ADVERTISEMENT
home / Celebrity Style
స్టైలిష్‌గా క‌నిపించాలా?? అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్స్‌ని ఫాలో అవ్వండి!

స్టైలిష్‌గా క‌నిపించాలా?? అయితే ఈ టాలీవుడ్ హీరోయిన్స్‌ని ఫాలో అవ్వండి!

అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాల‌ని అమ్మాయిలు కోరుకోవ‌డం స‌హ‌జ‌మే. అయితే కాలేజీ, ఆఫీసుకు వెళ్లేవారు మాత్రం వీటితో పాటు కాస్త స్టైలిష్‌గా క‌నిపించాల‌ని కూడా ఆశిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో వ‌చ్చే తాజా అప్ డేట్స్ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ వాటిలో త‌మ‌కు న‌చ్చిన వాటిని ధ‌రించేందుకు మ‌క్కువ చూపిస్తుంటారు. కానీ స్టైలిష్‌, ఫ్యాష‌న‌బుల్ అన‌గానే చాలామంది బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల వైపే చూడ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ఈరోజుల్లో మ‌న టాలీవుడ్ (Tollywood) అందాల భామ‌లు సైతం ఫ్యాష‌న్ విష‌యంలో ఏమీ తీసిపోవ‌డం లేదు. కావాలంటే మీరే చూడండి..

 టాలీవుడ్ క్యూట్ బ్యూటీ స‌మంత అక్కినేని (Samantha Akkineni) ధ‌రించిన అవుట్‌ఫిట్ చూడండి. ప‌సుపు రంగు చుడీదార్ కి సీక్వెన్ వ‌ర్క్ ఉన్న తెలుపు రంగు దుప‌ట్టా జ‌త చేసి ఎంత అందంగా మెరిసిపోతోందో! ప్ర‌ముఖ డిజైన‌ర్ స‌బ్య‌సాచి రూపొందించిన స్లీవ్ లెస్ టాప్ కి అదే రంగు బాట‌మ్ ని జ‌త చేసిన సామ్ ఆ డ్ర‌స్ తో ధ‌రించిన దుప‌ట్టాతో స్పెష‌ల్ లుక్‌ని సొంతం చేసుకుంది. ఇక యాక్సెస‌రీస్ ని ఎంతో మితంగా ధ‌రించే స‌మ‌యంత ఈసారి కూడా అదే ఫాలో అయింది. కిష‌న్‌దాస్ జ్యుయ‌ల‌ర్స్ రూపొందించిన అంద‌మైన చోక‌ర్, ఇయ‌ర్ రింగ్ సెట్ తో సింపుల్ గానే స్టైలిష్ లుక్ తో అద‌ర‌గొట్టింది. ఇక మేక‌ప్ విష‌యానికి వ‌స్తే అధ‌రాల‌కు న్యూడ్ లిప్ స్టిక్ షేడ్ ఉప‌యోగించి, క‌ళ్ల‌ను వింగ్డ్ ఐ లైన‌ర్ తో ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దుకుంది. ఇక అవుట్‌ఫిట్‌కు మ్యాచ‌య్యేలా స్లీక్ హెయిర్ స్టైల్ తో అప‌రంజి బొమ్మ‌ని త‌ల‌పించింది మ‌న సామ్. 

ర‌ష్మికా మంద‌న‌ (Rashmika Mandanna).. లేటెస్ట్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టినా త‌న‌దైన ఫ్యాష‌న్ సెన్స్ తో అంద‌రినీ ఆక‌ట్ట‌కుంటుందీ అందాల బొమ్మ‌. సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వేడుక‌లు, కార్య‌క్ర‌మాల్లోనే కాకుండా ప‌లు ప్రైవేట్ ఈవెంట్స్ కు సైతం హాజ‌ర‌య్యే ఈ ముద్దుగుమ్మ త‌న ఫ్యాష‌న్స్ తో అంద‌రిలోనూ సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ గా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంట‌వి అతిశ‌యోక్తి లేదు. తాజాగా జ‌రిగిన జీ సినీ అవార్డుల కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఈ అమ్మ‌డు ఎంచుకున్న అవుట్‌ఫిట్ ఇందుకు నిద‌ర్శ‌నం అని చెప్ప‌చ్చు. కొవెట్ ఆన్ లైన్ రూపొందించిన ఐవ‌రీ క‌ల‌ర్ టైల‌ర్డ్ సూట్ లో ఇటు హుందాగా, అటు ఫ్యాష‌న్ క్వీన్ లా మెరిసిపోయింది. ఇక ఈ అవుట్‌ఫిట్‌కి సింపుల్‌గా డైమండ్ నెక్లెస్ తో క్లాసీ ట‌చ్ ఇచ్చింది. మేక‌ప్లో భాగంగా అధ‌రాల‌కు ఎరుపు రంగు లిప్ స్టిక్ వేసుకున్న ర‌ష్మిక జుట్టును వ‌దులుగా ఉంచ‌డంతో త‌న లుక్ ని పూర్తి చేసింది. ఇది ఆఫీసుకు వెళ్లే మ‌హిళ‌ల‌కే కాదు.. కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిల‌కూ చ‌క్క‌గా న‌ప్పే ఫ్యాష‌న్‌.

మ్యాంగో ఎల్లో.. ఈ క‌ల‌ర్ అంటే ఇష్ట‌ప‌డే వారు చాలామందే ఉంటారు. న‌లుగురిలోనూ మ‌న‌ల్ని భిన్నంగా, అందంగా క‌నిపించేలా చేసే ఈ క‌ల‌ర్ ఆర్గంజా శారీలో అదిరిపోయే లుక్ సొంతం చేసుకోవాలంటే మ‌న టాలీవుడ్ బ్యూటీ లావ‌ణ్యా త్రిపాఠి (Lavanya Tripathi)ని ఫాలో అవ్వాల్సిందే. స‌న్న‌పాటి అంచు ఉన్న ప్లెయిన్ మ్యాంగో ఎల్లో షేడ్ శారీకి సిల్వ‌ర్ బ్లౌజ్ జ‌త చేసిన లావ‌ణ్య కేవ‌లం యాంటిక్ సిల్వ‌ర్ ఇయ‌ర్ రింగ్స్ ని ఉప‌యోగించి స్టైలిష్ ట‌చ‌ప్ ఇచ్చింది. మేక‌ప్ కూడా చాలా త‌క్కువ‌గానే ఉప‌యోగించిన ఈ అందాల భామ అధ‌రాల‌కు మాత్రం లైట్ పింక్ షేడ్ లిప్ స్టిక్ వేసుకుని త‌న లుక్ ని పూర్తి చేసింది.

ADVERTISEMENT

 

వ‌య‌సుతో సంబంధం లేకుండా మ‌హిళ‌లంతా ఇష్ట‌ప‌డే రంగుల్లో న‌లుపు ఎప్పుడూ ముందు వ‌రుస‌లోనే ఉంటుంది. అలాంటి న‌లుపు రంగులోనే సింపుల్‌గా, స్టైలిష్‌గా మెరిసిపోవాలంటే మ‌న టాలీవుడ్ బ్యూటీ మెహ‌రీన్ (Mehreen) ని ఫాలో అవ్వాల్సిందే! సాహిల్ కొచ్చ‌ర్ రూపొందించిన ఈ అవుట్‌ఫిట్ కాలేజీలో జ‌రిగే వేడుక‌ల‌కే కాదు.. పండ‌గ‌లు, పార్టీలు.. వంటి సంద‌ర్భాల్లో మ‌హిళ‌లు కూడా ధ‌రించ‌వ‌చ్చు. పైగా ఈ త‌ర‌హా అవుట్‌ఫిట్స్ కు యాక్సెస‌రీస్ కూడా పెద్ద‌గా అవ‌స‌రం ఉండ‌వు. ఈ విష‌యం మెహ‌రీన్ ను చూస్తేనే మ‌న‌కు తెలిసిపోతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

స్టైలిష్‌గా క‌నిపించాలంటే.. ఈ బేసిక్ ఫ్యాష‌న్ రూల్స్ ఫాలో కావాల్సిందే!

ADVERTISEMENT

ఆఫీసులో స్టైల్‌ గా మెరిసిపోవాలంటే .. ఈ ఫ్యాషన్ ఫాలో అవ్వాల్సిందే..!

ఈ బీటౌన్ కలర్ కాంబినేషన్స్‌లో.. మీరు అందంగా మెరిసిపోతారు

21 Jan 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT