బిగ్‌బాస్ తెలుగు: హోరాహోరీ పోరులో.. ఇంటికి తొలి కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్ ..!

బిగ్‌బాస్  తెలుగు: హోరాహోరీ పోరులో.. ఇంటికి తొలి కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్ ..!

"బిగ్‌బాస్ సీజన్ 3"కి.. (Bigg Boss Telugu) అలాగే గత రెండు సీజన్స్‌కి చాలానే వ్యత్యాసాలు మనం చూస్తున్నాం. అందులో ప్రధానమైనది ఏంటంటే - ఈ సీజన్ మొదలైన 10 రోజుల వరకు కూడా ఇంటికి కెప్టెన్ లేకపోవడం. సరిగ్గా నిన్నటికి ఈ సీజన్ మొదలై.. 10 రోజులు కాగా..  ఇంటికి కెప్టెన్‌గా వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఎంపిక కావడం జరిగింది.

అయితే ఈ సారి ఇంటికి కెప్టెన్‌గా పోటీ పడ్డ సభ్యులకి లేదా ఇంట్లో వారికి.. తాము కెప్టెన్సీ కోసం ఫలానా టాస్కులు చేస్తున్నట్టుగా ఎటువంటి ముందస్తు సమాచారం లేదు. ఈ క్రమంలో కెప్టెన్సీ కోసం ముగ్గురు ఇంటి సభ్యులు - వరుణ్ సందేశ్, అలీ & హిమజ పోటీలో పాల్గొన్నారు. అయితే వీరి మధ్య పోటీ ఏది పెట్టకుండా.. ఎవరికైతే ఇంటి సభ్యులలో మెజారిటీ ఓట్లు లభిస్తాయో.. వారే ఇంటికి కెప్టెన్ అవుతారని ప్రకటించడం జరిగింది.

బిగ్ బాస్ తెలుగు: జైలుకి వెళ్లిన వరుణ్ సందేశ్ & తమన్నా

దీనితో ఇంటి సభ్యులకు మద్దతు తెలిపే సమయంలో.. ఇద్దరికీ చెరొక 6 ఓట్లు లభించాయి. దానితో ఈ ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ స్థితిలో ఇంటి సభ్యుల అభ్యర్ధన మేరకు.. కెప్టెన్సీ పోటీలో ఉన్న మూడవ సభ్యురాలైన హిమజని ఓటు వేయమనడం జరిగింది.

అలీ, వరుణ్ సందేశ్‌ల మధ్య టై బ్రేకర్ నెలకొన్న నేపథ్యంలో.. హిమజ తన మద్దతుని వరుణ్ సందేశ్‌కి అని చెప్పడంతో.. "బిగ్ బాస్ సీజన్ 3"లో  హౌస్ మొదటి కెప్టెన్‌గా వరుణ్ సందేశ్ వ్యవహరించబోతున్నాడు.

ఇదిలావుండగా.. ఎపిసోడ్‌లో అంతకముందు జరిగిన పవర్ టాస్క్‌లో గెలిచిన వరుణ్ సందేశ్, అలీ, హిమజలకి ఓ పవర్ ఇవ్వడం జరిగింది. ఇంటి సభ్యులతో.. తమకు నచ్చిన పనిని చేయించడమే ఆ పవర్? అలా మొదటగా పవర్‌ని అందుకున్న వరుణ్... దానిని ఉపయోగించి జాఫర్, పునర్నవిలతో డ్యాన్స్ వేయించడం, హిమజతో తన బట్టలు ఉతికించడం చేశాడు.

ఆ తరువాత పవర్‌ని చేజికించుకున్న అలీ.. ఇంటిలోని మగవారిని ఆడవారి గెటప్స్ వేసుకోమని ఆదేశించడం జరిగింది. దీనికి జాఫర్ వ్యతిరేకత తెలిపి టాస్క్‌లో భాగం కాలేదు. అలాగే ముందు చెప్పిన రూల్స్‌లో.. ఈ విషయాలు లేవని తెలుపుతూ వరుణ్ కూడా పాల్గొనలేదు. తమన్నా సింహాద్రి కూడా అలీ చెప్పినవి చేయడానికి నిరాకరించడం జరిగింది.

బిగ్‌బాస్ తెలుగు: వరుణ్ సందేశ్ పై.. వితిక అలగడానికి అసలు కారణం ఇదేనా!

అలా నిరాకరించడమే కాకుండా "ఇటువంటి పనులు ఎలా చెప్తావు" అని అలీని దూషించగా.. వెంటనే ఇంటిలోని సభ్యులు తమన్నా చేసేది తప్పు అని చెప్పి వారించడం జరిగింది. అలాగే ఇంటిలో హీరోయిన్ నేను & విలన్ అలీ అని స్టేట్మెంట్ ఇచ్చి అందరికి ఝలక్ ఇచ్చింది తమన్నా.

అయితే అలీ పవర్ కోసం డైమండ్‌ని గెలుచుకునే ప్రయత్నంలో.. శివజ్యోతి అలియాస్ సావిత్రక్కని అప్రయత్నంగా తోసెయ్యడంతో కాస్త గందరగోళం ఏర్పడింది. అలా తోసెయ్యడంలో శివ జ్యోతికి చిన్న చిన్న దెబ్బలు కూడా తగలడం.. అయితే గేమ్‌లో ఇవ్వన్నీ సర్వసాధారణమే అని శివ జ్యోతి చెప్పడంతో ఈ సంఘటన పెద్దది కాకుండా.. చిన్నగానే సమసిపోయింది.

ఇక రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో.. ఇంటి సభ్యులంతా వారి జీవితంలో ఎదురైన చేదు సంఘటనలని మిగతా సభ్యులతో పంచుకోవడం కనిపిస్తుంది ప్రోమోస్‌లో. నిన్నటి ఎపిసోడ్  కాస్త వేడి వాడిగా నడిస్తే.. ఈరోజు ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా ఉండబోతుందా? లేదా ఇంకేదైనా జరగబోతుందా అనేది వేచి చూడాలి.

మరి ఈ సీజన్ తొలి కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్ ప్రవర్తన ఎలా ఉంటుంది? తనకి నచ్చని ఇంటి సభ్యులతో ఎలా ప్రవర్తిస్తాడు? అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

బిగ్ బాస్ తెలుగు: తమన్నా గేమ్ 'ప్లాన్స్'..!