ADVERTISEMENT
home / సౌందర్యం
మీ బ‌డ్జెట్‌కి త‌గిన పెర్ఫ్యూమ్‌తో.. సువాస‌న‌భ‌రితంగా మారిపోండి..!

మీ బ‌డ్జెట్‌కి త‌గిన పెర్ఫ్యూమ్‌తో.. సువాస‌న‌భ‌రితంగా మారిపోండి..!

అమ్మాయిలు అన్నాక ప్రతీరోజూ అందంగా కనిపించాలని అనుకుంటారు. కేవ‌లం అందంగానే కాదు.. మంచి సువాసనలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను వాడాలని అనుకొనేవారు  (Smelling good)  కూడా అనేకమంది ఉంటారు. చ‌క్క‌టి ప‌రిమ‌ళం అనేది మ‌న‌లో నింపే ఉత్సాహ‌మే వేరుగా ఉంటుంది. మార్కెట్లో రోజూ కొత్త‌కొత్త బ్రాండ్లు వ‌స్తూ ఉండ‌డంతో మ‌న‌మూ పెర్ఫ్యూమ్‌ల (Perfumes) ఎంపిక‌లో వివిధ ర‌కాల‌ను ఎంచుకునే వీలు క‌లిగింది. 

అయితే ఎప్పుడూ ఒకే త‌ర‌హా పెర్ఫ్యూమ్‌ వాడ‌డం స‌రికాదు. మీరు వెళ్లే ప్ర‌దేశమేంటి? వెళ్తున్న సంద‌ర్భం ఏంటి? తెలుసుకొని దాని ఆధారంగా పెర్ఫ్యూమ్‌ని ఎంచుకోవడం బెటర్. ఈ క్రమంలో మనం కూడా.. కొన్ని ఖ‌రీదైన లేదా మ‌రికొన్ని త‌క్కువ బ‌డ్జెట్‌లో దొరికే పెర్ఫ్యూమ్‌ల గురించి తెలుసుకుందాం. మీకు ఏ పెర్ఫ్యూమ్ ఎంచుకోవాలో అర్థం కాక‌పోతే.. సందర్భాన్ని బట్టి కాకుండా.. అన్ని అకేషన్స్‌కూ ఉపయోగపడే పెర్ఫ్యూమ్‌ల‌ను ఎంచుకోవ‌డం ఎలా అన్న విష‌యాన్ని కూడా తెలుసుకుందాం.

ఈ క‌థ‌నంలోని ముఖ్యాంశాలు

పెర్ఫ్యూమ్‌ల‌లో ర‌కాలు
మీ పెర్ఫ్యూమ్‌ల‌ను ఎలా భ‌ద్ర‌ప‌ర్చాలి?
ప‌రిమ‌ళం ఎక్కువసేపు నిల‌వాలంటే ఏం చేయాలి?
పెర్ఫ్యూమ్‌ల ఉప‌యోగానికి చిట్కాలు
10 ఖ‌రీదైన పెర్ఫ్యూమ్‌లు
అందుబాటు ధ‌ర‌లో 3 పెర్ఫ్యూమ్‌లు
1000 కంటే త‌క్కువ ధ‌ర‌లో 7 పెర్ఫ్యూమ్‌లు

ADVERTISEMENT

బ‌డ్జెట్ చెక్‌ చేసుకోండి..

మార్కెట్లో అందుబాటులో ఉన్న ఖ‌రీదైన పెర్ఫ్యూమ్‌లు కావాల‌ని.. వాటిని ఒక్క‌సారైనా ఉప‌యోగించాల‌ని మ‌న‌మంతా క‌నీసం ఒక్క‌సారైనా అనుకొని ఉంటాం. ఆ పెర్ఫ్యూమ్ మ‌న ఫేవ‌రెట్ బ్లాగ‌ర్ లేదా మ‌న‌కు న‌చ్చిన సెల‌బ్రిటీ.. ఇలా ఎవ‌రైనా ఉప‌యోగిస్తూ ఉండొచ్చు. అయితే ఆ పెర్ఫ్యూమ్ మ‌నం వాడ‌డం స‌రైన‌దేనా.. మ‌నం పెట్టే డ‌బ్బుకు త‌గిన‌ట్లుగా అది ఉంటుందా? అని ఆలోచించాలి.

అంతేకాదు.. అంత డ‌బ్బు దానిపై ఖ‌ర్చు చేయ‌కుండా.. అలాంటిదే త‌క్కువ ధ‌ర‌లో కొనేందుకు వేరే ఏదైనా ప్ర‌త్యామ్నాయం ఉందా అని చెక్ చేసుకోవాలి. అలా మ‌నం పెర్ఫ్యూమ్‌ల‌కు ఎంత బ‌డ్జెట్ పెట్టాలో ముందు నిర్ణ‌యించుకున్న త‌ర్వాత ఆ ధ‌ర‌కు త‌గిన పెర్ఫ్యూమ్‌ల‌ను ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది.

ఏ పెర్ఫ్యూమ్‌ని ఎంచుకోవాలి?

మ‌నం ఏదైనా పెర్ఫ్యూమ్‌ని కొనుగోలు చేయడానికి ముందు.. ఏ సంద‌ర్భానికి ఆ పెర్ఫ్యూమ్ వేసుకోవాలనుకుంటున్నామో ముందుగా గుర్తించాలి. ఆఫీస్ మీటింగ్‌, స్పెష‌ల్ డేట్‌, పార్టీ, లేదా మామూలు రోజు.. ఇలా రోజును, సంద‌ర్భాన్ని బ‌ట్టి ఎంచుకోవాల్సిన పెర్ఫ్యూమ్ మారుతూ ఉంటుంది. ప్ర‌తి అకేష‌న్‌కి దానికి త‌గిన ప్ర‌త్యేక‌మైన పెర్ఫ్యూమ్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కొంద‌రికి ఫ్లోర‌ల్ సువాస‌న న‌చ్చితే.. మ‌రికొంద‌రికి సిట్ర‌స్ వాస‌నంటే ఇష్టం. సాధార‌ణంగా అయితే సిట్ర‌స్ వాస‌న‌తో కూడిన పెర్ఫ్యూమ్‌లు.. రోజూ వేసుకోవ‌డానికి చాలా అనువుగా ఉంటాయి. ఫ్లోర‌ల్‌వి పార్టీల్లో అయితే బాగుంటాయి. ఇక లేత సువాస‌న‌లు వెదజల్లే పెర్ఫ్యూమ్స్ అయితే.. రోజంతా వేసుకున్న ఇబ్బంది లేదు. కాస్త ఘాటుగా ఉన్న‌వి రాత్రి స‌మ‌యంలో, పార్టీల్లో వేసుకుంటే ఎంతో అట్రాక్టివ్‌గా క‌నిపిస్తారు.

ఇష్టానికి త‌గిన ఫ్లేవ‌ర్‌..

సాధార‌ణంగా పెర్ఫ్యూమ్‌ల‌లో ప‌రిమ‌ళం మూడు లేయ‌ర్లుగా ఉంటుంది. టాప్‌, మిడిల్‌, బేస్‌.. ఈ మూడింటి మ‌ధ్య కెమిక‌ల్ రియాక్ష‌న్ జ‌ర‌గ‌డం వ‌ల్లే చ‌క్క‌టి ప‌రిమ‌ళాన్ని అది వెదజల్లుతుంది. ఫ్లోర‌ల్ పెర్ఫ్యూమ్‌ల‌లో రోజ్‌, జాస్మిన్‌, మాగ్నోలియా, లిల్లీస్‌ వంటివి అందుబాటులో ఉంటాయి.

ADVERTISEMENT

సిట్ర‌స్‌లో సిట్ర‌స్‌, గ్రేప్‌ఫ్రూట్‌, టాంగ‌రీన్ వంటి ర‌కాలుంటాయి. ఫ్రూట్ బేస్‌డ్‌గా ర‌డీ అయిన ఫ్రెష్ పెర్ఫ్యూమ్‌లలో యాపిల్స్‌, పియ‌ర్‌, స్ట్రాబెర్రీ, పీచెస్‌, రాస్బెర్రీ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవేగాక దాల్చిన చెక్క‌, అనాస పువ్వు వంటి ఫ్లేవ‌ర్ల‌తో కూడిన పెర్ఫ్యూమ్‌లు కూడా మార్కెట్లో ల‌భిస్తున్నాయి. ఇవి గాక కాస్త ఘాటుగా ఉండే వాస‌న కావాల‌నుకునేవారికోసం చంద‌నం, సెడార్‌, బిర్చ్ వంటి ఫ్లేవ‌ర్లు కూడా ఉన్నాయి.

ప్ర‌తి పెర్ఫ్యూమ్ కొనేముందు దాని వాస‌న చూసి తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే కొనేముందు అది.. ఏ సంద‌ర్భానికి త‌గిన‌దో కూడా గుర్తించ‌గ‌ల‌గ‌డం ముఖ్యం. చిన్న స్నిఫ్ టెస్ట్ చేయ‌డంతో.. ఆ పెర్ఫ్యూమ్ వాస‌న తెలుసుకోవ‌చ్చు.

అది ఎంత స‌మ‌యం ఉంటుందో తెలుసుకోవాలంటే మీ మ‌నిక‌ట్టు వ‌ద్ద స్ప్రే చేసుకొని చూసుకోవాలి. చాలామంది ఏది కొనాల‌న్నా ఆన్‌లైన్ షాపింగ్‌కే ఆస‌క్తి చూపిస్తుంటారు. కానీ పెర్ఫ్యూమ్ విష‌యంలో మాత్రం నేరుగా చెక్ చేసి తీసుకోవ‌డం మంచిది. 

భ‌ద్ర‌ప‌ర్చ‌డమూ తెలియాలి..

పెర్ఫ్యూమ్ కొన‌డం మాత్ర‌మే కాదు.. దాన్ని జాగ్ర‌త్త‌గా భ‌ద్ర‌ప‌ర్చ‌డం కూడా తెలిసి ఉండాలి. ఎక్స్‌పైరీ డేట్ విష‌యానికొస్తే.. క‌నీసం ఒక్క‌సారైనా స్ప్రే చేసుకుంటేనే దాని వాస‌న త‌గ్గ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. గాలిలోని ఆక్సిజ‌న్‌తో ఆ పెర్ఫ్యూమ్ క‌ల‌వ‌కపోతే అది పాడ‌వ‌ద‌ని గుర్తుంచుకోవాలి. సాధార‌ణంగా గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఈ పెర్ఫ్యూమ్‌ల‌ను భ‌ద్ర‌ప‌ర్చ‌వ‌చ్చు. ఎండాకాలంలో వేడి బాగా ఉన్న‌ప్పుడు మాత్రం ఫ్రిజ్‌లో పెట్టాల్సి ఉంటుంది. వేడి త‌గిలితే పెర్ఫ్యూమ్ వాస‌న తొంద‌ర‌గా పోతుంది.

ADVERTISEMENT

అందుకే వేడి, తేమ ఎక్కువ‌గా ఉన్న వాతావ‌ర‌ణంలో ఇలాంటివి ఉంచ‌కూడ‌దు. అందుకే ఇంట్లో తేమ ఎక్కువ‌గా ఉండే గదుల్లో దీన్ని ఉంచ‌కూడ‌దు. వంట‌గ‌దికి ద‌గ్గ‌ర‌గా దీన్ని భ‌ద్ర‌ప‌ర్చ‌డం మంచిది కాదు. స్నానం చేయ‌గానే ఉప‌యోగించ‌వచ్చ‌ని బాత్రూంలో కూడా పెట్టకండి. అంతేకాదు.. పెర్ఫ్యూమ్ ఎక్కువ‌కాలం ఉండేందుకు దాన్ని ఒరిజిన‌ల్ బాక్స్‌లోనే ఉంచాలి. సూర్య‌ర‌శ్మి కూడా త‌గ‌ల‌కుండా ఉంచాలి. కాస్త చీక‌టిగా ఉండే క‌ప్‌బోర్డ్‌లో ఉంచ‌డం మంచిది. అంతేకాదు.. ఉప‌యోగించే ముందు పెర్ఫ్యూమ్ ని వూప‌కూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల అందులోని ప‌రిమ‌ళం బ‌య‌ట గాలితో క‌లిసి కెమిక‌ల్ రియాక్ష‌న్‌కి గురై వాస‌న పోతుంది.

ఎక్కువ స‌మయం నిలిచి ఉండాలంటే..

చాలామంది మ‌ణిక‌ట్టుపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని.. దాన్ని బాగా రుద్దుతుంటారు. అయితే ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాదు. పెర్ఫ్యూమ్ ఎక్కువ స‌మయం పాటు నిలిచి ఉండాలంటే దాన్ని కొట్టుకొని అలా వ‌దిలేయాలి. ఇంకా ఎక్కువ స‌మ‌యం నిల‌వాలంటే ముందు ఆ ప్ర‌దేశంలో కాస్త పెట్రోలియం జెల్లీ రాసి ఆ త‌ర్వాత స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ స‌మ‌యం నిలిచి ఉండేందుకు మ‌ణిక‌ట్టు వ‌ద్ద‌, చెవి వెనుక‌, మోచేయి వ‌ద్ద‌, మోకాలు వ‌ద్ద‌, మెడ‌పై స్ప్రే చేసుకోవ‌చ్చు. స్నానం చేసిన వెంట‌నే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే ఎక్కువ స‌మయం పాటు నిలిచి ఉంటుంది.

perfume1
టెస్ట‌ర్ ఉందా?

మీకు ఏ పెర్ఫ్యూమ్ తీసుకోవాలో అర్థం కాక‌పోతే అక్క‌డ టెస్ట‌ర్ అందుబాటులో ఉందేమో చూడండి. అందుబాటులో ఉంటే దాని వాస‌న చూసి తీసుకునే వీలుంటుంది. లేదంటే మినీ బాటిల్స్ ఉన్నాయేమో చెక్ చేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎలాగూ స్ప్రే చేసుకున్నాం క‌దా అని న‌చ్చ‌క‌పోయినా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఒకే ఫ్లేవ‌ర్ ఉన్నా అన్ని కంపెనీల పెర్ఫ్యూమ్‌లు ఒకే ర‌కంగా ఉండ‌వ‌ని గుర్తుంచుకోండి.

అలాగే పెర్ఫ్యూమ్‌లు త్వ‌ర‌గా వాస‌న కోల్పోతాయి. వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచ‌లేం. అందుకే చిన్న బాటిల్స్ కొంటూ .. వాటిని వీలైనంత తొంద‌ర‌గా ఉప‌యోగించ‌డానికి ప్ర‌య‌త్నించండి. అప్పుడే పెర్ఫ్యూమ్ వాస‌న మొద‌టి రోజు ఎలా ఉందో అలాగే ఎప్పటికీ ఉండేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంటుంది.

ADVERTISEMENT

సూచ‌న‌లు చ‌ద‌వాల్సిందే..

ప్ర‌తి పెర్ఫ్యూమ్ ఉప‌యోగించ‌డానికి ప్ర‌త్యేక‌మైన సూచ‌న‌లు ఉంటాయి. అందుకే దాన్ని కొనే ముందు అది మీకు న‌ప్పుతుందా లేదా తెలుసుకోవ‌డానికి ఈ సూచ‌న‌లు ప‌నిచేస్తాయి. మీరు కొనే పెర్ఫ్యూమ్ మీ ప‌ర్స‌నాలిటీకి త‌గిన‌ట్లు ఉండేలా చూసుకోవాలి. అటు మ‌రీ లైట్‌గా, ఇటు మ‌రీ ఎక్కువ వాస‌న ఉండ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. అంతేకాదు.. పెర్ఫ్యూమ్ కొన్న త‌ర్వాత కూడా ఎలా ఉప‌యోగించాలో తెలుసుకోవ‌డానికి ఈ సూచ‌న‌లు పాటించాల్సిందే..

పెర్ఫ్యూమ్ కొనేముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి చ‌దివాం క‌దా.. ఇప్పుడు వివిధ ర‌కాల బ‌డ్జెట్‌ల‌కు మ‌న దేశంలో అందుబాటులో ఉన్న పెర్ఫ్యూమ్‌ల గురించి చూద్దాం.

10 ఖ‌రీదైన పెర్ఫ్యూమ్‌లు

perfume2

1. కరోలినా హెర్రెరా గుడ్‌గ‌ర్ల్ యు డె పెర్ఫ్యూమ్

ADVERTISEMENT

అటు సెల‌బ్రిటీలు, ఇటు బ్లాగ‌ర్లు ఉప‌యోగించే ఉత్త‌మ‌మైన పెర్ఫ్యూమ్ ఇది. లైట్‌, డార్క్ గుణాల‌తో మిళ‌త‌మైన ఈ పెర్ఫ్యూమ్ సువాస‌న అద్భుత‌మ‌నే చెప్పుకోవాలి. కేవ‌లం వాస‌నే కాదు.. ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ లుక్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంటుంది.
ధ‌ర – 80ఎం.ఎల్ బాటిల్‌కి రూ. 6800

perfume3

2. ఈవ్స్ సెయింట్ లారెంట్ బ్లాక్ ఓపియం యు డె పెర్ఫ్యూమ్

మీ జేబులోంచి ప‌ద్నాలుగు వేల రూపాయ‌ల‌కు క‌త్తెర పెట్టినా.. ఈ పెర్ఫ్యూమ్ మిమ్మ‌ల్ని మీ అభిమాన తార‌లా అందంగా ప‌రిమ‌ళించేలా చేస్తుంది. ఇందులో ప‌రిమాణం ఆధారంగా రెండు రకాల బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు న‌చ్చిన వాటిని ఎంచుకోవ‌చ్చు. ఇది టాప్ నోట్స్ (మొద‌ట వ‌చ్చే సువాస‌న‌) పింక్ పెప్ప‌ర్‌, పియ‌ర్‌, ఆరెంజ్ బ్లాస‌మ్ నుంచి త‌యార‌వ‌గా.. మిడిల్‌ నోట్స్ (టాప్‌నోట్స్ త‌ర్వాత వ‌చ్చే సువాస‌న‌) జాస్మిన్‌, కాఫీ ఫ్లేవ‌ర్ల‌తో.. బేస్ నోట్స్ (ఆఖ‌రున వ‌చ్చే సువాస‌న‌) వెనిలా, ప‌ట్చౌలీ, సెడార్ ఫ్లేవ‌ర్ల‌తో రూపొందించడం జరిగింది.
ధ‌ర – రూ. 14,044

ADVERTISEMENT

perfume4

3. టామ్‌ఫ్లోర్ట్ వెనీల్ ఫెటాల్‌

క్రీమీ వెనిలా, చ‌క్క‌టి కుంకుమ‌పువ్వు, మైరా లేలేత ప‌రిమ‌ళాలు క‌లిపిన స్వీట్ అండ్ స్పైసీ సెంట్ ఇది. దీని స్మోకీ స్మెల్ చాలా ఎక్కువ స‌మ‌యం నిలిచి ఉండ‌డ‌మే కాదు.. మిమ్మ‌ల్ని క్లాసీగా క‌నిపించేలా చేస్తుంది.
ధ‌ర – రూ. 16,857 ($235)

perfume5

ADVERTISEMENT

4. బ్యూటిఫుల్ బై ఎస్టీ లాడార్ ఫ‌ర్ విమెన్‌

ఇది మూడు ద‌శాబ్దాల నుంచి టాప్ సెల్ల‌ర్‌గా పేరొందిన బ్రాండ్‌. ఈ సువాస‌న సింపుల్‌గానే ఉన్నా అంద‌రినీ ఆక‌ర్షించేలా ఉంటుంది. దీనిని ఇటు ఫ్లోర‌ల్‌, అటు ఫ్రూటీ సువాస‌న‌ల‌ను క‌లిపి త‌యారు చేయడం జరిగింది. రోజ్‌, జాస్మిన్, కార్నేష‌న్‌ల‌తో పాటు సిట్ర‌స్‌, మెల‌న్, పీచ్‌, ప్ల‌మ్ వాస‌న‌ల‌ను కూడా క‌ల‌గ‌లిపి దీన్ని తయారుచేస్తారు.
ధ‌ర – 30 ఎం.ఎల్ కి రూ. 6659

perfume6perfume6

5. లాంకోమ్ లావీ ఈ బెల్ యు డె పెర్ఫ్యూమ్

ADVERTISEMENT

రోజంతా ఉల్లాసంగా, ప‌రిమ‌ళభ‌రితంగా ఉండాలంటే ఈ పెర్ఫ్యూమ్‌ని ఉప‌యోగించ‌వ‌చ్చు. లాంకోమ్ సంస్థ రూపొందించిన ఈ పెర్ఫ్యూమ్‌లో జాస్మిన్‌, ఆరెంజ్ బ్లాస‌మ్ ప‌రిమ‌ళాల‌తో వెనిలా, ప‌ట్చౌలీ, బ్లాక్ క‌రంట్‌, ప్రాలిన్ ఫ్లేవ‌ర్ల సువాస‌న‌ల‌ను క‌ల‌గ‌లిపార‌ట‌. ప్ర‌త్యేక‌మైన డేట్‌ల‌కు, మీ రోజువారీ దిన‌చర్య‌కు, స్నేహితుల‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్తున్న‌ప్పుడు దీన్ని ఉప‌యోగిస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది.
ధ‌ర – 73. 93 ఎం.ఎల్ బాటిల్‌కి రూ.11,949

perfume7

6. విక్టోరియా సీక్రెట్ బాంబ్‌షెల్ యు డె పెర్ఫ్యూమ్ స్ప్రే

ఈ సెంట్ మ‌న‌కు అంద‌మైన వేస‌విని గుర్తుచేస్తుంది. పియోనీ, పాష‌న్ ఫ్రూట్ క‌లిపి చేసిన ఈ పెర్ఫ్యూమ్ అటు ఫ్లోర‌ల్ సువాస‌న‌ను అందిస్తూనే ఇటు సిట్ర‌స్ బేస్‌డ్ పెర్ఫ్యూమ్‌లు ఇచ్చే సువాస‌న‌ను కూడా అందిస్తుంది.
ధ‌ర – 1.7 ఔన్సుల‌కు రూ.6745

ADVERTISEMENT

perfume8

7. లాక్షిటేన్ క్రిస్ప్ సిట్ర‌స్ వెర్బ‌నా యు డె టాయిలెట్ స్ప్రే

వేస‌విలో చెమ‌ట, డ్ర‌స్ ఇత‌ర‌త్రా విష‌యాల వ‌ల్ల కాస్త చిరాగ్గా అనిపించ‌వ‌చ్చు. అలాంటి స‌మ‌యంలో ఈ పెర్ఫ్యూమ్‌ని ఉప‌యోగించి కాస్త రిలాక్సింగ్ ఫీలింగ్ పొందే వీలుంటుంది. ఇందులో నిమ్మ సువాస‌న‌ల‌తో పాటు ఫ్రాన్స్‌లోని తోట‌ల్లో ఆర్గానిక్‌గా పెంచిన వెర్బ‌నా పూల సువాస‌న ఆహ్లాదాన్ని పంచుతుంది. వేసవిలో సిట్ర‌స్ సువాస‌న‌తో కూడిన స్ప్రే వేసుకోవ‌డం వ‌ల్ల రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
ధ‌ర – 100 ఎం.ఎల్‌కి రూ. 1950

