ADVERTISEMENT
home / వెల్‌నెస్
శృంగారంలో.. భంగిమలు ఎలాంటి పాత్రలు పోషిస్తాయో తెలుసా..?

శృంగారంలో.. భంగిమలు ఎలాంటి పాత్రలు పోషిస్తాయో తెలుసా..?

సెక్స్ (sex) గురించి అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా ఎన్నో సందేహాలు. తమ మనసులో ఏముందో భాగస్వామికి చెప్పడానికి కూడా భయపడుతుంటారు చాలామంది. మరికొందరు అసలు సెక్స్‌లో తమకేం కావాలో కూడా అర్థం చేసుకోలేరు. దీనివల్ల సెక్స్ అనేది ఫీలింగ్స్‌కి సంబంధించిన విషయంగా.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే ప్రక్రియగా కాకుండా ఏదో యాంత్రికంగా సాగిపోయే ప్రక్రియగా మారిపోతుంది.

సెక్స్ అంటే కేవలం ఏదో ఒక భంగిమలో యాంత్రికంగా చేసేది కాదు. ఇద్దరికీ ఇష్టమైతే విభిన్న రకాలుగా దీన్ని ప్రయత్నించి ఆనందపు అంచులను తాకవచ్చు. కొన్ని రకాల భంగిమలు అనుసరించడం వల్ల (positions) కొందరికి ఆర్గాజమ్ ఎక్కువగా వస్తుంటుంది.

అలాంటి భంగిమల్లో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వారికి పట్టలేని ఆనందం, తర్వాత మంచి సంతృప్తి దొరుకుతుంది. అలాంటి యాంగిల్స్ గురించి కనుక్కోవడానికి ఒకమ్మాయి ప్రముఖ సామాజిక వేదిక కోరాలో ప్రశ్నను పోస్ట్ చేయగా.. కొందరు అమ్మాయిలు తమకు నచ్చిన భంగిమ గురించి చెప్పడం విశేషం. ఆ సమాధానాలు తెలుసుకుందాం రండి..

1

1. బీటిల్ అయితే పర్ఫెక్ట్ అట..

ఓ పెళ్లైన మహిళ ఈ అంశం గురించి మాట్లాడుతూ బీటిల్ పొజిషన్ అయితే బాగుంటుంది అని చెప్పడం గమనార్హం. అబ్బాయి కంట్రోల్ చేసే ఎన్నో పొజిషన్స్ కంటే.. బీటిల్స్ పొజిషన్ అమ్మాయికి అదనపు కంట్రోల్‌ని అందిస్తుంది. ఈ భంగిమలో తన భాగస్వామిని కాస్త టీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే తనకు నచ్చిన వేగంతో శృంగారం చేసేందుకు ఉపయోగపడుతుంది. తనకు నచ్చిన స్టైల్‌లో సెక్స్ చేయడానికి అమ్మాయికి ఈ భంగిమ ఉపకరిస్తుంది. భాగస్వామి మరింతగా శృంగారం కావాలని కోరుకునేలా చేస్తుందీ పొజిషన్.

ADVERTISEMENT

giphy

2. కౌగర్ల్‌గా కావాల్సినంత ఆనందం..

కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి.. కౌగర్ల్ పొజిషన్ అయితే అమ్మాయిలకు బెస్ట్ పొజిషన్ అని చెప్పడం గమనార్హం. ఇది అమ్మాయిలు స్పీడ్, కంట్రోల్ వంటివన్నీ తన ఆధీనంలో ఉండేలా చేస్తూ.. శృంగారం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందట. అంతేకాదు.. కావాలంటే ఈ పొజిషన్‌లో క్లిటోరిస్‌ని కూడా ప్రేరేపించడానికి ప్రయత్నించవచ్చు. 

giphy %282%29

3. డాగీ కాదు.. టైగర్ పొజిషన్

అలాగే ఓ అమ్మాయి ప్రకారం..  డాగీ పొజిషన్ అన్న పేరు చూసి మోసపోకూడదట. అది మీలోని పులిని బయటకు తీసుకొస్తుందట. మీ భర్తను బెడ్ పై పులిలా చూడాలనుకుంటే ఈ పొజిషన్ ఓసారి ప్రయత్నించమని తను చెబుతోంది. మీరు దీన్ని ఏ భంగిమగానైనా పిలిచినా ఫర్వాలేదు.. ఇది సెక్స్‌లో మీ ఆనందాన్ని 100 శాతం పెంచుతుంది.

చాలా సులువుగా శృంగారం చేయడానికి వీలుండే పొజిషన్ ఇది. ఈ భంగిమ వల్ల జీ స్పాట్ చాలా త్వరగా ప్రేరేపితమవుతుంది. ఇది ఒక రకంగా వైల్డ్ సెక్స్‌లా కనిపించినా.. ఆనందపు అంచులను చూడడానికి సరైన భంగిమ అని చెప్పుకోవచ్చు. నడుము భాగం బాగా తగులుతూ ఉండే ఈ భంగిమ వల్ల ఇద్దరికీ భావప్రాప్తి తొందరగా జరుగుతుంది. 

giphy %281%29

4. ఇద్దరికీ ఇష్టమైతే ఏదైనా బాగుంటుంది..

జాక్వీ ఒలీవర్ అనే అమ్మాయి కోరాలో సమాధానమిస్తూ చాలామంది అనుకున్నట్లుగా ఆర్గాజమ్ అన్నది కేవలం సెక్స్ పొజిషన్ పై ఆధారపడి ఉండదని చెప్పడం విశేషం. తన మనసు, ఇష్టం, తనపై చూపే ప్రేమ ఇవన్నీ తనకు మూడ్ తెప్పించి.. తను ఆనందంగా సెక్స్‌లో పాల్గొనేలా ప్రేరేపిస్తాయని.. తద్వారా భావప్రాప్తి పొందేలా చేస్తాయని ఆమె తెలిపింది.

ADVERTISEMENT

giphy %283%29

5. క్లిటోరిస్ దగ్గరే అసలైన కీ ఉంది..

లియా ప్రుష అనే ఓ అమ్మాయి కోరాలో సమాధానమిస్తూ – “మీరు మీ భాగస్వామికి మంచి ఆర్గాజమ్ ఇవ్వాలని కోరుకుంటే తన క్లిటోరిస్‌ను ప్రేరేపించాల్సి ఉంటుంది. తన క్లిటోరిస్ మీకు బాగా తగిలే పొజిషన్ ఏదైనా ఎంచుకోండి.సిజర్ స్టైల్, ఎక్స్ స్టైల్ వంటివి మీకు ఆనందాన్ని ఇస్తాయి” అని తెలిపింది.

మీరు కూడా తెలుసుకున్నారుగా.. శృంగారంలో భంగిమల పాత్ర ఏ విధంగా ఉంటుందో..? లేదంటే వాత్సాయన కామసూత్ర నుంచి మీకు నచ్చిన పొజిషన్ ఎంపిక చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి.

ADVERTISEMENT

సెక్స్ త‌ర్వాత.. అమ్మాయిలు ఏం ఆలోచిస్తారో మీకు తెలుసా..?

ముద్దులోనూ ఎన్నో ర‌కాలున్నాయి.. వాటి అర్థాలేంటో మీకు తెలుసా? (Types Of Kisses And Importance Of Kissing)

మొద‌టిసారి సెక్స్‌కి సంబంధించి.. మీకున్న ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానాలివే..!

Images : Giphy

ADVERTISEMENT
10 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT