కొత్తగా పెళ్లయిన అమ్మాయికి తొలి ఏడాదంతా సందడిగానే సాగుతుంది. ఆ సంవత్సరంలో జరిగే పార్టీలు, ఫంక్షన్లు, పండగలు, శుభకార్యాలు ఇలా ఏవి జరిగినా అందరి దృష్టి ఆమె పైనే ఉంటుంది. కొత్త కోడలు ధరించే దుస్తులు, నగలనైతే మరింత ఆసక్తిగా గమనిస్తుంటారు. అందుకే తాను హాజరయ్యే ప్రతి కార్యక్రమానికి ప్రత్యేకంగా సిద్ధమవుతుంది నవవధువు. కుర్తా, చీరలతో సంప్రదాయబద్ధంగా మెరిసిపోతుంది. దానికి తగినట్లుగా నగలు అలంకరించుకొంటుంది.
దానికోసం కాస్త ఎక్కువే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ జ్యుయలరీ కోసం అంత ఖర్చు పెట్టాలంటే కష్టమే కదా. అందుకే తక్కువ ఖర్చులో దొరికే నగలను ఎంచుకొంటే.. ఏడాదంతా జరిగే ఫంక్షన్లకు ట్రెండీగా రెడీ అయ్యి వెళ్లొచ్చు. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది కాబట్టి.. వాటికి హాజరయ్యే వారు ధరించడానికి కూడా ఈ నగల డిజైన్లు బాగుంటాయి.
ఆన్లైన్‌లో దొరికే బెస్ట్ డిజైనర్ ఇయర్ రింగ్స్
ఆన్లైన్‌లో దొరికే బెస్ట్ నెక్లెస్ డిజైన్స్
ఆన్లైన్ లో దొరికే అందమైన ముక్కు పుడకలు
ఆన్లైన్ లో దొరికే అందమైన గాజులు, బ్రేస్ లెట్లు
జుంకాల దగ్గరి నుంచి నెక్లెస్ల వరకు, ముక్కు పుడకల నుంచి గాజుల వరకు ఏ శుభకార్యానికైనా ధరించడానికి వీలుగా ఉండే సుమారు ఈ యాభై రకాల డిజైన్లు మీకు సరిగ్గా సరిపోతాయి. కాబట్టి వాటిలో మీకు నచ్చినవి ఎంచుకొని చక్కగా రెడీ అయి ఫంక్షన్‌కు వెళ్లండి.
ఆన్లైన్‌లో దొరికే బెస్ట్ డిజైనర్ ఇయర్ రింగ్స్ (Best Designer Earrings)
ట్రెడిషనల్ జుంకాలు, క్లాసిక్ హూప్స్, డిజైనర్ డాంగ్లర్స్ ఏవైనా సరే ముఖారవిందాన్ని పెంచేవి చెవిపోగులే. అందుకే మీకోసం ఈ ఇరవై రకాల ఇయర్ రింగ్స్..
పెరల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ (Pearl Drop Earrings)
సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే ట్రెండీగా కనిపించాలనుకొంటున్నారా? అయితే ఈ ఫిలిగ్రీ గోల్డ్ ప్లేటెడ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ఎంచుకోండి. ఈ చెవిపోగుల డిజైన్ విభిన్నంగా ఉండటమే కాదు.. వాటికున్న ముత్యాలు సైతం వాటి అందాన్ని పెంచుతున్నాయి. ఈ చెవిపోగులను కుర్తా మీద ధరిస్తే చాలా బాగుంటుంది.
ధర: రూ. 3,089. ఇక్కడ కొనండి.
డాజ్లింగ్ డాంగ్లర్స్ (Dazzling Dongler)
ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్ ధరించినప్పుడు ఈ డాంగ్లర్స్ చెవులకు పెట్టుకోండి. చాలా అందంగా ఉంటాయి. సింపుల్‌గా రెడీ అవ్వడానికి ఇష్టపడేవారికి ఇవి సరైన ఎంపిక.
ధర: రూ. 1,150. ఇక్కడ కొనండి.
నెమలి ఫించం చెవి పోగులు (Peacock Earrings)
ఈ గోల్డ్ టోన్డ్ ఇయర్ రింగ్స్ మీకు ఎత్నిక్ లుక్ ఇస్తాయి. లెహంగా, స్కర్ట్ ధరించినప్పుడు ఈ చెవి పోగులు పెట్టుకొంటే మీరు చాలా అందంగా కనిపిస్తారు.
ధర: 1049. ఇక్కడ కొనండి.
ముచ్చటైన చాంద్ బాలీస్ (Zaveri Pearls)
అర్ధచంద్రాకారంలో మెరిసిపోతున్న ఈ చాంద్ బాలీస్ ఎంత బాగున్నాయో కదా.. వీటిలో పొదిగిన ఆర్టిఫిషియల్ స్టోన్స్, ముత్యాలు చాంద్ బాలీస్‌ను మరింత అందంగా కనిపించేలా చేస్తున్నాయి. పండగల సమయంలో సల్వార్ సూట్ పై ధరించడానికి ఇవి బాగుంటాయి.
ధర: రూ. 266. ఇక్కడ కొనండి.
ఎనామిల్ ఇయర్ రింగ్స్ (Enamel Year Rings)
బోహో లుక్ ఇష్టపడేవారికి ఈ సిల్వర్ ఎనామిల్ ఇయర్ రింగ్స్ బాగా నచ్చుతాయి. తెలుపు రంగు దుస్తులు ధరించినప్పుడు ఈ చెవిపోగులు ధరిస్తే మీరు మరింత అందంగా కనిపిస్తారు.
ధర: రూ. 449. ఇక్కడ కొనండి.
పచ్చల మెరుపులు (Emerald Lighting)
పచ్చ రంగు రాళ్లు, ముత్యాలతో రస్టిక్ గోల్డ్ చెవిపోగులు మీకు వింటేజ్ లుక్ అందిస్తాయి. పచ్చ, తెల్లని రంగుల్లో ఉన్న దుస్తులు ధరించినప్పుడు వీటిని పెట్టుకొంటే గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇంత రిచ్‌గా కనిపిస్తున్న ఈ ఇయర్ రింగ్స్ మీరు ఆశ్చర్యపోయే ధరకు లభ్యమవుతున్నాయి.
ధర: రూ. 239. ఇక్కడ కొనండి.
సింపుల్‌గా స్వీట్ గా (Simple As Sweet)
సింపుల్‌గా రెడీ అవ్వాలనుకొనేవారికి ఈ బీడ్ ఇయర్ రింగ్స్ చక్కటి ఎంపిక అనే చెప్పుకోవాలి. చాలా తేలికగా ఉండే ఈ చెవిపోగులు మీకు స్టైలిష్ లుక్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ధర: రూ. 240. ఇక్కడ కొనండి.
హేజెల్ ఫ్రీ టాజెల్స్ (Huge Free Tazels)
సపోటా రంగులోని ఈ టాజెల్స్ కుర్తీ, కుర్తాకు మ్యాచింగ్‌గా పెట్టుకోవడానికి బాగుంటాయి.
ధర: రూ. 599.ఇక్కడ కొనండి.
పూసలతో ప్రకాశవంతంగా.. (Brighter With Beads)
ఆరెంజ్, గోల్డ్ రంగుల కాంబినేషన్‌లో ఉన్న ఈ చెవిపోగులు చూడటానికి ఎంత కలర్ ఫుల్‌గా ఉన్నాయో కదా.. పండగ సమయంలో ప్రకాశవంతంగా కనిపించడానికి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాల్సిందే.
ధర: రూ. 200. ఇక్కడ కొనండి.
పింక్ టాజెల్స్‌తో ముచ్చటగా.. (Pink Tazels)
బంగారు, గులాబీ వర్ణాల్లో మెరిసిపోతున్నఈ హూప్స్ మీకు కచ్చితంగా నచ్చుతాయి. తెలుపు రంగు కుర్తా, చీర ధరించినప్పుడు ఇవి పెట్టుకుంటే చాలా కలర్ ఫుల్‌గా కనిపిస్తారు.
ధర: రూ. 240. ఇక్కడ కొనండి.
ఊలుతో మెరిసిపోతూ.. (Shining With Wool)
రంగు రంగుల పామ్ పామ్స్‌తో (ఊలు దారాలతో చేసిన ఉండ) తయారైన ఈ చెవిపోగులు మిమ్మల్ని నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. కాటన్ చుడీదార్, కాటన్ చీర ధరించినప్పుడు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొంటే చాలా అందంగా కనిపిస్తారు.
ధర: రూ. 175. ఇక్కడ కొనండి.
దిద్దులతో ట్రెడిషనల్‌గా (Gold Cutwork Paisley Filigree Studa)
భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో పైస్లీ(paisley) ప్రింటెడ్ వస్త్రాలు ప్రత్యేకమనే చెప్పకోవాలి. అలాంటి పైస్లీ డిజైన్ మాదిరిగా తయారుచేసిన ఈ దిద్దులు సింపుల్‌గానే ఉన్నా ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
ధర: రూ. 718. దీన్ని ఇక్కడ కొనండి.
నాణేల మెరుపులు (Pearl Coin Earrning)
లక్ష్మీదేవి రూపులతో తయారైన ఈ చెవి దిద్దులు పండగలు, శుభకార్యాల సమయంలో ధరించవచ్చు. వీటి మధ్యలో పొదిగించిన ముత్యం అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
ధర: రూ. 495. ఇక్కడ కొనండి.
ఇయర్ కఫ్స్‌తో ట్రెండీగా.. (Year Cuffs)
ప్రస్తుతం పార్టీలు, ఫంక్షన్లకు హాజరయ్యే సందర్భంలో ఇయర్ కఫ్స్ పెట్టుకోవడానికే ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు. వీటిని చూడండి.. మీరు ఎలాంటి అవుట్ ఫిట్ ధరించినా సరే దానికి మ్యాచింగ్‌గా పెట్టుకోవచ్చు.
ధర: రూ.1,099.ఇక్కడ కొనండి.
మువ్వల సవ్వడి.. (Pearl And Mugs Earrings)
మువ్వలను కూడా చెవిపోగులుగా పెట్టుకోవచ్చని వీటిని చూసేవరకు నాకు తెలియలేదు. ముత్యాలు, మువ్వలు కలిపి రూపొందించిన ఈ చెవి రింగులు మిమ్మల్ని స్టైల్‌గా మార్చేస్తాయి.
ధర: రూ. 391. ఇక్కడ కొనండి.
అల్లికల అందాలు (Earring With Thread Work)
మువ్వల రింగుల మాదిరిగానే ఈ అల్లికల రింగులు కూడా నన్ను ఆశ్చర్యపరిచాయి. ఎరుపు, పచ్చ రంగు దారాలతో తయారుచేసిన ఈ హూప్స్ ఎంత బాగున్నాయో కదా..!
ధర: రూ. 208. ఇక్కడ కొనండి.
అద్దాల అందాలు.. (Mirror)
ఈ సిల్వర్ ప్లేటెడ్ చెవి దిద్దులు నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా ఆ దిద్దుల మధ్య ఉన్న చిన్న అద్దం నన్ను బాగా ఆకర్షించింది. మీకు తెలుసా? వైట్ కలర్ అవుట్ ఫిట్ వేసుకొన్నప్పుడు సిల్వర్ జ్యువెలరీ ధరిస్తే అందంగా మెరిసిపోతాం.
ధర: రూ.558 ఇక్కడ కొనండి.
స్టోన్ స్టడ్స్ (Stone Studs)
ఎర్రటి స్టోన్‌తో తయారు చేసిన ఈ స్టడ్స్ మీ లుక్‌ను కంప్లీట్ చేయడంతో పాటు మిమ్మల్ని బ్యూటీఫుల్‌గా మార్చేస్తాయి.
ధర: రూ.349. ఇక్కడ కొనండి.
బంగారు, వెండి మెరుపులు (Gold And Silver Sparkles)
ఒకే చెవిపోగులో బంగారు, వెండి మెరుపులుంటే.. అలాంటి వాటిని మీరు కచ్చితంగా చెవులకు అలంకరించుకోవాలనుకొంటారు కదా..! ఈ చెవి పోగులను మీరు పూజల సమయంలో అలంకరించుకోవచ్చు.
