ADVERTISEMENT
home / Fitness
30 రోజుల పాటు షుగర్‌కి దూరంగా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

30 రోజుల పాటు షుగర్‌కి దూరంగా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

శారీకంగా ఫిట్‌గా ఉండటం.. అటు అందానికే కాదు.. ఇటు ఆరోగ్యానికీ మంచిది. కానీ సరైన వ్యాయామం లేకపోవడం, ఆహారం తినే విషయంలో నియంత్రణ లేకపోవడం వంటి కారణాల వల్ల మనం ఫిట్ నుంచి ఫ్యాట్‌గా తయారయ్యే అవకాశం ఉంది. దీనివల్ల అందం కన్నా ఆరోగ్యంపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. కాబట్టి మళ్లీ ఫిట్‌గా మారే ప్రయత్నం చేయడం మంచిది. ప్రస్తుతం నేను ఆ పనిలోనే ఉన్నా. ఎందుకంటే.. టీనేజర్‌గా నేను స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండేదాన్ని. ఎందుకంటే కాలేజీ రోజుల్లో సైకిల్ తొక్కడం, మార్నింగ్ వాక్ చేయడం చేసేదాన్ని.

ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోయింది. పైగా స్నేహితులతో కలసి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేదాన్ని. పైగా నేను stress eater ని. ఆహారం విషయంలో నాకు ఇంకో అలవాటు కూడా ఉంది. అదే పరిమితికి మించి తీపి తినడం. స్వీట్ లేకపోతే పంచదారైనా సరే నా నోట్లో పడాల్సిందే. ఇలాంటి అలవాట్ల కారణంగా నేను నెమ్మదిగా లావెక్కడం మొదలయ్యాను. కానీ నాకు ఇటీవలే నేను చేస్తున్న పొరపాటేమిటో తెలిసొచ్చింది.

చుట్టూ ఉండేవారు.. పెరుగుతున్న నా బరువు గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్లు ఈ విషయంలో నాకెలాంటి సాయం చేయరు కానీ.. మాటలు మాత్రం అంటారు. అప్పుడు నన్ను నేను చూసుకొన్నాను. అసలు ఏం చేస్తే బరువు తగ్గుతానా? బరువు తగ్గటం ఎలా? అని ఆలోచించాను.

నేను లావుగా ఉన్నా.. సన్నగా ఉన్నా నేను పెద్దగా పట్టించుకోను. కానీ అధిక బరువుని మాత్రం నేను అంగీకరించను. ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. అందుకే నేను మళ్లీ ఫిట్‌గా తయారవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిందనుకొని..  వ్యాయామం చేయడం ప్రారంభించాను.

ADVERTISEMENT

ఒక నెల వర్కవుట్లు చేసిన తర్వాత.. ఫిట్ నెస్ సాధించే విషయంలో మరో అడుగు ముందుకేయాలనుకొన్నాను.అందుకే నాకు బాగా ఇష్టమైన తీపి పదార్థాలను నెల రోజుల పాటు తినకుండా ఉండాలని నిశ్చయించుకొన్నాను. ఇన్నేళ్ల పాటు నా శరీరాన్ని కష్టపెట్టినందుకు ఇలా చేయాల్సిందే. దాదాపు నెలపాటు పంచదార (sugar), చాక్లెట్లు, కేక్, ఐస్ క్రీమ్, కాఫీ, టీ, స్వీట్స్ ఇలాంటి పదార్థాలన్నింటికీ దూరంగా ఉన్నాను.

Suger-free-month-1

ఓ పక్క వ్యాయామం చేస్తూనే.. మరో పక్క పంచదార లేకుండా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టాను. మొదట్లో తీపి తినకుండా ఉండటం చాలా కష్టంగానే ఉండేది. చాక్లెట్ కనిపిస్తే అసంకల్పితంగానే ప్రతిస్పందించే నా మెదడుని నియంత్రించుకోవడానికి చాలా కష్టంగా ఉండేది. పంచదార ఉత్పత్తులకు బదులుగా పండ్లు తీసుకోవడం ప్రారంభించాను. అలాగే ఆహారంలోనూ చిన్న చిన్న మార్పులు కూడా చేశా. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించా. నెమ్మదిగా ఫలితం కనిపించడం ప్రారంభమైంది. తీపి పదార్థాలు తినాలనే ఆసక్తి నాలో నెమ్మదిగా తగ్గడం మొదలైంది. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల నాలో కొత్త ఉత్సాహం వచ్చి చేరింది. అంతేకాదు.. నా చర్మ ఆరోగ్యం కూడా మెరుగైంది.

నెల రోజుల తర్వాత నాలో వచ్చిన మార్పుని చూసిన నేను.. ఇక మీదట కూడా ఇలాగే చక్కెర ఉత్పత్తులు తక్కువగా తీసుకోవాలనే నిర్ణయం తీసుకొన్నాను.(మధ్యలో చీట్ డేస్ ఉంటాయనుకోండి). మరేం ఫర్వాలేదులే.. నెలలో ఒకటి రెండు రోజులు పంచదార తినడం వల్ల పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. పైగా ఎక్కువ కాలం షుగర్ తినకుండా ఉండటం కూడా మంచిది కాదు కదా..!

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

Images: Shutterstock

23 Dec 2018

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT