Beauty

ఈ ఆర్గానిక్ లిప్ బామ్.. మీ పెదవులను సాఫ్ట్‌గా మార్చేస్తుంది..

Lakshmi Sudha  |  Feb 20, 2019
ఈ ఆర్గానిక్ లిప్ బామ్.. మీ పెదవులను సాఫ్ట్‌గా మార్చేస్తుంది..

మీకో విషయం తెలుసా? అమ్మాయిల పెద‌వుల‌ను అబ్బాయిలు సగటున 6.73 సెకన్ల పాటు చూస్తారట..!

నిజమేనండీ.. మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం 6 సెకన్ల కంటే ఎక్కువ సమయమే అబ్బాయిలు అమ్మాయిల lips చూస్తున్నారట (రెడ్ లిప్ స్టిక్ వేసుకొంటే.. ఆ సమయం ఇంకా ఎక్కువగా ఉంటోందట)! కావాలంటే మీరూ దీనిపై ఓ చిన్నపాటి రీసెర్చి చేయండి. అంతకంటే ముందు ఆర్గానిక్ హార్వెస్ట్ (Organic Harvest) సంస్థ దానిమ్మ గింజలతో తయారుచేసిన లిప్ బామ్ (lip balm) వాడండి.

పూర్తి సహజసిద్ధమైన ఉత్పత్తి

ఆర్గానిక్ హార్వెస్ట్ అందిస్తోన్న ఈ లిప్ బామ్‌లో హానికారకమైన పారాబెన్స్ లేవు. దీని తయారీకి మినరల్ ఆయిల్, బీ వ్యాక్స్ వంటి వాటిని ఉపయోగించలేదు. కాబట్టి దీన్ని నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. నిజం చెప్పాలంటే.. మీ పెదవులు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే.. ఆర్గానిక్ ఉత్పత్తులు వాడటమే మంచిది. ఈ లిప్ బామ్ తయారీలో బీవ్యాక్స్‌కి బదులుగా లానోలిన్ ఉపయోగించారు. ఇది ఎకో -సర్టిఫైడ్ ఉత్పత్తి. అలాగే రంగు కోసం రసాయనాలకు బదులుగా ఫుడ్ గ్రేడ్ కలర్ ఉపయోగించారు.

క్యూట్‌గా ఉన్న ప్యాకెజింగ్

డోమ్ షేప్‌లో ఉన్న ప్యాకెజింగ్ క్యూట్‌గా ఆకట్టుకొనేలా ఉంటుంది. సాధారణంగా లిప్ బామ్ రోల్-ఆన్-ట్యూబ్‌లో ఉంటుంది. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఆర్గానిక్ హార్వెస్ట్ లిప్ బామ్ ఉంటుంది. రూబీ రెడ్ రంగులో మెరుసిపోతూ అల్బకర పండు మాదిరిగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Also Read: కాలేజీ భామలూ.. రూ. 500 విలువైన ఈ లిప్ స్టిక్స్ మీ కోసమే సుమా..!

ఎలా ఉపయోగించాలి?

ఆర్గానిక్ హార్వెస్ట్ అందిస్తోన్న ఈ లిప్ బామ్ ఎలా ఉపయోగించాలంటే..

1. పెదవులు పొడిబారినట్లుగా, పగిలినట్లుగా తయారైతే.. టీస్పూన్ బ్రౌన్ షుగర్‌లో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి పెదవులకు రాసుకోవాలి. ఆ తర్వాత టూత్ బ్రష్‌తో పెదవులను సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మృత‌క‌ణాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఆర్గానిక్ హార్వెస్ లిప్ బామ్ పెదవులకు అప్లై చేసుకొంటే మాయిశ్చరైజ్ అవడంతో పాటు సాఫ్ట్‌గా తయారవుతాయి.

2. కొన్నిసార్లు మ‌న‌కు లిప్ స్టిక్ వేసుకోవాలనిపించదు. కానీ ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకొంటాం. అలాంటప్పుడు దానికి బదులుగా ఆర్గానిక్ హార్వెస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకొంటే సరిపోతుంది.

3. లిప్ స్టిక్ పర్ఫెక్ట్‌గా రావాలంటే – లిప్ కలర్ వేసుకోవడానికి ముందు ఆర్గానిక్ హార్వెస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకోవాలి.

4. రోజంతా మీ పెదవులు అందంగా మెరిసిపోవాలన్నా.. కలర్ ఫుల్‌గా కనిపించాలన్నా.. రోజులో అప్పుడప్పుడూ ఈ లిప్ బామ్ అప్లై చేయండి.

5. హైలైటర్ అప్లై చేసుకోవడానికి ముందు.. బేస్‌గా ఈ లిప్ బామ్‌ని కొద్దిగా అప్లై చేయండి. ఫలితం మీరే చూస్తారుగా..!

6. మీ పెదవులు ఎప్పుడూ తాజాగా కనిపించాలంటే.. మాయిశ్చరైజ్ చేయడం అవసరం. అందుకే ఎప్పుడూ ఆర్గానిక్ హార్వెస్ట్ లిప్ బామ్ మీ వెంట ఉంచుకోండి. అవసరమైన ప్రతిసారి అప్లై చేసుకొంటూ ఉండండి.

చూశారా? ఈ లిప్ బామ్‌ను ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో. లిప్ బామ్‌గానే కాదు.. లిప్ స్టిక్‌గా, హైలైటర్ బేస్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది అందుబాటు ధరల్లోనే మనకు లభ్యమవుతుంది. 

ఆర్గానికి్ హార్వెస్ట్ పొమోగ్రనేట్ లిప్ కేర్ బామ్‌ను ఇక్కడ కొనండి. (ధర: రూ. 199)

గ్రీన్ యాపిల్, షియా బటర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లలోనూ ఆర్గానిక్ హార్వెస్ట్ లిప్ బామ్ దొరుకుతుంది.

Also Read: అదిరేటి లుక్ కోసం ఆరెంజ్ బ్లష్ ఎలా అప్లై చేయాలి?

మీరు సోషల్ మీడియాలో రాక్ స్టార్‌గా వెలిగిపోతున్నారా? అయితే Plixxo లో వెంటనే చేరిపోండి – www.plixxo.com

ఇండియాలోనే అతి పెద్ద ఇన్‌ఫ్లూయెన్సర్ నెట్‌వర్కులో చేరి.. టాప్ బ్రాండ్స్‌తో కలసి పనిచేసే అవకాశం అందుకోండి.

Image: Shutterstock

Featured Image: Pooja Hegde Facebook

Read More From Beauty