ADVERTISEMENT
home / Celebrity Style
ఈ ఏడాది కేన్స్‌లో.. ఈ భామ‌ల అందాల‌ను చూడొచ్చు. ఎప్పుడో తెలుసా?

ఈ ఏడాది కేన్స్‌లో.. ఈ భామ‌ల అందాల‌ను చూడొచ్చు. ఎప్పుడో తెలుసా?

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ (cannes film festival).. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌రైన సినిమాలు, షోలు ప్ర‌ద‌ర్శించే అద్భుత‌మైన పండ‌గ ఇది. అయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో సినిమాల కంటే ఫ్యాష‌న్లదే ఎక్కువ హ‌వా అన్న‌ట్లు అనిపిస్తుంది. అందాల నాయిక‌లంద‌రూ అద్భుత‌మైన ఫ్యాష‌న్ల‌తో రెడ్ కార్పెట్ (red carpet) పై న‌డిచి మ‌న‌ల్ని ఆకట్టుకునే వేడుక ఇదే. ప్ర‌తి సారిలాగే ఈ ఏడాది కూడా 72 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ మ‌న‌ల్ని అలరించేందుకు సిద్ధ‌మైపోయింది.

14 మే నుంచి 25 మే వ‌ర‌కూ జ‌రిగే ఈ వేడుక‌ల‌కు మ‌న దేశం నుంచి కూడా.. ఈసారి చాలామంది అందాల తార‌లు హాజ‌ర‌వ్వ‌నున్నారు. మ‌రి, ఈ వేడుక‌ల‌కు వెళ్లి త‌మ ఫ్యాష‌న్ మెరుపులు మెరిపించనున్న ఆ క‌థానాయికలు ఎవ‌రో తెలుసుకుందాం రండి..

Deepika

దీపికా ప‌దుకొణె

గ‌త రెండేళ్ల నుంచి కేన్స్ చిత్రోత్స‌వంలో త‌న అందాల‌తో ఆక‌ట్టుకుంటోన్న దీపిక ఈ ఏడాది కూడా ఈ వేడుక‌ల్లో మెర‌వ‌నుంది. దీపిక మే 16 నుంచి కేన్స్‌లో పాల్గొన‌నుంద‌ట‌. ర‌ణ్‌ వీర్ సింగ్‌ని పెళ్లాడిన త‌ర్వాత ఆమెకు ఇది మొద‌టి కేన్స్‌.. మ‌రి, భ‌ర్త ఫ్యాష‌న్ ఛాయిస్‌లు ఆమె దుస్తుల ఎంపిక‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతాయో చూడాల్సిందే.

Aishwarya 841333

ఐశ్వ‌ర్యా రాయ్ బ‌చ్చ‌న్‌

2017లో బార్బీ బుట్ట‌బొమ్మ‌లా.. గ‌తేడాది రెడ్ కార్పెట్ పై న‌డిచేందుకు అంద‌మైన సీతాకోక చిలుక‌లా అద్బుతంగా మెరిసిన ఐశ్వ‌ర్య ఈసారి ఎలా క‌నిపిస్తుందో అని అభిమానులంతా వేచి చూస్తున్నారంటే అది అతిశ‌యోక్తి కాదు. త‌న కూతురు ఆరాధ్యతో క‌లిసి.. ఈ ఫంక్ష‌న్‌కి వెళ్లే ఐశ్వ‌ర్య ప్ర‌తిసారి లాగే ఈ ఏడాది కూడా మే 19 నుంచి వేడుక‌ల్లో పాల్గొన‌నుంది.

ADVERTISEMENT

sonam

సోన‌మ్ క‌పూర్ అహూజా

బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా సోన‌మ్ క‌పూర్‌.. త‌న ఫ్యాష‌న్ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరు ప్ర‌ఖ్యాత‌ులు సంపాదించిందీ బ్యూటీ. గ‌తేడాది పెళ్ల‌యిన వెంట‌నే కేన్స్ వేడుక‌ల్లో పాల్గొన్న ఈ బ్యూటీ ఈ ఏడాది మే 16 నుంచి 18 వ‌ర‌కూ కేన్స్‌లో త‌న అందాల‌తో, అంత‌కుమించిన ఫ్యాష‌న్ల‌తో రెడ్ కార్పెట్ పై మెర‌వ‌నుంద‌ట. లోరియాల్ ప్యారిస్ అంబాసిడ‌ర్‌గా ఈ వేడుక‌ల్లో పాల్గొన‌డం సోన‌మ్‌కి ఇది తొమ్మిదోసారి.

kangana

కంగ‌నా ర‌నౌత్‌

ఈసారి ఫ్రెంచ్ రివేరాలో మెర‌వ‌నున్న మ‌రో బ్యూటీ కంగ‌నా ర‌నౌత్‌. గ‌తేడాది నుంచి ఈ అందాల తార కేన్స్‌లో త‌ళుక్కున మెరుస్తోంది. విభిన్న‌మైన, బోల్డ్ దుస్తుల ఎంపిక‌తో అంద‌రి చూపునీ త‌న వైపు తిప్పుకుంటోంది. ఓ వోడ్కా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కేన్స్‌లో పాల్గొన‌నున్న కంగ‌న.. దాని కోసం కొన్ని నెల‌ల ముందు నుంచే దుస్తుల‌ను సిద్ధం చేయించింద‌ట‌. మ‌రి, ఈసారి కంగ‌న ఎంత బోల్డ్‌గా క‌నిపించనుందో తెలియాలంటే 16 వ‌ర‌కూ ఆగాల్సిందే. ఎందుకంటే ఈ అందాల భామ 16 నుంచి 18 వ‌ర‌కూ వేడుక‌ల్లో పాల్గొన‌నుంది.

Huma 1417609

హ్యూమా ఖురేషీ

గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సేపూర్ క‌థానాయిక హ్యూమా ఖురేషీ గ‌తంలోనూ కేన్స్ రెడ్ కార్పెట్ పై న‌డిచింది. ఈసారి కూడా త‌న‌ లుక్ ప్ర‌త్యేకంగా నిల‌వ‌నుంద‌ట‌. మే 19, 20 తేదీల్లో హ్యూమా కేన్స్ వేడుక‌ల్లో పాల్గొంటుంది.

hina

హీనా ఖాన్‌

యే రిష్తా క్యా కెహ‌లాతా హే.. (తెలుగులో స్టార్ మాలో ప్ర‌సార‌మ‌య్యే పెళ్లంటే నూరేళ్ల పంట సీరియ‌ల్ ) తో దేశ‌మంతా పాపుల‌ర్‌గా మారింది హీనా ఖాన్‌. సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించే త‌న‌లో మ‌రో యాంగిల్‌ని చూపేందుకు బిగ్ బాస్ 11, ఖ‌త్రోంకీ ఖిలాడీ వంటి గేమ్ షోల‌లో పాల్గొన‌డం మాత్ర‌మే కాదు.. ప్ర‌స్తుతం క‌సౌటీ జింద‌గీ కీ సీరియ‌ల్‌లో విల‌న్ పాత్ర‌ను కూడా పోషిస్తోంది. హీనా ఖాన్ న‌టించిన లైన్స్ అనే షార్ట్ ఫిల్మ్ కేన్స్‌కి ఎంపికవ‌డంతో దాని ప్రివ్యూకి గాను అక్క‌డికి వెళ్ల‌నుందీ అందాల న‌టి. త‌న మొద‌టి కేన్స్ ప్ర‌ద‌ర్శ‌న కోసం ఎంతో ప్రత్యేకంగా సిద్ధ‌మ‌వుతోంద‌ట ఈ బుల్లితెర ఫ్యాష‌నిస్టా.

ADVERTISEMENT

mallika

మ‌ల్లికా శెరావ‌త్

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా కేన్స్ వేడుక‌ల్లో పాల్గొంటోన్న మ‌రో న‌టి మ‌ల్లికా శెరావ‌త్. ఈ ఏడాది కూడా మే 16 నుంచి వేడుక‌ల్లో పాల్గొన‌నుంద‌ట ఈ బ్యూటీ. దాని కోసం ప్రిప‌రేష‌న్స్ కూడా ప్రారంభించి.. దానికి సంబంధించిన ఫొటోల‌ను కూడా పోస్ట్ చేస్తోంది.

మ‌రి, ఈ ఏడాది కేన్స్ వేదికపై మ‌న భార‌తీయ సోయ‌గాలు ఎలాంటి ఫ్యాష‌న్ మెరుపులు మెరిపిస్తాయో.. మ‌న చిత్ర వైభ‌వాన్ని ఎంత‌గా చాటుతాయో చూడాలి..

ఇవి కూడా చ‌ద‌వండి.

పెళ్లికి సిద్ధమైన మరో నటి.. ఎంగేజ్ మెంట్‌తో అందరికీ సర్ ప్రైజ్..!

ADVERTISEMENT

చర్మం పై మొండి మచ్చలా? వాటికి ఇలా చెక్ పెట్టండి..

స్నేహితురాలి పెళ్లిలో.. సమంత సందడి చూశారా?

Images : Instagram

13 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT