(Family Members fight for housemates in Bigg Boss House)
బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 3’లో భాగంగా.. నిన్నటి ఎపిసోడ్లో ఇంటి సభ్యుల కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. పార్టిసిపెంట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులను షోకి రప్పించి.. వారిని ఇంటిసభ్యులతో ఇంటరాక్ట్ చేయించడమే ఈ ప్లాన్. అయితే అదృష్టవంతులైన ఇద్దరికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుందట. దీని కోసం బిగ్ బాస్ 10 మంది హౌస్ మేట్స్‌కి సంబంధించి.. 10 మంది కుటుంబసభ్యులను హౌస్‌కి రప్పించారు.
Bigg Boss Telugu 3: హౌస్‌లో శివజ్యోతి చేత.. కన్నీళ్ళు పెట్టించిన బాబా భాస్కర్!
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు.. ఒక్కో బాక్స్‌ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా బాక్స్ ఓపెన్ చేయగానే.. బిగ్ బాస్ సింబల్ వచ్చిన వారిని సెకండ్ లెవెల్‌కి పంపించడం జరుగుతుంది. అలా వితిక, పునర్నవి, శివజ్యోతి, హిమజ, రవికృష్ణల కుటుంబసభ్యులు మాత్రమే ‘లెవెల్ 2’కి ఎంపికయ్యారు.
అలా ఎంపికైన వారికి 30 నిమిషాల పాటు సమయాన్ని కేటాయించారు. ఈ సమయంలో.. ఈ అయిదుగురి మధ్య ఒక చర్చ జరగాలి. ఎవరికి వారే తమ కంటెస్టెంట్స్ 1, 2 స్థానాల్లో ఎందుకు ఉండాలో మిగతా వారికి చెప్పాలి. అలా వీరందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఇద్దరు హౌస్ మేట్స్‌ని ఎంపిక చేయాలి. అప్పుడు ఆ ఇద్దరి కుటుంబసభ్యులని మాత్రమే పంపిస్తామని బిగ్ బాస్ తెలిపారు.
అయితే ఇచ్చిన 30 నిమిషాల వ్యవధిలో.. కుటుంబ సభ్యులు ఏమీ తేల్చుకోలేకపోవడం గమనార్హం. ఒకవైపు “మా వాళ్ళే బాగా ఆడుతున్నారు” అని చెబుతూనే.. ఇంకొకరి పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. దీనితో వీరి మధ్య ఎటువంటి ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే బిగ్ బాస్.. ఈ అయిదుగురికి మరోసారి బాక్స్ టాస్క్ ఇవ్వడం జరిగింది.
ఈ బాక్స్‌లలో ఎవరికైతే బిగ్ బాస్ సింబల్ వస్తుందో.. వారు హౌస్‌లోకి వెళ్లి ఇంటి సభ్యులను కలవచ్చని తెలిపారు. ఈ క్రమంలో రవికృష్ణ, వితిక ఇంటి సభ్యులకి బిగ్ బాస్ సింబల్ రావడంతో.. వారికి హౌస్‌లోకి వెళ్లి తమవారిని కలిసే అవకాశం దక్కింది.
ఇలా వచ్చిన అవకాశంలో భాగంగా.. రవికృష్ణ తన మామయ్యని కన్ఫెషన్ రూమ్‌లో కలవడం జరిగింది. ఆ తరువాత వితిక తన సోదరుడిని కూడా అక్కడే కలిసింది. దీంతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఇచ్చిన.. ఈ సర్ఫరైజ్ ముగిసిందనే చెప్పాలి.
Bigg Boss Telugu 3 : కుటుంబ సభ్యులని చూసి.. కంటతడి పెట్టిన హౌస్ మేట్స్
ఈ టాస్క్ ముగిశాక, మరో చిత్రమైన టాస్క్‌ని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇవ్వడం జరిగింది. సాధారణంగా మన సమాజంలో ‘ఆడవాళ్ళు మాత్రమే కొన్ని పనులు చేయగలరని.. అలాగే మగవాళ్లకి మాత్రమే కొన్ని పనులు పరిమితమని’ అంటుంటారని.. ఈ వాదనను ఇంటి సభ్యులు తప్పని నిరూపించాలని బిగ్‌బాస్ తెలిపారు. ఈ క్రమంలో కొన్ని టాస్కులు కూడా ఇచ్చారు. అందులో మొదటి టాస్క్ – హౌస్‌లోని మగాళ్లంతా.. తమ జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టాలి. అలాగే ఆడవాళ్ళంతా కేవలం 10 నిమిషాల్లో అందంగా ముస్తాబవ్వాలి.
మొదటి టాస్క్‌లో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్‌లు కన్నీళ్లు కార్చలేకపోయారు. ఎంత ప్రయత్నించినా.. తమ వల్ల అది కాలేదని వాళ్లు తెలిపారు. దీనితో మగవాళ్ళు ఈ టాస్క్‌లో ఓడిపోయారు. ఈ క్రమంలో వీరు మరో టాస్క్ కూడా చేశారు. కేవలం 10 నిముషాలలో మగవాళ్లు 5 ఆమ్లెట్స్ వేయడంతో పాటు.. ఏకకాలంలో హౌస్‌లోని బెడ్స్ని కూడా చక్కగా సర్దాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బాబా భాస్కర్ & వరుణ్ సందేశ్‌లు ఆమ్లెట్స్ వేసి టాస్క్ పూర్తి చేయగా.. ఇంట్లోని మగాళ్లు బెడ్స్ని నీట్‌గా సర్ది తమను తాము ప్రూవ్ చేసుకున్నారు.
అలాగే అమ్మాయిలకు కూడా బిగ్ బాస్ ఓ డిఫరెంట్ టాస్క్ ఇచ్చారు. అమ్మాయిలకు జనరల్ నాలెడ్జ్ కాస్త తక్కువగా ఉంటుదనే అపోహను పోగొట్టడానికి.. వారిని ఓ 10 ప్రశ్నలు అడిగారు. అందులో వారు కనీసం 6 ప్రశ్నలకి సమాధానం చెప్పినా.. టాస్క్ గెలుస్తారని ప్రకటించారు. అయితే ఫిమేల్ హౌస్ మేట్స్ అందరూ కలిసి.. కేవలం 5 ప్రశ్నలకి మాత్రమే సమాధానం చెప్పడం గమనార్హం. ఆ విధంగా.. చెరొక రెండు టాస్క్‌లు ఆడి.. చెరొకటి గెలిచిన ఆడ, మగ ఇంటి సభ్యులు సమాన పాయింట్లు సాధించడం విశేషం
ఇక ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌కి.. నాగార్జున వస్తారన్న విషయం తెలిసిందే. ప్రతి వీకెండ్ ఎపిసోడ్‌లాగే ఈ ఎపిసోడ్ కూడా సరదాగా సాగిపోతుందని ఆశిద్దాం. అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఇంటి సభ్యులు.. హిమజ, మహేష్ విట్టా, రాహుల్ సిప్లిగంజ్‌లలో ఎవరి సేఫ్ అవుతారన్నది తెలుసుకోవాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.
Bigg Boss Telugu 3: కెప్టెన్స్ టాస్క్ వల్ల.. వితిక, శివజ్యోతి, హిమజ మధ్య విభేదాలు!