Bigg Boss

Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!

Sandeep Thatla  |  Oct 10, 2019
Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!

(Bigg Boss Telugu 3 housemates to participate in Pot Breaking Task)

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 3” రియాలిటీ షో 12 వారాలు పూర్తి చేసుకొని.. 13వ వారంలోకి దూసుకుపోతోంది. ఇక ఇంట్లో ఒక హౌస్ మేట్ గురించి.. మరొక హౌస్ మేట్ కుండ బద్దలు కొట్టే విధంగా.. తమ అభిప్రాయాలు తెలిపే సందర్భం ఇన్నాళ్లకు వచ్చింది. ఈ ప్రత్యేకమైన టాస్క్‌ను బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇవ్వడం జరిగింది. దీని కోసం, బిగ్ బాస్ హౌస్‌లో ఒక కుండను ఏర్పాటు చేశారు.  దాని పై  హౌస్ మేట్స్ పేర్లను రాశారు. 

Bigg Boss Telugu 3 : బాబా భాస్కర్‌ని టార్గెట్ చేసిన.. వరుణ్ సందేశ్, వితిక & రాహుల్

ఈ టాస్క్‌లో భాగంగా.. ఇంటి సభ్యులలో ఒక్కొక్కరికి.. తమ గురించి ఇతర సభ్యులు మాట్లాడిన వీడియోలను చూపిస్తారు. దానికి రియాక్షన్‌గా ఆయా సభ్యులు కుండని బద్దలు కొడతారా లేదా అనేది.. ? ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన టాస్క్ ప్రోమోని విడుదల చేశారు. ఆ ప్రోమోలో అలీ రెజా, బాబా భాస్కర్‌లకి సంబంధించి.. కుండ బద్దలుకొట్టే సన్నివేశాలు కనపడుతున్నాయి.

ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి, మహేష్ విట్టా తప్ప.. మిగతా అందరూ బాబా భాస్కర్‌కి వ్యతిరేకంగానే ఉన్నారు. రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజాలు అయితే ఆయనని నేరుగానే టార్గెట్ చేసి.. కామెంట్ చేయడం జరుగుతోంది. ఈ తరుణంలో రాబోయే రోజుల్లో బాబా భాస్కర్‌కి.. బిగ్ బాస్ హౌస్‌లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతోంది.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున ఇంటి సభ్యులతో సరదాగా టాస్క్స్ ఆడించడం.. అందులో భాగంగా వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో వారి జీవితాల్లో ఏదైనా విజయం సాధించిన సందర్భం ఉంటే దాని గురించి చెప్పాలని నాగార్జున కోరగా.. ఇంటిసభ్యులంతా తమ జీవితాల్లో లేదా కెరీర్ పరంగా సాధించిన విజయాల గురించి తెలిపారు. 

ఆ తరువాత ఇంటి సభ్యులకి స్టార్స్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఈ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు ఒకొక్కరూ.. తమకు నచ్చిన హౌస్ మేట్‌ను స్టార్ కంటెస్టెంట్‌గా ఎంపిక చేయాలి. అలాగే వారికి ఒక స్టార్ పెట్టాలి. అలా ఇంటిలో ఎక్కువ స్టార్స్ వచ్చిన వారికి.. ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని కూడా నాగ్ తెలిపారు. ఈ టాస్క్‌‌లో భాగంగా ఇంటి సభ్యులు తమకు నచ్చిన వారికి స్టార్స్ పెట్టారు. 

Bigg Boss Telugu 3 : పునర్నవి కోసం.. రాహుల్ సిప్లిగంజ్ పడిన బాధకి కారణం ప్రేమేనా?

ఈ  టాస్క్‌లో ఎక్కువ స్టార్స్ సంపాదించింది శివజ్యోతి, వరుణ్ సందేశ్‌లు కావడం గమనార్హం. ఈ ఇద్దరూ టాస్క్ గెలిచిన కారణంగా.. వారం పొడుగునా వారికి స్పెషల్ డిన్నర్ అవకాశాన్ని ఇస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. 

ఇక నాగార్జున ఈ గేమ్స్ ఆడించి వెళ్ళిపోయాక.. వరుణ్ సందేశ్, వితిక, రాహుల్‌లు ఒక ప్రత్యేక చర్చ పెట్టుకున్నారు. హౌస్‌లో బాబా భాస్కర్ సరిగా ఉండట్లేదని.. కావాలనే తనకి నచ్చిన సభ్యులకి మద్దతుగా ఆడుతున్నాడని విమర్శలు కురిపించారు. మరి దీని పై రాబోయే ఎపిసోడ్స్‌లో.. ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయో అనేది వేచి చూడాల్సిందే.

మొత్తంగా చూస్తే, ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతున్న కొద్ది ఇంటి సభ్యుల అసలు రూపాలు బయటపడుతున్నాయి. అవి మిగతా వారి ఆట తీరుని ప్రభావితం చేస్తున్నాయి. దీనివల్ల రాబోయే ఎపిసోడ్స్ మరింత ఆసక్తికరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

Bigg Boss Telugu 3: శివజ్యోతి కోసం.. కావాలని ఓడిపోతున్న అలీ రెజా?                                                                       

Read More From Bigg Boss