ధర: రూ. 299. ఇక్కడ కొనండి.
ఈ ఇయర్ రింగ్స్ డిజైన్స్‌తో మీరు సంతృప్తి చెందలేదా?
మిమ్మల్ని మరింత స్టైలిష్ గా మార్చే ఈ టాప్-10 చెవి పోగులు మీకోసమే.
ఆన్లైన్‌లో దొరికే బెస్ట్ నెక్లెస్ డిజైన్స్ (Best Necklace Designs)
మెడలో అందమైన నెక్లెస్ వేసుకొన్నప్పుడే మనం మరింత అందంగా కనిపిస్తాం. దానికోసం ఖరీదైన బంగారు ఆభరణాలే ధరించాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చులోనే లభ్యమయ్యే ఈ పది రకాల నెక్లెస్‌లు ఎంచుకొంటే సరిపోతుంది.
సిల్వర్, బీడ్స్ నెక్లెస్ (Silver Beads Necklace)
ఈ అందమైన నెక్లెస్ మీకు స్టైలిష్ లుక్ ఇవ్వడంతో పాటు మిమ్మల్ని మరింత అందంగా మార్చేస్తుంది. ఈ నెక్లెస్ మీరు వేసుకొంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. ధర కూడా చాలా తక్కువ.
ధర: రూ. 1,449. ఇక్కడ కొనండి.
గోల్డెన్ స్టేట్మెంట్ చోకర్ (Golden Choker)
ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ వేసుకొన్నప్పుడు ఈ గోల్డ్ మెటల్ చోకర్ వేసుకొంటే క్లాసీ లుక్ వస్తుంది. రౌండ్ నెక్ బ్లౌజ్ వేసుకొన్నప్పుడు కూడా దీన్ని ధరించవచ్చు.
ధర: రూ. 678. ఇక్కడ కొనండి.
ఆక్సిడైజ్డ్ సిల్వర్ చోకర్ (Oxidized Silver Choker)
ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యుయలరీ చవకగా దొరకడంతో పాటు వింటేజ్ లుక్ ఇస్తుంది. అందుకే నాకు ఇలాంటి నగలంటే ఇష్టం. మీరు కూడా అంతేనా? అయితే వెంటనే ఈ నెక్లెస్ కోసం ఆర్డర్ ప్లేస్ చేసేయండి.
ధర: రూ. 1,665. ఇక్కడ కొనండి.
సిరి సిరి మువ్వల సింగారం.. (Gold Toned Ruban)
చీర, కుర్తా రెండింటి మీదకు ఈ స్టేట్మెంట్ నెక్లెస్ ధరించవచ్చు. పండగ సమయాల్లో ఈ నెక్లెస్ ధరిస్తే చాలా బాగుంటుంది.
ధర: రూ.1900. ఇక్కడ కొనండి.
సింపుల్ గా.. స్వీట్ గా.. (Simple As Sweet)
ఈ గోల్డ్ టోన్డ్ లేయర్ నెక్లెస్ చూడటానికి ఎంత సింపుల్ గా ఉంది. కానీ ఇది మెడలో వేసుకొంటే చాలా బ్రైట్ లుక్ వస్తుంది.
ధర: రూ 2,199. ఇక్కడ కొనండి.
సీ గ్రీన్ మెరుపులు (Sea Green Lighting)
సీగ్రీన్ రంగులో మెరిసిపోతున్న ఈ నెక్లెస్ అన్ని రకాల అవుట్ ఫిట్స్ మీదకు ధరించవచ్చు. విభిన్నమైన లుక్ తో ఉన్న ఈ డిజైన్ మీకు కచ్చితంగా నచ్చుతుంది.
ధర: రూ 353. ఇక్కడ కొనండి.
గవ్వలు చేసే గమ్మత్తు (Pearl Shell)
ఏ రకమైన అవుట్ ఫిట్ ధరించినా దాని మీదకు చక్కగా సరిపోతుంది ఈ స్టేట్మెంట్ నెక్ పీస్. ముత్యపు చిప్ప లో దాగున్న ముత్యం మాదిరిగా తీర్చిదిద్దిన ఈ నెక్లెస్ చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ధర: రూ 262. ఇక్కడ కొనండి.
స్ట్రీట్ స్టైల్ గోల్డ్ టోన్ నెక్లెస్ (Street Style Gold Tone Necklace)
బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఈ నెక్లెస్ స్ట్రీట్ స్టైల్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. ఈ బ్రాండెడ్ నెక్ పీస్ ను ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ ధరించినప్పుడు వేసుకొంటే మీ లుక్ అదిరిపోతుంది.
ధర: రూ 334. ఇక్కడ కొనండి.
ముత్యాలతో స్టైలిష్ గా.. (Pearl Design)
కొందరు చాలా సింపుల్ గా రెడీ అవ్వడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారు ధరించే దుస్తులు, నగలు అన్నీ చాలా సాధారణంగానే ఉన్న స్టైలిష్ గా కనిపిస్తారు. మీరు కూడా అలాంటి వారేనా? అయితే నాలుగంటే నాలుగు ముత్యాలతో చాలా సింపుల్ గా ఉన్న ఈ చెయిన్ మీకు బాగా నచ్చుతుంది.
ధర: రూ 445. ఇక్కడ కొనండి.
మల్టీ లేయర్ చెయిన్ నెక్లెస్ (Multi Layer Chain Necklace)
చీర ధరించినప్పుడు ఈ చెయిన్ నెక్లెస్ ధరిస్తే చాలా బాగుంటుంది.
ధర: రూ 246 ఇక్కడ కొనండి.
మీ చీరపై బ్లౌజ్ కుట్టించుకోలేదా? బాలీవుడ్ భామలు ధరించిన పది రకాల ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు ఓసారి పరిశీలించండి.
ఆన్లైన్ లో దొరికే అందమైన ముక్కు పుడకలు (Beautiful Nose Rings)
ముక్కుకి ముక్కు పుడక లేదా నత్తు పెట్టుకొంటే వచ్చే కళే వేరు. మీరు కూడా ముక్కు పుడక పెట్టుకోవాలనుకొంటున్నారా? అయితే మీకోసమే ఈ పది రకాల ముక్కుపుడకలు, నత్తుల డిజైన్లు.
కుందనాల ముక్కెర (Golden Nose Ring)
సింపుల్ గా ఉన్న ఈ గోల్డ్ ప్లేటెడ్ ముక్కెర మిమ్మల్ని అందంగా మార్చేస్తుంది. దీనిలో పొదిగించిన కుందన్లు మీకు ఆకర్షణీయమైన లుక్ అందిస్తాయి.
ధర: రూ 3,500. ఇక్కడ కొనండి.
రాళ్ల ధగధగలు (Rose Ring With Stones)
రాళ్లు పొదిగిన ఈ ముక్కెర మీకు సరికొత్త స్టైల్ అందిస్తుంది. ఈ ముక్కెరకు వేలాడుతున్న దోసగింజ ఆకారంలోని స్టోన్ మిమ్మల్ని మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించినప్పుడు ఈ ముక్కుపుడక పెట్టుకొంటే చాలా బాగుంటుంది.
ధర: రూ 4,800. ఇక్కడ కొనండి.
ముత్యాల మెరుపుల ముక్కెర (Pearl Lighting Strip)
ముత్యాలు, ఎరుపు రంగు కుందన్లతో తయారైన ఈ ముక్కు పుడక పెట్టుకొంటే.. మీరు చాలా గ్రాండ్ గా కనిపిస్తారు. ఈ ముక్కెరకు అటాచ్ చేసిన ముత్యాల గొలుసు మరింత ఆకర్షణను జోడిస్తుంది. అనార్కలీ సూట్, లెహంగా ధరించినప్పుడు దీన్ని అలంకరించుకొంటే బాగుంటుంది.
ధర: రూ 7,500. ఇక్కడ కొనండి.
మొఘలాయిల దర్పం (Mughal Design)
కుందన్లు, ముత్యాల తో తయారైన ఈ 24 క్యారట్ల ముక్కెర పూర్తిగా చేత్తో తయారుచేసినది. దీన్ని ముక్కుకి అలంకరించుకొంటే.. మొఘలాయిల దర్పం మీ సొంతమవుతుంది.
ధర:రూ 3,250. ఇక్కడ కొనండి.
పూల ధగధగలు (Flower Petals)
కొత్తగా ముక్కు పుడక పెట్టుకొంటున్నారా? అయితే ఈ ముక్కు పుడకను ట్రై చేయండి. దీన్ని ఫంక్షన్లకు పెట్టుకొంటే అందరి దృష్టి మీ మీదే ఉంటుంది.
ధర: రూ 4,000. ఇక్కడ కొనండి.
తెల్ల రాళ్ల ముక్కెర (White Stone Slices)
తెల్ల రాళ్లు పొదిగి అందంగా మలిచిన ఈ ముక్కుపుడక చూడటానికి చాలా భారీగా ఉన్నప్పటికీ చాలా తేలికగా ఉంటుంది. చీర కట్టుకొన్నప్పుడు దీన్ని పెట్టుకొంటే చాలా బాగుంటుంది.
ధర: రూ 6,400. ఇక్కడ కొనండి.
క్రిస్టల్ సొగసులు (Crystal Elegance)
క్రిస్టల్స్ పొదిగిన ఈ గోల్డ్ ప్లేటెడ్ ముక్కుపుడకను ప్రముఖ నగల డిజైనర్ రాహుల్ పోప్లి రూపొందించారు. దీనికి జోడించిన ముత్యాల చెయిన్ మరింత అందాన్ని ఇస్తుంది.
ధర: రూ 5,099. ఇక్కడ కొనండి.
ఫ్లవర్ మోటిఫ్ లతో అందంగా.. (Flower Motifs)
ఫ్లవర్ మోటిఫ్ లు, పెర్ల్ డ్రాప్స్, కుందన్ చెయిన్ లతో మెరిసిపోతున్న ఈ ముక్కెర మీకు ప్రిన్సెస్ లుక్ ఇస్తుంది.
ధర: రూ 2,500. ఇక్కడ కొనండి.
ముత్యాలతో ముచ్చటైన ముక్కెర (Cherry Cheese With Pearls)
ఈ డిజైనర్ ముక్కుపుడక సింపుల్ గా ఉన్నా ఎంత ముచ్చటగా ఉందో కదా..!
ధర: రూ 2,800. ఇక్కడ కొనండి.
చిన్న ముక్కుపుడక సొగసు (Small Sniffing Finery)
మల్టీ కలర్ చీర, లెహంగా ధరించినప్పుడు ఈ ముక్కు పుడక పెట్టుకొంటే చాలా బాగుంటుంది.
ధర: రూ 300. ఇక్కడ కొనండి.
ఆన్లైన్ లో దొరికే అందమైన గాజులు, బ్రేస్ లెట్లు (Beautiful Bangles And Bracelets)
చేతికి గాజులు లేకపోతే ఎంత అలంకరించుకొన్నా అది అసంపూర్తిగానే మిగిలిపోతుంది. మీ అవుట్ ఫిట్, మేకప్ కి తగినట్లుగా ఉండే 10 రకాల డిజైనర్ గాజులు, బ్రేస్ లెట్ డిజైన్లు మీకోసం.
పూసల బ్రేస్ లెట్ (Let The Beams Brace)
ఈ మల్టీకలర్ బీడెడ్ బ్రేస్ లెట్ చీర, కుర్తా, లెహంగా ఇలా ఎలాంటి సంప్రదాయ వస్త్రాలపై అయినా ధరించడానికి బాగుంటుంది.
ధర: 319. ఇక్కడ కొనండి.
మూన్ స్టోన్ బ్రేస్ లెట్ (Gold Plated Cubic Zircon Studded Moonstone)
తెల్లని రాళ్లను అర్ధ చంద్రాకారంలో పొదిగించి వాటిపై అమర్చిన ఎరుపు రంగు రాయితో చాలా సింపుల్ గా ఉన్న ఈ బ్రేస్ లెట్ మీకు స్పెషల్ లుక్ ఇస్తుంది.
ధర: రూ 180. ఇక్కడ కొనండి.
వింటేజ్ బ్యాంగిల్ (Vintage Bangle)
వింటేజ్ లుక్ లో మెరిసిపోతున్న ఈ గాజు చూడటానికి ట్రైబల్ డిజైన్ మాదిరిగా కనిపిస్తోంది. చేతులకు ఇది వేసుకొంటే డిఫరెంట్ లుక్ లో మెరిసిపోతామనడంలో ఎలాంటి సందేహం లేదు.
ధర: రూ 520. ఇక్కడ కొనండి.
జర్దోసీ గాజులు (Jardosi Bangles)
జర్దోసీ మెరుపులు దుస్తులనే కాదు గాజులనూ అందంగా మార్చేస్తాయి. దానికి నిదర్శనం ఈ గాజులే. ఇవి మీ చేతులకు కొత్త అందాలను జోడిస్తాయి.
ధర: రూ 499. ఇక్కడ కొనండి.
స్టైలిష్ గాజు (Narrow Bangle)
ఈ గాజు చూడటానికి ఎంత స్టైలిష్ గా ఉందో కదా.. ఈ గాజుపై పొదిగిన స్వరోవ్ స్కీ స్టోన్ మిమ్మల్ని మరింత అందంగా మార్చేస్తుంది. ఫంక్షన్లు, పండగల సమయంలోనే కాదు.. ఆఫీసుకి కూడా ఈ గాజు వేసుకెళ్లచ్చు.
ధర: రూ 3,396. ఇక్కడ కొనండి.
కాయిన్లతో మెరిసిన గాజులు (Cinilized Glazed Glasses)
ఎరుపు, పచ్చ రంగు రాళ్లు పొదిగిన ఈ గాజులపై అమర్చిన నాణేలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా. పండగల సమయంలో ఈ గాజులు వేసుకొంటే చాలా అందంగా మెరిసిపోతారు.
ధర: రూ 438. ఇక్కడ కొనండి.
సంప్రదాయబద్ధంగా.. (Traditional Look Bangles)
సంప్రదాయబద్దంగా మెరిసిపోతున్న ఈ గాజులు మీకు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పండగలు, శుభకార్యాల సమయంలో ఈ గాజులు వేసుకొంటే మీరు చాలా అందంగా మెరిసిపోతారు.
ధర: రూ 1000. ఇక్కడ కొనండి.
గోల్డ్ టోన్డ్ పెర్ల్ గాజులు (Gold Torn Pearl Bangles)
ఈ పెర్ల్ గాజులు సిల్క్ చీర కట్టుకొన్నప్పుడు వేసుకొంటే బాగుంటాయి.
ధర: రూ 2,480. ఇక్కడ కొనండి.
సిల్వర్ సొగసుల గాజులు (Silver Fineness Bangles)
సిల్వర్ రంగులో మెరిసిపోతున్న ఈ గాజులు వేసుకొంటే మీకు ఎత్నిక్ లుక్ వస్తుంది. చీర కట్టుకొన్నప్పుడు ఈ గాజులు వేసుకోవచ్చు.
ధర: రూ 329. ఇక్కడ కొనండి.
ఇంద్రధనస్సు రంగుల గాజులు (Colourful Glasses Of Rainbow)
మల్టీ కలర్ రంగుల్లో మెరిసిపోతున్న ఈ గాజులు ఇంద్రధనస్సుని తలపిస్తున్నాయి కదా..! తెలుపు రంగు దుస్తులు వేసుకొన్నప్పుడు ఈ గాజులు వేసుకొంటే చాలా బాగుంటుంది.
ధర: రూ 349. ఇక్కడ కొనండి.
చూశారుగా.. అందమైన jewellery designs. అందంగా ఉండటంతో పాటు చాలా తక్కువ ధరకే ఇవి లభిస్తున్నాయి. ఈ నగలు కొత్త కోడలిగా ఏడాదంతా మిమ్మల్ని మెరిసిపోయేలా చేస్తాయి.