ADVERTISEMENT
home / వినోదం
నాగార్జున ‘మన్మథుడు 2’ ట్రైలర్ టాక్ – “ఒక్కపూట భోజనం కోసం వ్యవసాయం చేయను”

నాగార్జున ‘మన్మథుడు 2’ ట్రైలర్ టాక్ – “ఒక్కపూట భోజనం కోసం వ్యవసాయం చేయను”

కింగ్ నాగార్జునకి మన్మధుడు ట్యాగ్ సరిగ్గా సరిపోతుంది. ఇంకొక నెలరోజుల్లో 60వ వసంతంలోకి అడుగుపెడుతున్నా కూడా.. తన లుక్స్ లేదా యాటిట్యూడ్‌లో కాని ఆయన వయసు ప్రభావం ఏమాత్రం కనపడదు. అలాంటి ఈ ఎవర్ గ్రీన్ మన్మథుడు  తాజాగా చేసిన చిత్రం మన్మథుడు 2 (Manamdhudu 2). టైటిల్ చూడగానే ప్రేక్షకులు ఈ చిత్రంలో నాగార్జున ఎలా ఉండబోతున్నారో ఒక అంచనాకి ముందే వచ్చేశారు.

‘ఐ ఓన్లీ మేక్ లవ్’ అంటోన్న నాగార్జున .. మన్మథుడు 2 టీజర్ టాక్

అందుకే ఈ చిత్రం ప్రకటించిన నాటి నుండే.. ప్రేక్షకులకి దీని పైన పాజిటివ్ టాక్ వచ్చేసింది. మొన్నీమధ్యనే విడుదలైన టీజర్‌లో నాగార్జున (Nagarjuna) పాత్ర ఎలా ఉండబోతుందనే హింట్ కూడా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రేక్షకులకి ఇచ్చారు. ఇక కొద్దిసేపటి క్రితమే, మన్మథుడు 2 ట్రైలర్ (Manamadhudu 2 Trailer) విడుదలైంది. మరి ఈ ట్రైలర్‌లో నాగార్జున ఎలా ఉన్నాడు? ప్రేక్షకులు ఊహించిన విధంగా ఈ ట్రైలర్ ఉందా? ఈ సినిమా కథని ఏమైనా ఈ ట్రైలర్‌లో చెప్పారా? వంటి అంశాలు  మనం ట్రైలర్ టాక్‌లో తెలుసుకుందాం.

 

ADVERTISEMENT

మన్మథుడు 2 ట్రైలర్ ఎలా ఉందంటే ..

“అద్భుతం , అమోఘం… ఇటువంటి పథకం మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా వేయలేదు…” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది.ఈ సినిమాలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని పాత్రలో మనకి నాగార్జున కనిపించబోతున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే, మన్మథుడు సినిమాలో ఆడవాళ్ళంటే ఇష్టంలేని పాత్రలో నటించి చివరకు ఒక అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడో… అలాగే ఇందులో పెళ్లి అంటే ఇష్టం లేకపోవడం నుండి పెళ్లి చేసుకోవడం వరకు.. అనే పాత్రలో నాగ్ నటిస్తున్నాడని అర్ధమైంది.

అయితే అసలు పెళ్లి ఎందుకు చేసుకోడు అనే దానికి సమాధానంగా దర్శకుడు.. మరొక డైలాగ్‌ని ట్రైలర్ లో పెట్టడం జరిగింది. అదే – “యు హ్యావ్ నెవెర్ బీన్ ఇన్ లవ్” అని హీరోయిన్ అడిగితే.. “ఒక్కపూట భోజనం కోసం వ్యవసాయం చేయను” అని సమాధానం చెబుతాడు నాగ్. అలాగే “నేను పిల్లలని కనను.. నా జీవితం మాత్రమే నా బాధ్యత” అనే డైలాగ్ కూడా ఉంటుంది. దీన్నిబట్టి మనం నాగార్జున పాత్ర ఏంటి అనే దానిపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక నాగార్జున కూడా చాలా హ్యాండ్సమ్‌గా ఈ ట్రైలర్‌లో కనిపించాడు. టైటిల్‌కి తగ్గట్టుగానే మన్మథుడు అనిపించుకున్నాడు.

ఇక నాగార్జునతో సమాంతరంగా సినిమా మొత్తం సాగే పాత్రలో వెన్నెల కిషోర్ మనకి కనిపిస్తున్నారు. నాగ్‌తో ఉంటే కామెడీ పండించే పాత్రలో ఆయనని మనం చూడొచ్చు. ట్రైలర్‌లో వీరిద్దరి మధ్య ఉన్న సంభాషణలు చాలా ఫన్ క్రియేట్ చేశాయి. ఉదాహరణకి నాగార్జున తన పక్కన ఉన్న వెన్నెల కిషోర్ తో – “ఇదేమన్నా స్వయంవరం అనుకుంటున్నారా?” అని అంటే – “మరే.. వాళ్ళది చాదస్తం కాకపోతే.. మీరేమన్నా మన్మథుడా ఏంటి?” అనే కౌంటర్ వెన్నెల కిషోర్ వేయడం చాలా సరదాగా ఉంది.

అవంతిక అనే బోల్డ్ & బ్యూటిఫుల్ అమ్మాయిగా.. “మన్మథుడు 2″లో రకుల్ ప్రీత్

ADVERTISEMENT

వీరిద్దరితో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్‌కి కూడా మంచి సంభాషణలు ఇవ్వగలిగాడు దర్శకుడు. అందులో ఒకటి – “నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే.. నీతో ఎవరు ఉండలేరు!!”. రకుల్ ప్రీత్‌ని మనం ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్‌తో పాటుగా గ్లామర్ యాంగిల్‌లో కూడా చూడవచ్చు. అయితే తను ఈ మధ్యనే హిందీలో చేసిన “దే దే ప్యార్ దే” చిత్రంలో కూడా దాదాపు ఇదే రకమైన పాత్రలో కనిపించింది. ఈ రెండు సినిమా కథలకి కూడా కొన్ని ప్రధాన పోలికలు కనిపిస్తున్నాయి.

ఇక ఇతర ప్రధాన పాత్రల్లో లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీలు కనిపిస్తున్నారు. వీరంతా నాగార్జునకి ఎలాగైనా పెళ్లి చేయాలి అనే పట్టుదలతో ఉన్నట్టుగా అర్ధమవుతోంది. సినిమా చూస్తే ఇంకాస్త వివరంగా అర్ధమయ్యే ఆస్కారం ఉంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఈ సినిమాని తీసేటప్పుడు మన్మథుడు 2 అని టైటిల్ పెడితే నాగార్జున నుండి ఏమి ఆశిస్తారన్న దానిని ఆధారం చేసుకుని.. ఈ సినిమా తీసినట్టుగా అర్ధమవుతుంది.

ప్లే బాయ్ పాత్రలో నాగార్జునని చూపించడానికి.. ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్‌తో లిప్ కిసెస్ పెట్టించడం ద్వారా.. ఆయనలోని రొమాంటిక్ యాంగిల్‌ని బాగానే ఎలివేట్ చేసినట్టుగా తెలుస్తుంది.

అలాగే ట్రైలర్ చివరలో “మీ కృష్ణావతారం అయిపొయింది. ఇక రామావతారం స్టార్ట్ అంటున్నా!” అని వెన్నెల కిషోర్‌తో చెప్పించి ట్రైలర్  పాటు క్లైమాక్స్ కూడా ఎలా ఉండబోతుంది అనేది చెప్పకనే చెప్పేశాడు.

ADVERTISEMENT

వచ్చే నెల 9వ తారీఖున.. మన్మథుడు 2 గా నాగార్జున మీ ముందుకి రాబోతున్నాడు. ఈ చిత్రం మన్మథుడులాగే విజయవంతం అవ్వాలని కోరుకుందాం.

అతని వయసు 50.. ఆమె వయసు 25.. చిత్రమైన ప్రేమకథలో “రకుల్ ప్రీత్”

25 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT