ఆమె మరణించాక కూడా.. 9 మందికి ప్రాణాలు పోసింది ..!

ఆమె మరణించాక కూడా.. 9 మందికి ప్రాణాలు పోసింది ..!

Hyderabad based Techie Charita Reddy set an example by pledging to donate her organs.

చరితా రెడ్డి .. తెలుగు అమ్మాయి. రెండు రోజుల క్రితం అమెరికాలోని మిచిగన్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఆమె ప్రమాదానికి గురైంది. వైద్యులు ఎంత ప్రయత్నించినా.. ఆమెను కోలుకొనేలా చేయలేకపోయారు. ప్రాణాలున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి సమయంలో చిట్టచివరకు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా నిర్థారించారు.  ముస్కేగాన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. నిస్తేజంగా మారిపోయిన చరిత పేరు నిలిచిపోయేలా.. ఆమె తల్లిదండ్రులు ఇదే సమయంలో ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె అవయవాలను ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులకు ఎవరికైనా అమర్చమని కోరారు.

ఆత్మహత్య యత్నం నుంచి ఆల్ ఇండియా రేడియో వరకూ.. ఓ మహిళ విజయగాథ ఇది..!

వైద్యులు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని.. వారి కోరికను మన్నించారు. ఆమె అవయవాలను .. ప్రాణాలతో పోరాడుతున్న మరో 9 మందికి అమర్చారు. ఈ క్రమంలో చరిత తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తమ కుమార్తె మరణించినా.. మరో తొమ్మిది మంది ప్రాణాలను నిలబెట్టినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. తాము తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. చరిత ప్రయాణిస్తున్న కారును.. మరొక కారు వచ్చి వేగంగా ఢీకొనడంతో ఆమె ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్రమైన గాయమైంది. 

తన నిఖా జరిపించే మహిళ కోసం.. ఎనిమిది నెలలు వెతికిందట ఈ అమ్మాయి..!

చరిత అవయవదాన కార్యక్రమం గిఫ్ట్ లైఫ్ ఆసుపత్రిలో జరిగింది. ఆమె అవయవాలను ఇతరులకు ట్రాన్స్‌ప్లాంట్ చేసేముందు.. వైద్యులు చరిత తల్లిదండ్రులతో సంతకాలు చేయించుకున్నారు. వారి ఆమోదంతోనే ఈ దాన ప్రక్రియ జరిగినట్లు సర్టిఫికేషన్ ఇచ్చారు. వారి నిర్ణయం ఎంతో గొప్పదని కొనియాడారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అనేక స్వచ్ఛంద సంస్థలు సైతం చరిత తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతున్నాయి. అమెరికాలో ఒకవేళ మనిషి బ్రెయిన్ డెడ్ అయితే.. తన అవయవాలను దానం చేసే విషయంలో నిజ నిర్థారణ చేయడానికి ప్రత్యేక చట్టాలున్నాయి.

మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

సాధారణంగా ఒక మనిషి మరణించాక.. అవయవాల మార్పిడి అనేది కొన్ని గంటలలో జరిగిపోవాలి. ఇక బ్రెయిన్ డెడ్ లాంటి కేసులలో భౌతిక కాయాన్ని వెంటిలేటర్ నుండి బయటకు తీసుకొచ్చేలోపే అవయవాలను సేకరించాలి. సాధారణంగా గుండె లాంటి భాగాలను అయితే నాలుగు, అయిదు గంటలలో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. అలాగే కాలేయాన్ని అయితే దాదాపు ఎనిమిది గంటలలో సేకరించాలి. మూత్ర పిండాలను మాత్రం దాదాపు 24 గంటలలో సేకరించాల్సి ఉంటుంది. మన దేశంలో కూడా అవయవదానానికి సంబంధించి ప్రత్యేక చట్టాలున్నాయి. 

ఓ మనిషి మరణించాక.. తన శరీరానికి సంబంధించి దాదాపు 200 అవయవాలను దానం చేసే అవకాశం ఉంది. అలాగే టిష్యూలను కూడా దానం చేయవచ్చు. సాధారణంగా కళ్లు, కాలేయం, మూత్ర పిండాలు, ఊపిరి తిత్తులు, క్లోమం, ఎముకలు, మూలుగు, పేగులు మొదలైన వాటిని దానానికి వైద్యులు స్వీకరిస్తారు. అలాగే ఏదైనా ప్రమాదంలో తలకు గట్టి దెబ్బ తగిలి.. మెదడు పనితీరు ఆగిపోయినా.. శరీరం మాత్రం కొద్ది సేపు జీవంతోనే ఉంటుంది. ఈ సమయంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు సజీవంగా ఉంటాయి. 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.