Bigg Boss

బిగ్ బాస్ తెలుగు : రవికృష్ణని టార్గెట్ చేసిన తమన్నా

Sandeep Thatla  |  Aug 6, 2019
బిగ్ బాస్ తెలుగు : రవికృష్ణని టార్గెట్ చేసిన తమన్నా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (Bigg Boss Telugu)లో మొదటి వారం చివరన.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన తమన్నా.. రోజురోజుకి ఇంటిలోని సభ్యులకి చుక్కలు చూపిస్తుంది. మొన్నటి ఎపిసోడ్‌లో ఆమెని ఇంటి సభ్యులు నామినేట్ చేశారన్న కోపాన్ని ఆమె తీవ్రస్థాయిలో ప్రదర్శిస్తోంది. అయితే ఆమె కోపాన్ని ఇంటి సభ్యులందరి పైనే కాకుండా.. కేవలం రవికృష్ణ పైనే చూపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

టీవీ9 జాఫర్ “బిగ్‌బాస్ హౌస్”లోకి.. మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారా?

అసలు తమన్నా ( Tamanna)  ఇంటికి వచ్చిన మొదట్లో కూడా.. రవికృష్ణ‌ని టార్గెట్ చేయడం జరిగింది. అయితే ఆ తరువాత పరిణామాలతో వారిద్దరి మధ్య సఖ్యత నెలకొంది. ఈ సఖ్యత మొన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో విఫలమైంది. తమన్నాని రవికృష్ణ (Ravikrishna) నామినేట్ చేయడంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది. కాని ఇప్పుడు తమన్నా అంటున్న మాటలు.. చేస్తున్న చేష్టలు రవికృష్ణనే కాకుండా మిగతా ఇంటిసభ్యులకి సైతం చిరాకుని కలిగిస్తున్నాయి.

దానితో అటువంటి మాటలని తమన్నా అనకుండా చూసేందుకు.. మిగతా ఇంటి సభ్యులు ప్రయత్నిస్తున్నప్పటికీ తన ధోరణిని ఏమాత్రం మార్చుకోవడంలేదు. సరికదా.. “అలా అనకూడదు” అని చెప్పిన మిగతా ఇంటి సభ్యులని పైన కూడా తన విమర్శలతో విరుచుకుపడుతోంది. అందులో భాగంగానే శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి & అలీలతో తమన్నా వాగ్వాదానికి దిగింది. దీంతో బిగ్‌‌బాస్ హౌస్‌లో పరిస్థితి మరింతగా దిగజారినట్లయింది.

బిగ్‌బాస్ హౌస్‌లో తమన్నా ప్రవర్తన గత రెండు రోజుల నుండి ఆక్షేపణీయంగా ఉంది. దీనితో షో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈమె పట్ల ఒకింత అసహనానికి గురవడం మొదలైంది. తమన్నా ప్రవర్తన ఇదే రీతిలో ఉంటే.. కచ్చితంగా ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి వెళ్లిపోయే సభ్యురాలు.. ఆమె మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

బిగ్ బాస్ తెలుగు: నామినేషన్ ప్రక్రియలో హల్చల్ చేసిన పునర్నవి & తమన్నా

ఇక ఈ తరుణంలో తనని తీవ్రస్థాయిలో తమన్నా విమర్శిస్తున్నప్పటికి.. రవి ఏమాత్రం కూడా సమన్వయం కోల్పోకుండా ఉంటున్న తీరు అందరి చేత భేష్ అనిపించుకుంటుంది. ఎందుకంటే మన చుట్టూ తిరుగుతూ.. కావాలని టార్గెట్ చేస్తుంటే, ఎవ్వరికైనా కోపం వస్తుంది. అటువంటి స్థితిలో కూడా చాలా సహనం చూపిస్తుండడం నిజంగా అభినందించాల్సిన అంశం.

మరి బిగ్‌బాస్ హౌస్‌లో.. తమన్నా వ్యవహారశైలిని గురించి వారాంతంలో వచ్చే నాగార్జున ఏమంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఆయన ఇంటిలో జరిగే సిల్లీ గొడవల గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. మరి తమన్నా చేస్తున్న పనులు, తోటి సభ్యులని దూషిస్తున్న వైనాన్ని ఆయన ఎలా విశ్లేషిస్తారు? అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.

ఇదిలావుండగా మూడవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టాస్క్‌లో భాగంగా.. ఊరి దొంగలుగా శ్రీముఖి, అషూ రెడ్డి & రవికృష్ణ హూస్‌లో హల్చల్ చేశారు. వారిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా బాబా భాస్కర్, కానిస్టేబుల్‌గా శివజ్యోతి నటించారు.

ఇక ఆ ఊరి పెద్దగా వరుణ్ సందేశ్, ఆయన భార్యగా తమన్నా చేస్తుండగా.. వరుణ్ తమ్ముడిగా అలీ, అతని భార్యగా పునర్నవి టాస్క్‌లో మనకి కనిపించారు. ఇక మిగిలిన ఇంటి సభ్యులైన రాహుల్, మహేష్ విట్టా, రోహిణి, వితికలు.. అన్నా చెల్లెలుగా నటిస్తుంటే  దొంగలని పోలీసుల నుండి విడిపించే లాయర్‌గా హిమజ నటించింది.

ఈ టాస్క్‌లో భాగంగా.. తమకి కేటాయించిన పాత్రల్లో బాగా అభినయించిన వారికి కెప్టెన్సీ కోసం పోటీ పడేందుకు అర్హత లభిస్తుంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో రెండవ కెప్టెన్ ఎవరు అనేది.. దాదాపు ఈ టాస్క్ ద్వారా తేలిపోతుంది. చూద్దాం.. వరుణ్ సందేశ్ తరువాత ఈ ఇంటిని ఎవరు లీడ్ చేయనున్నారో…            

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?

Read More From Bigg Boss