బాలీవుడ్ సినిమా కోసం.. మమ్మల్ని మోసం చేసింది : 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పై ఫిర్యాదు

బాలీవుడ్ సినిమా కోసం.. మమ్మల్ని మోసం చేసింది : 'అర్జున్ రెడ్డి'  హీరోయిన్ పై ఫిర్యాదు

Producers filed cased on 'Arjun Reddy' Actress Shalini Pandey

'అర్జున్ రెడ్డి' చిత్రంతో.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా ఆకర్షించిన నటి షాలినీ పాండే. పలు తమిళ చిత్రాలలో కూడా నటించిందామె. అయితే ఇటీవలే ఆమెపై తమిళ నిర్మాత ఒకరు.. ఆ రాష్ట్ర చలనచిత్రమండలికి ఫిర్యాదు చేశారు. తాను తీస్తున్న ‘అగ్ని సిరగుగల్’  చిత్రంలో నటించేందుకు తొలుత షాలిని సైన్ చేశారని.. దాదాపు 29 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేశాక.. ఆమె ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఓ బాలీవుడ్ చిత్రంలో భారీ పారితోషికానికి ఆఫర్ రావడమే దీనికి కారణమని ఆయన తెలిపారు.

'కబీర్ సింగ్' ప్రేయసి.. మన 'అర్జున్ రెడ్డి'ని ఎందుకు కలిసింది..?

శివ దర్శకత్వంలో అమ్మ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ‘అగ్ని సిరగుగల్’  చిత్రంలో అరుణ్ విజయ్, విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో షాలినీ కూడా నటిస్తున్నారు. అయితే ఆమె చిత్రం మధ్యలో ఉండగానే తప్పుకుంటే.. ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ సినిమా నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఇలా నిర్మాతలను బాధపెట్టే నటీనటుల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలిన పేర్కొంటూ.. సదరు నిర్మాతలు తమిళనాడు ఫిలిం ఛాంబర్‌తో పాటు.. నడిగార్ సంఘంలో కూడా ఫిర్యాదు పత్రాలు సమర్పించారు.

ఆ గాయమే.. వారిద్దరి మధ్య బంధాన్ని పెంచింది : 'అజిత్, షాలిని'ల అందమైన ప్రేమకథ ..!

అలాగే బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను కూడా సంప్రదిస్తామని  ‘అగ్ని సిరగుగల్’  చిత్ర నిర్మాతలు మీడియాకి తెలిపారు. షాలినీ పాండే పై చట్టరీత్యా కూడా తాము చర్యలు తీసుకుంటామన్నారు. కాగా షాలిని పాండే నటిస్తున్న తెలుగు చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే' రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ హీరోగా నటించగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. జి.ఆర్ క్రిష్ణ దర్శకత్వం వహించారు. అలాగే షాలిని నటించిన మరో చిత్రం 'నిశ్శబ్దం' కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

షాలిని గతంలో కూడా ఓ హిందీ చిత్రంలో నటించారు. 2018లో అంజలీ పాటిల్ కథానాయికగా నటించిన ‘మేరీ నిమ్మో‘లో హీరోయిన్ స్నేహితురాలిగా నటించారు.అయితే అదే సమయంలో విడుదలైన 'అర్జున్ రెడ్డి'  చిత్రం షాలినికి మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఎన్టీఆర్ మహానాయకుడు, మహానటి, 118 చిత్రాలలో ఆమె నటించింది. అలాగే గొరిల్లా, 100 పర్సెంట్ కాదల్ లాంటి తమిళ చిత్రాలలో కూడా నటించింది. ప్రస్తుతం 'జయేష్ భాయ్ జోర్దార్' అనే హిందీ చిత్రంలో కూడా నటిస్తోంది.

"అర్జున్ రెడ్డి" డైరెక్టర్ సందీప్ రెడ్డికి.. నటి తాప్సీ తాజా కౌంటర్..!

'జయేష్ భాయ్ జోర్దార్' చిత్రంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. అలాగే కొత్త దర్శకుడు దివ్యాంగ్ టక్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షాలినికి కథానాయికగా బాలీవుడ్‌లో తొలి చిత్రం కావడం గమనార్హం.జబల్ పుర్‌లో పుట్టి పెరిగిన షాలీనీ పాండే.. సినిమాలలోకి నాటకముందే థియేటర్ ఆర్టిస్టుగా రాణించారు. ఇంజనీరింగ్ చేసినా కూడా.. నటనా రంగంపై మక్కువతో ఆమె నాటకాలలో నటించారు. 'అర్జున్ రెడ్డి' కథానాయిక ప్రీతి పాత్ర ఆమెకు ఎంతగానో పేరు తీసుకువచ్చింది. 

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.