logo
Logo
User
home / Health
శీతాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ..!

శీతాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే ..!

(Precautions to stay healthy in Winter Season)

శీతాకాలంలో  వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి.. ఎంతో హాయిగా, ఆనందంగా గడపవచ్చని అనుకుంటాం. అయితే ఈ కాలంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా సరే.. మనం అనారోగ్యం బారినపడటం తథ్యం. దీనికి ప్రధాన కారణం – గాలిలోని క్రిమి కీటకాలు తగినంత ఉష్ణోగ్రతలు నమోదు కాని కారణంగా .. చనిపోకుండా మనిషి తీసుకునే శ్వాస ద్వారా శరీరంలోకి చేరి మన అనారోగ్యానికి కారణమవుతుంటాయి. 

బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!

మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? చలికాలంలో సహజంగా వచ్చే అనారోగ్య సమస్యల నుండి ఎలా బయటపడాలి ? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

స్వెటర్స్

చల్లని వాతావరణంలో మనం బయటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు.. తప్పనిసరిగా మన శరీరాన్ని స్వెటర్స్‌తో కప్పుకోవడం ఎంతో మంచిది. రాత్రి సమయాల్లో కూడా ఇంట్లో ఉన్నప్పుడు.. కాళ్ళకి సాక్స్ వేసుకుని నిద్రించడం శ్రేయస్కరం. 

వ్యక్తిగత పరిశుభ్రత

ఏదైనా తినే ముందు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే చలికాలం మాత్రం ఈ పద్ధతిని తప్పకుండా పాటించాలి. ఎందుకంటే, చలికాలంలో క్రిములు వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వలన త్వరగా చనిపోవు. అందుకే మనం సాధ్యమైనంత వరకూ వ్యక్తిగత శుభ్రతను పాటించడం వలన.. బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధుల నుండి మనం బయటపడవచ్చు. 

చల్లటి నీటికి దూరంగా ఉండడం

నేడు ప్రతీ ఇంట్లో ఫ్రిజ్ ఉంది. ఈ క్రమంలో చల్లని నీరు తాగకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. అయితే శీతాకాలంలో మాత్రం.. చల్లటి నీరుకి దూరంగా ఉండడమే శ్రేయస్కరమని చెబుతున్నారు. ఎందుకంటే అప్పటికే బయటి  వాతావరణం ప్రభావం ఎంతో కొంత మన శరీరం పై పడుతుంటుంది.. దానికి తోడుగా చల్లటి ఆహారం లేదా ద్రవ పదార్దాలను తీసుకోవడం వల్ల శరీరంలో సమతుల్యం దెబ్బతిని అనవసరమైన రోగాలు వస్తాయి. 

చర్మం పొడిబారకుండా చూసుకోవడం

గాలిలో ఉండే తేమ శాతం తగ్గడం కారణంగా మన చర్మం పొడిబారిపోతుంటుంది. దీని కారణంగా చర్మం పై ఎర్రటి మచ్చలు ఏర్పడడంతో పాటు.. అనేక చర్మ సంబంధిత వ్యాధులు కూడా సంక్రమిస్తుంటాయి. అందుకే దీనికి నివారణగా మార్కెట్‌లో లభించే మాయిశ్చరైజర్స్‌ని ఉపయోగించడం మంచిది. అప్పుడు చర్మం పొడిబారకుండా ఉంటుంది. 

‘పవర్ యోగా’తో.. మనకు కలిగే ప్రయోజనాలెన్నో ..!

నిద్రకు సమయం ఇవ్వడం

చలికాలంలో మనం త్వరగా అలిసిపోతుంటాం. పైగా ఇతర కాలాలతో పోలిస్తే, చలికాలంలో  సమయం త్వరగా ముగుస్తుంది. అందుకే మన శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. అదే క్రమంలో త్వరగా నిద్రకు ఉపక్రమిస్తే ఇంకా మంచిది. 

ఆకు కూరలు, పండ్లు

చలికాలంలో మన ఆరోగ్యం మెరుగుపడాలంటే.. మనం తీసుకునే ఆహారం కూడా సదరు వాతావరణానికి అనుకూలంగా ఉండాలి. ప్రధానంగా ఆకు కూరలు లేదా కూరగాయలు ఈ సమయంలో.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే సీ విటమిన్ కలిగిన పండ్లు తీసుకోవడం వల్ల కూడా.. మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. 

ఇంటిలోనే వ్యాయామం

ప్రతిరోజు ఉదయం వాకింగ్ లేదా వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు.. ఈ చలికాలంలో మాత్రం వారి వర్కవుట్‌ని ఇంటిలోనే ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే శీతాకాలంలో ఉదయం వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటుగా.. గాలిలో కూడా తేమ శాతం తక్కువగా ఉంటుంది. ఇది వ్యాయామం చేసేవారికి అంత అనుకూలమైన వాతావరణం కాదు. అందుకనే, ఈ చలికాలంలో మాత్రం మీ వర్కవుట్స్‌ని ఇంటిలోనే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.

ఇవండీ.. మీరు చలికాలంలో ఆరోగ్యంగా (healthy) ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు (precautions).

రోజులో గంటల తరబడి కూర్చోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఇవే

09 Jan 2020

Read More

read more articles like this

Read More

read more articles like this
good points logo

good points text