Entertainment

వివాదాస్పద వెబ్ సిరీస్ “లస్ట్ స్టోరీస్” తెలుగు వెర్షన్‌లో.. అందాల భామ ఈషా రెబ్బా ..!

Sandeep ThatlaSandeep Thatla  |  Nov 13, 2019
వివాదాస్పద వెబ్ సిరీస్ “లస్ట్ స్టోరీస్” తెలుగు వెర్షన్‌లో.. అందాల భామ ఈషా రెబ్బా ..!

తెలుగు చిత్రపరిశ్రమలో తెలుగు హీరోయిన్స్‌‌కి సరైన ఆదరణ లేదంటూ అప్పుడప్పుడు నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. వాస్తవంగా చూసినా కూడా.. ఇండస్ట్రీలో తెలుగు నటీమణుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఇటువంటి వాతావరణంలో వరంగల్ నుండి వచ్చి చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి ఈషా రెబ్బ (Eesha Rebba)

ఆమె తొలి చిత్రమే “స్వలింగ సంపర్కం”పై : హైదరాబాద్ నటి శ్రీదేవి చౌదరి డేరింగ్ నిర్ణయం

“అంతకు ముందు.. ఆ తరువాత” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈషా. అప్పటి నుండి కూడా  తన కెరీర్‌‌లో మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ నటిస్తూ వస్తోంది. అయితే ఆమెకి ఈమధ్యనే ఒక పెద్ద జాక్ పాట్ తగిలిందని చెప్పాలి. అదేంటంటే – 2018 లో హిందీలో లస్ట్ స్టోరీస్ (lust stories) పేరుతో ఒక వెబ్ సిరీస్ విడుదలైన సంగతి తెలిసిందే. ఓ నాలుగు చిన్న కథలతో ఈ సిరీస్‌ను రూపొందించి నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల చేశారు. 

ఇక ఈ లస్ట్ స్టోరీస్‌కి ఎంత ప్రజాదరణ లభించిదంటే.. ఈ సిరీస్‌‌లో నటించిన కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్ వంటి యువ కథానాయికలు ఇప్పుడు మంచి ఆఫర్స్ కూడా దక్కించుకుని కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఈ సిరీస్‌లో ఉన్నవి నాలుగు చిన్న కథలే అయినా.. ఆ నాలుగు కథలకి నలుగురు వేర్వేరు డైరెక్టర్లు దర్శకత్వం వహించడం విశేషం.  హిందీలో ఈ నాలుగు కథలకు అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీలు దర్శకత్వం వహించారు. ఆ కథలన్నీ కూడా చాలా వైవిధ్యమైనవి కావడం గమనార్హం. ప్రేమ గురించి తికమక పడే ఓ టీచర్.. ఓ సగటు పనిమనిషి జీవితం.. భర్త నుండి సరైన ప్రేమను పొందలేని భార్య.. లైంగిక సంతృప్తి పొందలేని ఓ కొత్త పెళ్లి కూతురు.. ఇలాంటి ఇతివృత్తాలని కథలుగా మలిచి ఈ లస్ట్ స్టోరీస్ సిరీస్‌ను రూపొందించారు.

అమ్మకు ప్రేమతో: 50 ఏళ్ళ తన తల్లికి.. వరుడిని వెతుకుతున్న 20 ఏళ్ళ కూతురు ..!

 

Eesha Rebba in Lust Stories (Instagram)

ఇప్పుడు తెలుగులో ఇదే సిరీస్ రీమేక్ కానుంది.  ఈ నాలుగు కథలకు యువ దర్శకులు సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి & సంకల్ప్ రెడ్డిలు దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం.. ఈ నలుగురిలో సందీప్ రెడ్డి వంగ & నందిని రెడ్డిలు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారని తెలుస్తోంది.  వీరి స్థానాల్లో ఆ రెండు కథలకి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది తెలియాల్సి ఉంది.

అయితే ఈషా రెబ్బ నటించే కథకి మాత్రం సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని టాక్. ఇక ఈ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే.. ఈ  నాలుగు కథలు కూడా స్త్రీ పాత్రని హైలైట్ చేస్తూ రాసినవే. ఈ క్రమంలో ఇప్పుడు ఈషా రెబ్బ ఏ కథలో నాయికగా కనిపిస్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది.

అయితే కొంతమంది మాత్రం.. హిందీలో తీసిన నాలుగు కథలనే తెలుగులో మళ్లీ తీయకపోవచ్చని అంటున్నారు. ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా వేరే కథలని కూడా ఈ సిరీస్‌లో భాగంగా తెరకెక్కించవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ సిరీస్‌లో నటించే నటీనటులు, దర్శకుల పూర్తి సమాచారం మాత్రం తెలియరావడం లేదు. ఈ విషయం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. కాకపోతే నెట్ ఫ్లిక్స్ (Netflix) కోసం ప్రత్యేకంగా తెలుగులో నిర్మితమవుతున్న.. ఈ లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుందనేది మాత్రం నిజం. అలాగే ఈ విషయమై అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుందని సమాచారం. 

ఏదేమైనా ఈ లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్.. వచ్చే ఏడాది మాత్రమే విడుదల అవుతుందని కచ్చితంగా చెప్పగలం. కారణం నాలుగు కథలను తెరకెక్కించాల్సి ఉండడం.. అలాగే వాటికి ఎవరు దర్శకత్వం వహించనున్నారో అన్న దాని పైన ఇంకా స్పష్టత రాకపోవడమే.

తెలుగు సినిమా హీరోలు బట్ట తలతో కనిపించే సాహసం చేయగలరా?