బిగ్‌బాస్ ( BiggBoss Telugu) అంటేనే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు జోడించిన రియాలిటీ షో.. అని మనందరికీ తెలుసు. ఈ షోలో పాల్గొనే ఇంటి సభ్యులు, వారు ఉండేందుకు ఏర్పాటు చేసే బిగ్‌బాస్ హౌస్, ఆ హౌస్‌లో ఇంటి సభ్యులు చేసే టాస్క్‌లు.. అలాగే వీటన్నింటినీ ప్రతి వారాంతంలోనూ సమీక్షించే బిగ్‌బాస్ యాంకర్.. ఇవన్నీ ఇప్పటివరకు జరిగిన రెండు సీజన్లలో మనం చూసినవే.
తాజాగా ప్రసారమవుతోన్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 షోలో వీటన్నింటితో పాటూ మనకు నాగార్జున (Nagarjuna) చేతిలో పండు (Pandu) అనే ఓ కోతి బొమ్మ కూడా కనిపిస్తోంది.. వినిపిస్తోంది..
టీవీ9 జాఫర్ “బిగ్‌బాస్ హౌస్”లోకి.. మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారా?
ఈ కోతి అలియాస్ పండుని మనం ఈ సీజన్ మొదలయ్యే ముందు విడుదల చేసిన టీజర్స్‌లో కూడా చూసాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సీజన్ 3 షోలో ఉన్న ప్రత్యేకతల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. అందుకే దీని సహాయంతో నాగ్ సైతం షోని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రయత్నిస్తుండడం మనం చూడచ్చు.. పండు.. ఇలా చేయమంటావా? అది కావాలి??.. అంటూ దానినీ షోలో ఓ పాత్రను చేసేశారు.
సాధారణంగా టీవీ షో లేదా సినిమాల ద్వారా ఇలా ప్రేక్షకులకు చేరువయ్యే ఇలాంటి పాత్రలు, బొమ్మలకు మార్కెట్లో మరింత డిమాండ్ ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే నాగార్జున చేతిలో ఉన్న ఈ పండు అనే కోతిబొమ్మ కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఫలితంగా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అందరూ అమితంగా ఆసక్తి చూపిస్తున్నారు. మీరు కూడా అంతేనా?? అయితే ఆ పండు బొమ్మ గురించి మాకు తెలిసిన కొన్ని వివరాలు మీ కోసం..
బిగ్ బాస్ తెలుగు: నామినేషన్ ప్రక్రియలో హల్చల్ చేసిన పునర్నవి & తమన్నా
దీనిని ఇంటరాక్టివ్ బేబీ మంకీ టాయ్ అంటారు. ఇది ఫింగర్ టచ్ సెన్సార్‌తో పని చేసే బొమ్మ. బొమ్మ లోపల ఉండే సెన్సార్ కారణంగా సెన్సిటివ్ టచ్‌ని వెంటనే గుర్తించి దానికి అనుగుణంగా కదులుతూ ఉంటుందీ బొమ్మ. అలా ఈ బొమ్మ ఇచ్చే రియాక్షన్స్లో కొన్ని..
* మన చేతి వేళ్లతో ఈ కోతి తల పై ముట్టుకోగానే వినూత్నమైన రియాక్షన్ ఇవ్వడం
* కోతి ముఖం పైకి గాలి వదిలితే అది తిరిగి కిస్ పెట్టడం
* చేతిలో పడుకోబెట్టుకుంటే.. అది కాస్త నిద్రపోతూ గుర్రు పెట్టడం..
* కోతి తోక పట్టుకుని ఆడితే… అది రకరకాల రియాక్షన్స్ ఇవ్వడం..
* కోతి ముందు మనం చప్పట్లు కొడితే.. వెంటనే అది రౌండ్‌గా తిరుగుతూ శబ్దం చేయడం.. వంటివి చేస్తుంది.
ఈ కోతి బొమ్మను మన మధ్య వేలికి పెట్టుకునేందుకు అనువుగా డిజైన్ చేశారు. పైగా దీని బరువు కూడా తక్కువగానే ఉంటుంది. 100గ్రా బరువుతో, 4 బ్యాటరీలతో ఈ బొమ్మ పని చేస్తుంది. ప్రస్తుతం ఈ బొమ్మ ఆరు రంగుల్లో లభ్యమవుతోంది. కానీ ఆన్లైన్లో మాత్రం కేవలం పర్పుల్, పింక్ రంగుల్లోనే ఈ బొమ్మ లభ్యమవుతోంది. వీటి ధర 2500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఉంటోంది.
బిగ్‌బాస్ తెలుగు షో తర్వాత ఈ కోతి బొమ్మకి అనూహ్యంగా క్రేజ్ రావడంతో.. ప్రముఖ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా దీనిని కొనుగోలు చేస్తున్నారు. బొమ్మకు ఉన్న డిమాండ్‌ని బట్టి దీని ధర కూడా పెరుగుతూ వస్తోంది. క్రేజ్ ఉన్నప్పుడే కదా.. ఎవరైనా సొమ్ము చేసుకునేది. అలాంటిది బిగ్‌బాస్ వంటి ప్రఖ్యాత షో ద్వారా అమితమైన క్రేజ్ సంపాదించుకుని అందులో ఓ ముఖ్యపాత్రగా గుర్తింపు తెచ్చుకున్నాక ఈ బొమ్మకు ఉన్న డిమాండ్ పెరగడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి??
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రివ్యూ.. టైటిల్ గెలిచే కంటెస్టెంట్ ఎవరు?
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది