ADVERTISEMENT
home / Health
నొప్పి, మొటిమలు ఇంకా ఎన్నో.. ఇబ్బందిపెట్టే పిరియడ్ సమస్యలకు పరిష్కారాలివే..

నొప్పి, మొటిమలు ఇంకా ఎన్నో.. ఇబ్బందిపెట్టే పిరియడ్ సమస్యలకు పరిష్కారాలివే..

పిరియడ్స్ (periods) .. ప్రతి అమ్మాయికీ సుపరిచితమైన పదమే ఇది. నెల నెలా మనల్ని చూసేందుకు వచ్చే బంధువులా.. క్రమం తప్పకుండా మనల్ని ఇబ్బంది పెట్టేందుకు వచ్చే ఈ నెలసరి అంటే.. చాలామందికి ఇష్టం ఉండదు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. భరించలేని కడుపు నొప్పి నుంచి అసౌకర్యం వరకూ.. ఎన్నెన్నో సమస్యలు (problems) తన వెంట తీసుకొస్తుందీ నెలసరి. బిడ్డను కనలేకపోతున్నందుకు.. మన శరీరం మనల్ని శిక్షిస్తోందా? అని అనిపించేలా ఉండే ఈ ప్రక్రియ మనకు మంచిదే.

ఎందుకంటే దీని వల్ల మన శరీరం హానికరమైన టాక్సిన్లను కూడా దూరం చేసుకుంటుంది. కాకపోతే మనం చేసే క్లెన్సింగ్ ప్రక్రియకు ఇది చాలా భిన్నమైనది. నొప్పితో కూడుకున్నది కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే.. పిరియడ్స్ వల్ల మనం ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉంటాయి. వాటన్నింటికీ కొన్ని చిట్కాల సాయంతో పరిష్కారం పొందచ్చు. ఈ క్రమంలో మేం సూచించే పలు చిట్కాలు.. మీ సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడతాయేమో ఓసారి చదివేయండి..

Also Read పీసీఓఎస్‌కి కార‌ణాలేంటి? (Causes Of PCOS)

ADVERTISEMENT

1. అబ్బా.. నొప్పి.. భరించలేని నొప్పి..

సాధారణంగా పిరియడ్స్ వస్తే.. మరీ అంత ఎక్కువగా ఇబ్బంది ఉండదేమో. కానీ మన శరీరం లోపలి భాగాలు వాషింగ్ మెషీన్‌లా మనల్ని తిప్పి తిప్పి వదిలిపెడుతుంటే.. ఆ ఫీలింగ్ భరిస్తే కానీ చెప్పలేం అనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడానికి సులువైన మార్గం కాపడం పెట్టుకోవడం. వేడి తగిలితే ఈ నొప్పి తగ్గుతుంది. అందుకే వేడినీటితో కూడిన బ్యాగ్‌ని కడుపుపై పెట్టుకోవడం.. ఒకవేళ అలాంటి రబ్బర్ బ్యాగ్ లేకపోతే ఒక సాక్స్‌లో బియ్యం నింపి దాన్ని ఒవెన్‌లో కాసేపు ఉంచాల. తర్వాత దాన్ని పొట్టపై పెట్టుకోవడం వల్ల కూడా.. పొట్టకు మీరు కాపడం పెట్టుకునే వీలుంటుంది. ఇది నొప్పిని వీలైనంత త్వరగా తగ్గిస్తుంది.

2. పొట్ట ఉబ్బరం తగ్గాలంటే..

పిరియడ్స్ సమయంలో ఇబ్బందిపెట్టే మరో ముఖ్యమైన సమస్య కడుపుబ్బరం. అప్పటికే ఉన్న కడుపు నొప్పి సరిపోదని.. ఇంకా గ్యాస్ వల్ల పొట్టంతా బరువుగా, గట్టిగా మారిపోయి మనల్ని మరింత ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి మీరు తీసుకునే ఉప్పు, ఆల్కహాల్ తగ్గించే ప్రయత్నం చేయండి. అంతేకాదు.. ఈ ఐదు రోజులు వీలైనంత ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోండి. ఇవి ఎక్కువగా ఉండే వాల్ నట్స్, సబ్జ గింజలు, జనపనార విత్తనాలు (హెంప్ సీడ్స్) వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

3. మొండి మొటిమలు..

పిరియడ్స్ సమయంలో ఇబ్బందిపెట్టే సమస్యల్లో మరొకటి.. ముఖంపై ఉబ్బెత్తుగా కనిపించే మొటిమలు. నెలసరి సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల చర్మం నూనెను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ సెబమ్ ఎక్కువగా విడుదలవడం వల్ల మొటిమలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.

ADVERTISEMENT

ఈ మాట వినగానే ఆయిల్ రిమూవింగ్ క్లెన్సర్, ఆయిల్ కంట్రోల్ మాయిశ్చరైజర్ వాడాలని మీరు భావిస్తుంటారేమో. కానీ అది తప్పు.. చర్మంపై ఎక్కువగా ఉన్న నూనెను తీసేయాలే తప్ప.. మొత్తం నూనెలను తీసేసి చర్మాన్ని పొడిబార్చే ఉత్పత్తులను మీరు ఉపయోగించకూడదు. అందుకే ఎప్పటికప్పుడు బ్లాటింగ్ పేపర్‌తో ఎక్కువగా ఉండే నూనెను తుడిచేయాలి. దీంతో పాటు చర్మానికి టోనర్‌ని కూడా ఉపయోగించాలి.

4. ఆ దురద.. రాషెస్ దూరమిలా..

పిరియడ్స్ సమయంలో మీ శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ యోని పొడిబారిపోతూ ఉంటుంది. దీంతో పాటు శానిటరీ నాప్ కిన్స్ వాడడం వల్ల వాటి రాపిడి కూడా ఉంటుంది. కాబట్టి జననాంగాల దగ్గర చర్మం ర్యాష్‌కి గురవుతుంది. అంతేకాదు.. శానిటరీ న్యాప్ కిన్‌ని ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల వేడిగా, మంట పుట్టే ఫీలింగ్ కూడా కలుగుతుంది. వీటన్నింటినీ తొలగించుకోవాలంటే మీరు ఉపయోగించే ప్యాడ్స్ విషయంలో జాగ్రత్త వహించాలి.

POPxo పాఠకులకు మేం నిర్వహించిన ఓ సర్వేలో.. 83 శాతం మంది పిరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఈ ర్యాషెస్ వల్ల తమకు చిరాగ్గా అనిపిస్తుందని చెప్పారు. 50 శాతం మంది మాత్రం శ్యానిటరీ న్యాప్‌కిన్లు తరచూ మార్చుకుంటామని చెప్పారు. అందుకే మేం సోఫీ కూల్ న్యాప్ కిన్‌ని ఉపయోగించమని సలహా ఇస్తుంటాం. ఇది విభిన్నమైన కూల్ ప్యాడ్ టెక్నాలజీతో తయారైంది. కాబట్టి మీకు చక్కటి.. చల్లని ఫీలింగ్‌ని అందిస్తుంది. వేడిగా, దురద పెట్టే ఫీలింగ్‌ని దూరం చేస్తుంది. మంచి సువాసనను కూడా అందిస్తుంది. కాబట్టి మీరు రోజంతా ఫ్రెష్‌గా కనిపించవచ్చు.

ADVERTISEMENT

5. ప్రశాంతత.. ఎక్కడుంది?

లోపలి నుంచే కాదు.. పిరియడ్స్ బయట నుంచి కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా పిరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల్లో తలనొప్పి ముఖ్యమైనది. తలనొప్పి అంటే సాధారణమైనది మాత్రం కాదు.. మీ మెదడును సూదులతో గుచ్చుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. దీనికి చాలామంది పెయిన్ కిల్లర్స్ ఉపయోగించి.. తమ నొప్పి తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. దీనికి బదులు మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కెఫీన్ తగ్గించాలి. అప్పుడు తలనొప్పి దానంతట అదే తగ్గుతుంది. ఇది కాస్త కష్టమే.. అయితే చేస్తే మంచి ఫలితాలుంటాయి.

6. ఆ వరద ఆగదే..

పిరియడ్స్ సమయంలో కొందరికి బ్లీడింగ్ తక్కువయితే.. మరికొందరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ జరిగి దుస్తులకు మరకలు అవుతాయో అని రోజంతా భయమేస్తుంది. మేం నిర్వహించిన సర్వే ప్రకారం 36 శాతం మంది మాత్రమే తమ ప్యాడ్స్ బాగా పీల్చుకునే లక్షణాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు.

అందుకే ఒకవేళ మీకు రాత్రుళ్లు దుస్తులకు మరకలవుతాయని భయం వెంటాడుతూ ఉంటే..  సోఫీ కూల్ ప్యాడ్స్ ఉపయోగించండి. వీటికి ఉన్న డీప్ అబ్సార్బెంట్ షీట్స్ ఆఖరి లేయర్ వరకూ పీల్చుకొని లీకేజ్ లేకుండా కాపాడుతాయి. అయితే పిరియడ్స్ సమయంలో ఉన్న ఇబ్బందిని మేం దూరం చేయలేం. కానీ ఈ విషయాలను ప్రయత్నిస్తే అవి కాస్తయినా తగ్గుతాయని మా నమ్మకం.

ఇది సోఫీ వారి ప్రాయోజిత కథనం.

ADVERTISEMENT

Images : Shutterstock

ఇవి కూడా చదవండి.

పీరియడ్స్ గురించి ఏం చెబుతుందో తెలుసా?

ఎంత ప్ర‌య‌త్నించినా బ‌రువు పెరుగుతూనే ఉన్నారా? పీసీఓఎస్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..!

ADVERTISEMENT

పిరియడ్స్ సమయంలో నొప్పి తగ్గడానికి.. వివిధ దేశాల అమ్మాయిలు వాడే చిట్కాలివే

తొందరగా గర్భం దాల్చేందుకు.. ఈ చిట్కాలు మీకు తప్పనిసరి..

13 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT