Telangana and Hyderabad)
తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా బతుకమ్మ సంబురాలు విభిన్నంగా జరుగుతున్నాయి. నిన్న, ఈ రోజు రాష్ట్ర మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. స్థానిక స్త్రీలతో కలిసి బతుకమ్మ ఆడారు. ముఖ్యంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొని.. గ్రామీణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడడం విశేషం. అలాగే పలు పాఠశాలలు, మహిళా కళాశాలలలో కూడా విద్యార్థినులు బతుకమ్మ ఆడారు.
ఈ వేసవి సెలవుల్లో.. మీరు తెలంగాణలో చూడదగ్గ ఎకో – టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!
సాధారణంగా ఎవరైనా దేవతలను పూలతో అలంకరించి పూజిస్తారు. కానీ పూలనే దేవతలుగా పూజించే చిత్రమైన వేడుక బతుకమ్మ. మహాలయ అమావస్యతో ప్రారంభమయ్యే ఈ వేడుక.. దాదాపు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. తొలి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ ఆడే మహిళలు.. రెండవ రోజు అటుకుల బతుకమ్మను ఆడతారు. తర్వాత ముద్దపప్పు బతుకమ్మ, బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. అంటూ ఆ దేవదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. ఈ తరుణంలో బతుకమ్మ పాటలు కూడా పాడతారు. ప్రస్తుతం ప్రముఖ జానపద గాయని మంగ్లీ పాడిన ఓ అద్భుతమైన బతుకమ్మ పాట యూట్యూబులో బాగా హల్చల్ చేస్తోంది.
పూలను పూజించే బతుకమ్మ.. శక్తిని ఆరాధించే దసరా
చరిత్రను ఒకసారి తిరగేస్తే.. బతుకమ్మ పండగకు సంబంధించి అనేక ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. గొల్లరాజుల కాలంలో ఈ పండగ ప్రారంభమైందని కొందరు అంటారు. అలాగే పూలతో బతుకమ్మను చేసి పూజించే సంప్రదాయం.. మాందాత కాలంలో కూడా ఉండేదని ప్రతీతి. ఇప్పటికీ సిద్ధిపేట హుస్నాబాద్ దగ్గరలోని మాందాపురంలో పురాతన శిల్పాలు కనిపిస్తాయి. ఆ శిల్పాలలో పూల బతుకమ్మ చిత్రాలు కూడా చెక్కబడడం విశేషం.
తెలంగాణ స్పెషల్ వంటకం – సర్వ పిండి ముచ్చట్లు మీకోసం..!
బతుకమ్మ పండగ ప్రారంభమవ్వడానికి ముందే.. తెలంగాణలో మరో గ్రామీణ దేవత పండగ కూడా ప్రారంభమవుతుంది. అదే బొడ్డెమ్మ పండగ. ఈ పండగ ప్రస్తుతం చాలా ప్రాంతాలలో కనుమరుగైపోయింది. అయినా కొన్నిచోట్ల బొడ్డెమ్మను కచ్చితంగా పూజించడం సంప్రదాయంగా వస్తోంది. భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి వేళ.. తొలి బొడ్డెమ్మను ప్రతిష్టించి పూజించే సంప్రదాయం తెలంగాణలోని కొన్ని పల్లె ప్రాంతాలలో ఇప్పటికీ ఉంది.
ఈ మధ్యకాలంలో విదేశాలలో స్థిరపడిన తెలంగాణ ప్రాంతీయులు కూడా.. బతుకమ్మ సంబురాలను ఘనంగా చేయడం విశేషం. ముఖ్యంగా తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) నిర్వహించే బతుకమ్మ వేడుకలకు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రతీ యేటా దాదాపు 1200 ప్రవాస కుటుంబాలు ఈ బతుకమ్మ వేడుకలకు హాజరవుతుంటాయట. ఈ సంవత్సరం యూకేలో జరిగిన బతుకమ్మ సంబురాలకు భారత్ హైకమీషన్ ప్రతినిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Featured Image: Instagram.com/iam.savithri and twitter.com/TSBathukamma
data-lang=”en”>
పూలతో దేవున్ని పూజించడం అనేది సర్వసాధారణం. కానీ ఆ పూలనే దేవునిగా పూజించడం ప్రపంచంలో తెలంగాణలో తప్ప మరెక్కడా కనిపించదు. ప్రకృతి ప్రసాదించిన పూలను తొమ్మిది రోజులూ భక్తితో పూజించి బతుకమ్మా అని వేడుకోవడం తెలంగాణ మట్టి సంప్రదాయం. https://t.co/0f0TQs2cEc#Bathukamma pic.twitter.com/Q75qqjamC1
— Telangana Bathukamma (@TSBathukamma) September 30, 2019
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.