Celebrity gossip

పండంటి ఆడపిల్లకు.. జన్మనిచ్చిన సింగర్ గీతా మాధురి ..!

Babu Koilada  |  Aug 17, 2019
పండంటి ఆడపిల్లకు.. జన్మనిచ్చిన సింగర్ గీతా మాధురి ..!

ప్రముఖ టాలీవుడ్ (Tollywood) సింగర్ గీతా మాధురి (Geetha Madhuri) భర్త నందు తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా.. ఆమె అభిమానులందరికీ ఓ తీపి కబురును పంచారు.  ఈ నెల 9వ తేదిన గీతా మాధురికి ఆడబిడ్డ జన్మించిందని.. తల్లీ బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆయన తెలిపారు. వారి ఫోటోను కూడా పోస్టు చేశారు. గీతా మాధురి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గాయనిగానే కాకుండా.. మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగా సుపరిచితులు. “బిగ్ బాస్ 2″లో రన్నరప్‌గా గెలిచి కూడా అప్పట్లో వార్తల్లో నిలిచారామె.              

ఈ అమ్మాయిలు నడిపే రాక్ బ్యాండ్ చాలా స్పెషల్.. ఎందుకంటే..?

పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన గీతా మాధురి.. చాలా చిన్న వయసులోనే హైదరాబాద్ ప్రాంతానికి తన తల్లిదండ్రులతో సహా వచ్చారు. వనస్థలిపురంలోని లయోలా స్కూలులోనే ఆమె చదువుకున్నారు. ఆమె సింగింగ్ టాలెంట్ చూసి.. తన తండ్రి ఆమెను లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో చేర్పించారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు రామాచారి వద్ద ఆమె శిష్యరికం చేశారు. ఈటీవీలో ప్రసారమైన “సై సింగర్స్ ఛాలెంజ్ “లో ఫైనలిస్టుగా ఎంపికయ్యాక.. ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది. 

తల్లి కాబోతున్న గీతామాధురి.. సీమంతం ఫొటోలతో అందరికీ సర్ ప్రైజ్..!

కులశేఖర్ దర్శకత్వం వహించిన “ప్రేమలేఖ రాశా” చిత్రంలో తొలిసారిగా పాట పాడిన గీతా మాధురి.. ఆ తర్వాత “నచ్చావులే” చిత్రంలోని “నిన్నే నిన్నే చూశా” గీతం ద్వారా గాయనిగా బాగా పాపులర్ అయ్యారు. ఇదే పాటకు ఆమె తొలిసారిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. 2014లో టాలీవుడ్ నటుడు నందుని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. “అదితి” అనే షార్ట్ ఫిలింలో ఈ భార్యా, భర్తలిద్దరూ కలిసి నటించడం విశేషం. టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఈ జంట ప్రస్తావన ఎప్పుడూ వస్తూ ఉంటుంది.                                                 

 

 

బాహుబలి చిత్రంలోని “జీవనది” పాటకు.. అలాగే గోలిమార్ చిత్రంలోని “మగాళ్లు ఒట్టి మాయగాళ్లే” పాటకు గీతా మాధురి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే జనతా గ్యారేజ్ చిత్రంలోని “పక్కా లోకల్” పాటకు ఐఫా పురస్కారం కూడా అందుకున్నారు. గరుడవేగ చిత్రంలోని “డియ్యో డియ్యో”.. అలాగే మిర్చి సినిమాలోని “డార్లింగే”… శ్రీమంతుడు చిత్రంలోని “దిమ్మతిరిగే దిమ్మాతిరిగే” సాంగ్స్ గీతా మాధురికి మంచి పేరు తీసుకొచ్చాయి.

వన కన్యలా మెరిసిన గీతా మాధురి.. తన మెటర్నిటీ ఫొటోషూట్ చూశారా?

ఎక్కువగా మాస్ పాటలే పాడుతారని గీతామాధురికి పేరున్నా.. మంచి మెలోడీలు, లవ్ సాంగ్స్ పాడడంలో కూడా గీత తనదైన శైలిలో రాణించారు. మనసారా చిత్రంలోని “ఫరవాలేదు”.. లాంటి మంచి పాటలు కూడా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. అలాగే ఇళయారాజాతో కలిసి.. విదేశాలలో పర్యటించి అక్కడ పాటలు పాడే అరుదైన అవకాశాన్ని కూడా గీతామాధురి దక్కించుకున్నారు. సింగపూర్, దుబాయ్, లండన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలలో ఆమె తన గళాన్ని వినిపించారు.

సంగీత దర్శకులు కోటి, కీరవాణి, దేవీశ్రీ ప్రసాద్, అనూప్ రూబెన్స్, వందేమాతరం శ్రీనివాస్.. మొదలైన వారితో కలిసి గీతామాధురి పలు ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఈటీవీ మ్యూజికల్ షో “స్వరాభిషేకం”లో కూడా ఆమె పార్టిసిపేట్ చేసి ఆహుతులను అలరించారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

Read More From Celebrity gossip