Celebrations

#ToMaaWithLove “మదర్స్ డే” సందర్భంగా.. అమ్మ ప్రేమను తెలిపే సినీ గీతాలు మీకోసం

Babu Koilada  |  May 11, 2019
#ToMaaWithLove “మదర్స్ డే” సందర్భంగా.. అమ్మ ప్రేమను తెలిపే సినీ గీతాలు మీకోసం

తెలుగు సినిమాల్లో మదర్ సెంటిమెంట్‌ని ఆధారంగా చేసుకొని.. ఎందరో సినీ రచయితలు ఎన్నో గీతాలు రాశారు. అందులో బాగా పాపులరైన కొన్ని గీతాలను ఈ మదర్స్ డే (Mothers Day) సందర్భంగా మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.

చిత్రం : 20వ శతాబ్దం (1990)
సంగీతం : జె.వి.రాఘవులు
రచన : డా॥సి.నారాయణరెడ్డి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి :
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

చరణం : 1
రఘురాముడిలాంటి కొడుకు ఉన్నా
తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి
సుగుణ రాశి సీతలాగ తాను
కోటి ఉగాదులేనా గడపకు తేవాలి
మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే
ఈ లోగిలి కోవెలగా మారాలి

అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే

చరణం : 2
తప్పడడుగులేసిన చిననాడు
అయ్యో తండ్రీ అని గుండె కద్దుకున్నావు
తప్పడడుగులేస్తే ఈనాడు
నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే
ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే

అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

Also Read: ‘నాన్న’ గొప్పతనాన్ని తెలిపే సినిమా పాటలు (Famous Film Songs Related To Fathers Day) 

 

చిత్రం: అమ్మా రాజీనామా
రచన – సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం – చక్రవర్తి, గానం – కె.ఎస్.చిత్ర

ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం

అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అవతార మూర్తి అయినా అనువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా.. అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం

శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
దీర్గాయురస్తూ అంటూ నిత్యం దీవించింది
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
దీర్గాయురస్తూ అంటూ నిత్యం దీవించింది
నూరేళ్ళు..నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో

ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్నా బాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను రాగంకన్నా తీయ్యని రాగం

Also Read: తండ్రులు రోజు బహుమతి ఆలోచనలు (Father’s Day Gift Ideas)

 

చిత్రం: నాని
రచన: చంద్రబోస్
గానం – సాధనా సర్గమ్, ఉన్ని క్రిష్ణన్
సంగీతం – ఏ.ఆర్.రెహమాన్

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ

నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా అవుతుండగా
జోలాలి పాడనా కమ్మగా కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాట లోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు
ఇరువురికీ నేను అమ్మవనా
నా కొంగు పట్టే వాడు నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్ననీ వాడి నాన్ననీ
నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలీ జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగీ ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలీ జో
బజ్జో లాలీ జో బజ్జో లాలీ జో
బజ్జో లాలీ జో

 

చిత్రం : అమ్మానాన్న ఓ తమిళమ్మాయి
సంగీతం : చక్రి
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : చక్రి

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..

నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా..
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
కనిపించకపోతే బెంగై వెతికేవే.. కన్నీరే వస్తే కొంగై తుడిచేవే

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..

నే గెలిచిన విజయం నీదే.. నే ఓడిన క్షణమూ నాదే..
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా..
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే.. ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే

నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..
వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ..
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా..

చిత్రం: ముగ్గురు మొనగాళ్లు
సాహిత్యం: వేటూరి
సంగీతం: విద్యాసాగర్
గానం : బాలు, చిత్ర

అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన
నాన్నంటే నీలాకాశం తల వంచేనా
నూరేళ్ళ ఆశా దీపం నువ్వే మా ఆరోప్రాణం
నువ్వే మా తారాదీపం, పూజా పుష్పం

చరణం: శోకంలో పుట్టింది శ్లోకంగా రామ కధ
శోకంగా మిగిలింది కుమిలిన ఈ అమ్మ కధ
బంధాలే భస్మాలు విధే కదా వింత కధ
మమకారం మాతృత్వం నిన్నటి నీ ఆత్మకధ
బ్రతుకంతా నిట్టూర్పై ఎదురైన బాధల్లో
కన్నీరై చల్లార్చే గతే లేని గాధలలో…

చరణం: చింతల్లో సీమంతం శిలలోనే సంగీతం..
శిధిలం నీ సంసారం చిగురేసే అనుబంధం
ఒక బ్రహ్మని కన్నావు అమ్మకి అమ్మయినావు
శివ విష్ణువులిద్దరినీ చీకటిలో కన్నావు
త్రిమూర్తులకి జన్మవో, తిరుగులేని అమ్మవో
ఏ బిడ్డని పెంచేవో, ఏ ఒడ్డుకి చేరేవో….!

చిత్రం: రఘువరన్ బీటెక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: అనిరుధ్
గానం: ఎస్ జానకి, దీపు

అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా
మాటే లేకుండా నువ్వే మాయం
కన్నిరవుతోంది యదలో గాయం
అయ్యో వెళిపోయావే
నన్నొదిలేసి ఎటు పోయావే
అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట
నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంట
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా
నువ్వే లేక వసివాడానమ్మా

చెరిగింది దీపం
కరిగింది రూపం
అమ్మా నాపై ఏమంత కోపం
కొండంత శోకం.. నేనున్న లోకం
నన్నే చూస్తూ నవ్వింది శూన్యం
నాకే ఎందుకు శాపం..

జన్మల గతమే చేసిన పాపం
పగలే దిగులైన నడిరేయి ముసిరింది..

కలవర పెడుతోంది పెను చీకటి
ఊపిరి నన్నొదిలి నీలా వెళిపోయింది..బ్రతికి సుఖమేమిటి
ఓ అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా..నువ్వే లేక వసివాడానమ్మా

విడలేక నిన్ను.. విడిపోయి వున్నా..కలిసే లేనా నీ శ్వాసలోన

మరణాన్ని మరచి జీవించి వున్నా..ఏ చోట వున్నా నీ ధ్యాసలోన

నిజమై నే లేకున్నా.. కన్నా నిన్నే కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా.. కలతను రానీకు కన్నంచున
కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన.. చిగురై నిను చేరనా

అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా.. నువ్వే లేక వసివాడానమ్మా
అడుగై నీతోనే నడిచొస్తున్నా.. అద్దంలో నువ్వై కనిపిస్తున్నా
అయ్యో వెళిపోయావే.. నీలో ప్రాణం నా చిరునవ్వే
అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట
వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా

ఇవి కూడా చదవండి

#ToMaaWithLove “మదర్స్ డే” సందర్భంగా.. ఈ తెలుగు సినిమాలు మీకు ప్రత్యేకం

మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ గురించి.. అమ్మ చేసే కామెంట్లు ఎలా ఉంటాయంటే..!

#ToMaaWithLove ‘మదర్స్ డే’ కానుకగా.. ఈ స్టార్ రెస్టారెంట్లకు అమ్మను తీసుకెళదాం..!

 

Read More From Celebrations