అమ్మాయిలూ.. మీరెంత ప్రత్యేకమో తెలుసా? మీలాంటి మాస్టర్ పీసెస్ ఈ ప్రపంచంలో చాలా కొందమంది మాత్రమే ఉంటారు. అందులో మీరు ఒకరు. ఎంత వెతికినా మీలాంటి వారు ఇంకొకరు దొరకరు. అయినప్పటికీ కొన్నిసార్లు మీకు మీరే నచ్చకపోవచ్చు. ‘నేను అందరిలా ఉండలేకపోతున్నాను’, ‘నా వల్ల ఎలాంటి ప్రయోజనం ఏమీ లేదు’ అని ఎప్పడైనా అనుకొనే ఉంటారు కదా..! దీనికి కారణం ఆ క్షణంలో మీపై మీకు నమ్మకం లేకపోవడమే. అలాంటి సందర్భాలు ఇక మీదట ఎప్పుడైనా ఎదురైతే మేం చెప్పే విషయాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడే మీరెంత విలువైన వ్యక్తి అనేది మీకు తెలుస్తుంది. అసలు ఇతరుల నుంచి మిమ్మల్ని వేరు చేసి ప్రత్యేకంగా నిలబెట్టే లక్షణాలేంటో తెలుసా? Girls, మరి ఎందుకు ఆలస్యం.. వాటి గురించి తెలుసుకుందాం రండి.
1. మీ కుటుంబం
చదువు, ఉద్యోగం తదితర కారణాల వల్ల మీరు మీ తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావచ్చు. కానీ మీ తల్లిదండ్రులు, తోబుట్టువులతో మీకున్న అనుబంధం వెలకట్టలేనిది. భౌతికంగా మీ మధ్య దూరం ఉన్నప్పటికీ మానసికంగా ఎంతో దగ్గరగా ఉంటారు. మీ పట్ల వారి ప్రేమ ప్రత్యేకమైనది. అలాగే మీ కుటుంబం కూడా ఇతరులకు భిన్నంగా ఉంటుంది. మరి ఇలాంటి ఇంట్లో పుట్టిన మీరు ప్రత్యేకమే కదా..!
2. మీ స్నేహితులు
మీ స్నేహితుల లిస్ట్ చాాలా పెద్దదే ఉండొచ్చు. కానీ వారిలో అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే మీ మనసుకి బాగా దగ్గరవుతారు. వారిలో మీకు నచ్చిన అంశాలు చెప్పమంటే ఓ పెద్ద జాబితానే మీరు తయారు చేస్తారు కదా..! మరి మీ స్నేహితులను మీరు వారికి ఎందుకు ప్రత్యేకం? అని అడిగితే..! వారు చెప్పే విషయాలకు అంతే ఉండదు. అలాంటప్పడు మీరు స్పెషలే కదా?
3. మీ ఆసక్తులు, అభిరుచులు
మీరు హాకీ ఛాంపియన్ అయి ఉండవచ్చు. మంచి ఫొటోగ్రాఫరైనా కావచ్చు. లేదంటే డైలీ సీరియళ్లకు సంబంధించి మీ దగ్గర ఎన్ సైక్లోపీడియా అంత సమాచారం ఉండొచ్చు. మీకు స్త్రీవాద భావజాలం ఉండొచ్చు. ఇలా మనకుండే ఆసక్తులు, అభిరుచులే ఇతరుల నుంచి మనల్ని వేరు చేస్తాయి. నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలుపుతాయి. కాస్త ఆలస్యమైనా మీ అభిరుచులను మెచ్చే స్నేహితులు మీకు దొరుకుతారు.
4. మీ రూపం
సైన్స్ ఏం చెబుతుందంటే.. మనం వూహించుకొనేదానికంటే 20శాతం ఎక్కువే ఆకర్షణీయంగా ఉంటామట. మీరు మీ అందం పట్ల సంతృప్తిగానే ఉన్నా లేదా ఆత్మవిశ్వాసం కోసం దాన్ని పెంచుకొనే ప్రయత్నంలో ఉన్నా.. మీరో విషయం గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే మీ రూపం మిలియన్ల మందిలో ఒక్కరికే ఉంటుంది. అంటే మీకొక్కరికే ఆ రూపం ఉందన్నమాట. అంటే మీరు మిగిలినవారితో పోలిస్తే భిన్నమే కదా..!
5. మీ ఆహార్యం
కళ్లకు కాటుక, నుదుట బొట్టు పెట్టి సంప్రదాయంగా కనిపించినా.. జీన్స్, టీషర్ట్ తో ఆధునిక యువతిలా ఉన్నా మీ ఆహార్యం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు ప్రస్తుత మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడపండి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అప్పడే మీ స్టయిల్ కూడా కూల్ గా కనిపిస్తుంది. ఏమంటారు?
సూచన: మీ స్టయిల్ స్టేట్మెంట్ ను మార్చుకోవాలనుకొంటే.. ఒకసారి సరికొత్త Chumbak One కలెక్షన్ చూడండి.
6. మీ అనుభవాలు
చిన్నతనం నుంచి నేటి వరకు తల్లిదండ్రుల మధ్య మీరు సురక్షితంగా పెరిగారు. వారితో ఎన్నో సంతోషకరమైన క్షణాలను గడిపారు. మరి అలాంటి అదృష్టం కొందరికి లేకపోవచ్చు. అలాగే కొన్ని బాధించే సంఘటనలు సైతం ఎదుర్కొనే ఉంటారు. వాటి నుంచి పాఠాలను సైతం నేర్చుకొని ఉంటారు. ఇలా మీ అనుభవాల పాఠాలు మీకు మాత్రమే సొంతం.
7. మీ స్వభావం
మీది సరదాగా గడిపే స్వభావమైనా.. ప్రతి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొనే వ్యక్తిత్వమైనా.. లేదంటే ఆశావహ దృక్పథంతో ఉన్నవారైనా మీ ఆటిట్యూడ్ ని మరొకరు అనుకరించలేరు. అలాంటి ఆటిట్యూడ్ ని మరింత ప్రస్ఫుటంగా తెలియచెప్పాలనుకొంటున్నారా? అందుకే మీకు మేం Chumbak వారి #MakeHappy ఉత్పత్తులను సూచిస్తున్నాం. అవి కచ్చితంగా మిమ్మల్ని సంతోషపరుస్తాయి.
ఇది Chumbak ప్రాయోజిత కథనం.