perfume9

ADVERTISEMENT

8. క్లీన్ ఒరిజిన‌ల్ యు డె పెర్ఫ్యూమ్ స్ప్రే

మీరు మ‌రీ ఘాటుగా కాకుండా లేత‌గా లైట్‌గా ఉండే ప‌రిమ‌ళాన్ని ఇష్ట‌ప‌డితే ఇది మీకు చ‌క్క‌టి ఎంపిక‌. ఇందులో ఫ్లోర‌ల్, సిట్ర‌స్ సువాస‌న‌లు మిమ్మ‌ల్ని మరీ ఇబ్బంది పెట్ట‌కుండా లైట్‌గా వాస‌న‌ను అందిస్తూనే ఫ్రెష్‌గా ఉంచుతాయి.
ధ‌ర – 60ఎం.ఎల్‌కి రూ.5501

perfume10

9. కోచ్ న్యూయార్క్ ద ఫ్రాగ్రెన్స్ యు డె పెర్ఫ్యూమ్ స్ప్రే

ADVERTISEMENT

న్యూయార్క్ న‌గ‌రం నుంచి స్ఫూర్తిపొంది రూపొందించిన పెర్ఫ్యూమ్ ఇది. అటు ల‌గ్జ‌రీ, ఇటు క్లాస్ రెండూ క‌ల‌గ‌లిసిన ప‌రిమ‌ళం దీనిది. అటు ఫ్రూటీ, ఇటు ఫ్లోర‌ల్ ఫ్లేవ‌ర్లు కలిపి త‌యారుచేసిన ఈ స్ప్రేలో రాస్బెర్రీల‌తో పాటు గులాబీల‌ను కూడా ఉప‌యోగించారు. అంతేకాదు.. ఇందులో చ‌క్క‌టి వెనిలా ఫ్లేవ‌ర్ కూడా ఉండ‌డంతో చాలా గంట‌ల వ‌ర‌కూ ఇది ప‌రిమ‌ళాన్ని అందిస్తుంది.
ధ‌ర – 90ఎం.ఎల్‌కి 5850

perfume11

10. కెల్విన్ క్లెయిన్ యుఫోరియా యు డె పెర్ఫ్యూమ్

అంద‌రిలోనూ మీరే సెంటరాఫ్ అట్రాక్ష‌న్‌గా ఉండాల‌నుకుంటే కెల్విన్ క్లెయిన్ యుఫోరియా వాడాల్సిందే. అరుదుగా దొరికే పండ్లు, అంద‌మైన పూల‌తో త‌యారుచేసిన ప‌రిమ‌ళం ఇది. ఇంతేకాదు.. ఇందులో యాంబ‌ర్‌, మొహోగ‌నీ చెట్ల నుంచి తీసిన ప‌రిమ‌ళం కూడా జోడించి త‌యారుచేస్తారు.
ద‌ర – 100ఎం.ఎల్‌కి 4631.

ADVERTISEMENT

ఇవ‌న్నీ ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉన్నాయి. మేం కొనలేం అనుకుంటున్నారా? అయితే మీకోసం.. వీటి కంటే త‌క్కువ ధ‌ర‌లోనే ప్ర‌త్యామ్నాయాలు కూడా ఉన్నాయి.

అందుబాటు ధ‌ర‌లో ఉన్న పెర్ఫ్యూమ్‌లు

perfume12

1. స్కిన్ న్యూడ్ బై టైటాన్‌

లిచీ, గులాబీల ప‌రిమ‌ళాలు క‌లిపి త‌యారుచేసిన ఈ స్కిన్ న్యూడ్ పెర్ఫ్యూమ్ మిమ్మ‌ల్ని అంద‌రిలోనూ ప్ర‌త్యేకంగా..ఎక్స‌ట్రార్డిన‌రీగా క‌నిపించేలా చేస్తుంది. అంతేకాదు.. ఇది చాలా స‌మ‌యం పాటు నిలిచి ఉంటుంది.
ధ‌ర‌. రూ.1190

ADVERTISEMENT

perfume13

2. ప్లేబాయ్ ప్లే ఇట్ స్పైసీ

దీని అద్భుత‌మైన ప‌రిమ‌ళం గురించి చాలామందికి తెలుసు. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ద‌గ్గ‌ర ఒక్క‌టైనా ఈ పెర్ఫ్యూమ్ ఉండాల‌ని భావిస్తారు. దీన్ని కొన‌డం కూడా చాలా సులువు. ధ‌ర కూడా అందుబాటులో ఉంటుంది. ప్లే ఇట్ స్పైసీ ప‌రిమ‌ళం కాస్త ఘాటుగా ఉండ‌డంతో మీరు ప్ర‌త్యేకంగా క‌నిపించ‌డం కోసం దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.
ధ‌ర – రూ. 1611

perfume14

ADVERTISEMENT

3. ఒరిఫ్లేమ్ క్వీన్ ఆఫ్ ద నైట్‌

డిన్న‌ర్లు, రాత్రి పూట జ‌రిగే పార్టీల‌కు ఇది చాలా చ‌క్క‌టి ఎంపిక‌. అయితే ఇది అధికారిక మీటింగ్‌ల‌కు పెద్ద‌గా ప‌నికిరాదు. దీని ప‌రిమ‌ళ‌మే కాదు.. బాటిల్ కూడా చాలా అందంగా ఉంటుంది.
ధ‌ర – రూ. 1099

ఖ‌రీదైన పెర్ఫ్యూమ్ ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఉప‌యోగించే పెర్ఫ్యూమ్ ల గురించి తెలుసుకున్నాం క‌దా.. ఇప్పుడు రూ.1000 కంటే త‌క్కువ‌గా ఉండే పెర్ఫ్యూమ్ ల గురించి చూద్దాం..

1000 కంటే త‌క్కువ ధ‌ర‌లో 7 పెర్ఫ్యూమ్‌లు

perfume15

ADVERTISEMENT

1. రెవ్లాన్ చార్లీ రెడ్‌

రోజూ ఆఫీస్‌కి లేదా కాలేజ్‌కి వెళ్లేట‌ప్పుడు ఉప‌యోగించ‌డానికి ఇది చ‌క్క‌టి ఎంపిక‌. ఈ ఫ్లోర‌ల్ సెంట్ లో మ‌స్కీ ఫ్లేవ‌ర్ కూడా క‌లిసి ఉంటుంది. ఎక్క‌డా క‌నిపించ‌ని అరుదైన కాంబినేష‌న్ తో కూడిన ఫ్రెష్ కాంబో రోజువారీ స్ప్రే చేసుకోవ‌డానికి చ‌క్క‌గా ఉంటుంది.
ధ‌ర‌- రూ. 750

perfume16

2. ట్రెండీ ఫ్ర‌మ్ నైకీ

ADVERTISEMENT

మోడ్ర‌న్ అమ్మాయిల కోసం రూపొందించిన ఈ పెర్ఫ్యూమ్ అటు ఫెమినైన్ ఫ్లేవ‌ర్‌గా అనిపిస్తూనే ఇటు స్పోర్టీగా, ఫ్రెష్‌గా అనిపిస్తుంది. రోజుని ప్రారంభించ‌డానికి ఇది చ‌క్క‌టి ఎంపిక‌. ఉద‌యం ఈ ప‌రిమ‌ళాన్ని ఉప‌యోగిస్తే రోజంతా ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. మ‌న దేశంలో మ‌హిళ‌ల కోసం ఉన్న పెర్ఫ్యూమ్ ల‌లో ఇది ఉత్త‌మ‌మైన‌ది.
ధ‌ర‌- రూ. 566

perfume17

3. డీజిల్ ప్ల‌స్ ప్ల‌స్ ఫెమినైన్‌

బిట్ట‌ర్ ఆరెంజ్‌, లిల్లీ ఆఫ్ ద వ్యాలీ టాప్ నోట్స్‌తో త‌యారైన ఈ పెర్ఫ్యూమ్ సాధార‌ణ స్ప్రేల్లా స్వీట్‌గా వాస‌న వ‌చ్చేది కాదు. అయితే చాలా సున్నితంగా లేత ప‌రిమ‌ళం ఉండే ఈ పెర్ఫ్యూమ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.
ధ‌ర – రూ.999

ADVERTISEMENT

perfume18

4. అమెజానియ‌న్ వైల్డ్ లిల్లీ పెర్ఫ్యూమ్ ఆయిల్ ఫ్ర‌మ్ బాడీషాప్‌

ఈ బాటిల్ సైజ్‌, ధ‌ర చూస్తే కాస్త ఖ‌రీదు ఎక్కువే అనిపించ‌డం స‌హ‌జ‌మే. అయితే దీని ప‌రిమ‌ళం కోసం మీరు ఎక్కువ‌గా ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం లేదు. కేవ‌లం ఒక్క చుక్క రాసుకుంటే చాలు.. చ‌క్క‌టి సువాస‌న మీ సొంత‌మ‌వుతుంది. దీన్ని మ‌ణిక‌ట్టు వ‌ద్ద లేదా చెవుల వెనుక రాసుకుంటే రోజంతా ప‌రిమ‌ళ‌భ‌రితంగా అనిపిస్తారు. ఇది మీ వెంట తీసుకెళ్ల‌డానికి సులువుగా ఉంటూ రాసుకుంటే ఎక్కువ స‌మ‌యం నిల‌వ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.
ద‌ర – రూ. 995

perfume19

ADVERTISEMENT

5. బెనెట్టోన్ హాట్ ఈడీటీ ఫ‌ర్ విమెన్‌

వుడీ, ఫ్రెష్‌, ఓరియంటెల్ ప‌రిమ‌ళాల‌ను క‌లిపి త‌యారుచేసిన ఈ పెర్ఫ్యూమ్ చ‌క్క‌టి సువాస‌న‌ను అందిస్తుంది. అంతేకాదు.. ఇది చాలా ఎక్కువ స‌మ‌యం పాటు నిలిచి ఉంటుంది. మీరు పెట్టిన డ‌బ్బుకు త‌గిన పెర్ఫ్యూమ్ ఇది.
ధ‌ర – రూ. 695

perfume20

6. ఫ్యాబ్ ఇండియా సైప్రెస్ పెర్ఫ్యూమ్ ఆయిల్‌

ADVERTISEMENT

చాలా త‌క్కువ ధ‌ర‌లో అద్భుతమైన ప‌రిమ‌ళాన్ని అందించే పెర్ఫ్యూమ్ ఇది. పూల సువాస‌న‌తో నిండిన పెర్ఫ్యూమ్ లు ఉప‌యోగించి మీకు విసుగుపుడితే ఈ ప‌రిమ‌ళాన్ని ప్ర‌య‌త్నించండి. లేలేత సువాస‌న‌ల‌తో వ‌చ్చే ఈ పెర్ఫ్యూమ్ రోల్ఆన్‌తో పాటు రావ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. దీన్ని మీ మ‌ణిక‌ట్టుపై, చెవుల వెనుక రుద్దుకుంటే చాలు.. రోజంతా ప‌రిమ‌ళం మీ సొంత‌మ‌వుతుంది.
ధ‌ర – రూ. 265

perfume21

7. ప‌రాగ్ ఫ్రేగ్రెన్సెస్ నాచుర‌ల్ ఫ్రేగ్రెన్స్ శాండిల్‌వుడ్

చ‌క్క‌టి స‌హ‌జ సువాస‌న కోసం దీన్ని వినియోగించ‌వచ్చు. ఇందులో స‌హ‌జ‌మైన చంద‌నం సువాస‌న నిండి ఉంటుంది. ఆ ప‌రిమ‌ళాన్ని ఇష్ట‌ప‌డేవారు దీన్ని ఉప‌యోగించ‌వ‌చ్చు.
ధ‌ర – రూ. 799

ADVERTISEMENT

మీకు త‌గిన అన్ని ర‌కాల పెర్ఫ్యూమ్ ల గురించి మీకు స‌మాచారం అందించాం. అయితే ఇందులో ఏదో ఒక‌టే ఎంచుకోకుండా మీ దుస్తుల‌కు త‌గిన యాక్సెస‌రీల‌ను ఎంచుకున్న‌ట్లు మీరు వెళ్లే సంద‌ర్బాన్ని బట్టి దానికోసం ఓ ప్ర‌త్యేక‌మైన పెర్ఫ్యూమ్ ని సెలక్ట్ చేసుకోండి. రోజంతా ఫ్రెష్ గా, ఉత్సాహంగా ఫీల‌య్యేందుకు దీనిని మించినది మ‌రొక‌టి లేదు.

ఏ కార‌ణ‌మూ మిమ్మ‌ల్ని ప‌రిమ‌ళ‌భ‌రితంగా ఉండ‌కుండా చేయ‌లేదు.. వీటిని ఉప‌యోగించి రోజంతా సువాస‌న వెద‌జ‌ల్లండి. అయితే దీన్ని చ‌ల్ల‌ని, చీక‌టి ప్ర‌దేశంలో దాచి ఉంచండి.వాడ‌గానే మూత‌ను గట్టిగా బిగించి ఉంచండి. ఈ పెర్ఫ్యూమ్ ల‌ను ప్ర‌య‌త్నించి వీటిలో ఏది మీకు బాగా న‌చ్చిందో కామెంట్ చేయండి.

ఇవి కూడా చ‌ద‌వండి.

స్ట్రెయిటెనింగ్‌, స్మూతెనింగ్‌తో.. జుట్టును స్టైలిష్‌గా మార్చుకుందాం..

ADVERTISEMENT

ఫేషియ‌ల్ బ్లీచ్‌తో.. మెరిసే అందాన్ని సొంతం చేసుకుందాం.. !

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

 

07 Feb 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT