ADVERTISEMENT
home / సౌందర్యం
జుట్టు రాలుతోందా? అయితే మీకోసమే ఈ పరిష్కార మార్గాలు..!

జుట్టు రాలుతోందా? అయితే మీకోసమే ఈ పరిష్కార మార్గాలు..!

జుట్టు రాలడం (hair fall) అంటే భయపడని వారు ఎవరుంటారు చెప్పండి? ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో తమ జుట్టు ఎక్కువగా రాలిపోతోందని.. దానికి పరిష్కారమేమిటా అని టెన్షన్ పడుతూనే ఉంటారు. అయితే చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే.. మన జుట్టు సహజంగా కొంత రాలిపోతుంది. అంతకంటే ఎక్కువైతే మాత్రం దాన్ని ఇబ్బందే.

నిపుణులు చెప్పే అంశాల ప్రకారం యాభై శాతం భారతీయ మహిళల్లో ఈ జుట్టు రాలే సమస్య ఉందట. మీ జుట్టు రాలడం సాధారణ స్థాయికంటే.. ఎక్కువగా ఉందంటే ముందు దానికి కారణాలు తెలుసుకోవాలి. అప్పుడే సమస్యను పూర్తిగా వేళ్ల నుంచి తొలగించే వీలుంటుంది.

సాధారణంగా వెంట్రుకల పెరుగుదల సైకిల్ మూడు రకాలుగా ఉంటుంది. అనాజెన్ ఫేజ్‌లో నెలకు అంగుళం చొప్పున వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి. ఈ వేగం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో తక్కువగా ఉంటుంది. ఈ ఫేజ్ రెండు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకూ ఉంటుంది.

తర్వాత అది కెటాజెన్ ఫేజ్‌లో వారం రోజుల పాటు ఉంటుంది. ఆపై టీలోజెన్ ఫేజ్‌లో వెంట్రుక రాలేందుకు సిద్ధమవుతుంది. ఈ తర్వాతి దశలో వెంట్రుకలు రాలుతుంటాయి. ఇలా రోజుకు సుమారు 80 వరకూ వెంట్రుకలు రాలుతాయి. కానీ అంతకంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం.. దాన్ని హెయిర్ ఫాల్ కేటగిరిలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

ఈ కథనంలోని ముఖ్యాంశాలు

జుట్టు రాలడానికి గల కారణాలు
జుట్టు రాలడం పై మనకున్న అపోహలు
జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించాలి
జుట్టు రాలడాన్ని నివారించేందుకు ఇంటి చిట్కాలు
సెలూన్ ట్రీట్ మెంట్స్

జుట్టు ఎందుకు రాలుతుందంటే..

జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొంతమందిలో ఇవి బయటి కారణాలు అయితే.. మరికొందరికి జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య ఎదురై ఉండవచ్చు లేదా శరీరంలో లోపాలు కూడా కారణం కావచ్చు. ఈ క్రమంలో మనం కూడా మహిళల్లో జుట్టు రాలిపోవడానికి గల ప్రధానమైన కారణాలను తెలుసుకుందాం..

Also Read: ఆముదం వల్ల కురులకు కలిగే ప్రయోజనాలు (Castor (Amudham) Oil Benefits For Hair)

ADVERTISEMENT

33

హార్మోన్ల అసమతౌల్యత

మన శరీరంలో తగ్గుముఖం పడుతున్న హార్మోన్ల సమతుల్యత మన ఫాలికల్స్‌ని సెన్సిటివ్‌గా మార్చి.. జుట్టు కుదుళ్లను వదులుగా మారేలా చేస్తుంది. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. మెనోపాజ్, పీసీఓడీ, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ వంటివి మన శరీరంలోని హార్మోన్ల స్థాయుల్లో మార్పులను కలిగించి జుట్టు రాలేలా చేస్తుంది.

జన్యుపరమైన కారణాలు

జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం వంటివి సాధారణంగా జన్యుపరంగా ఎదురయ్యే సమస్యలే. తల్లిదండ్రులకు ఇలాంటి సమస్య ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బట్టతల అబ్బాయిల్లోనే ఎక్కువగా ఉన్నా.. ఆడవారిలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.

Also Read: జుట్టు రాలకుండా చేసే సహజమైన చిట్కాలు (Reduce Hair Fall Naturally)

ఒత్తిడి

ఒత్తిడికి గురవ్వడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య ప్రారంభమవుతుంది. ఒత్తిడి వల్ల జుట్టు ఫాలికల్స్ వదులుగా మారతాయి. డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యలు కూడా ఎదురై ఆఖరికి ఇవన్నీ కలిసి జుట్టు రాలడానికి దారి తీస్తాయి.

ADVERTISEMENT

bangmain 9431501 5451976

గర్భధారణ, ప్రసవం

గర్భధారణ సమయంలో ప్రసవం తర్వాత చాలామందికి హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. ఈ సమయంలో డీహైడ్రేషన్, అలసట వంటివి ఎదురవుతుంటాయి. ఇవి జుట్టు ఫాలికిల్స్‌ని వదులుగా చేసి జుట్టు రాలేలా చేస్తాయి.

విటమిన్ డెఫీషియన్సీ

మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ తక్కువగా ఉండడం వల్ల జుట్టుకి పోషకాలు అందడం కూడా తక్కువవుతుంది. దీంతో జుట్టు బలహీనంగా మారి తెగి రాలిపోతుంది.

ప్రొటీన్ తక్కువగా తీసుకోవడం

మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ మన జుట్టు ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ ప్రొటీన్ తక్కువగా ఉంటే జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రక్తహీనత

శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం, రక్తస్రావం, ఐరన్ లెవెల్ తగ్గడం వంటివి జరిగినప్పుడు శరీరంలో అలసట, తలనొప్పి వంటివి ఎదురవుతుంటాయి. ఇవన్నీ రక్తహీనతకు దారితీస్తాయి.

ADVERTISEMENT

flat

ఒకేసారి ఎక్కువ బరువు తగ్గడం

చాలామంది బరువు తగ్గడానికి ఒకే తరహా ఆహారం లేదా క్రాష్ డైట్లు చేస్తుంటారు. అయితే ఇలా బ్యాలన్స్ లేని డైట్ పాటించడం వల్ల పోషకాహార లోపం ఎదురవుతుంది. ఇలా పోషకాహారం తక్కువగా తీసుకోవడం.. తగినన్ని నీళ్లు  తీసుకోకపోవడం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది.

స్టైలింగ్ ఎక్కువగా చేయడం

జుట్టుకు రకరకాల హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ముఖ్యంగా కెమికల్స్ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల వెంట్రుకలు పల్చగా మారతాయి. అంతేకాదు.. జుట్టును గట్టిగా పట్టి ఉంచేలా ముడి లేదా జడలు వేయడం వల్ల కూడా జుట్టు బాగా లాగినట్లవుతుంది. కాబట్టి త్వరగా రాలిపోయే అవకాశాలుంటాయి.

వయసు ఎక్కువవడం

మీ వయసు నలభై దాటితే ఇంతకుముందు ఉన్నట్లుగా మీ జుట్టులో జీవం లేకపోవడం మీరు గమనించవచ్చు. మెనోపాజ్ జుట్టు రాలిపోవడానికి ఒక కారణమైతే.. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ తగ్గడం వంటివి కూడా దీనికి ముఖ్య కారణం. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఈ పరిస్థితిని దూరం చేయవచ్చు.

జుట్టు రాలడం గురించి అపోహలు

1. బట్టతల మగవారికి మాత్రమే వస్తుంది

సాధారణంగా బట్టతల అబ్బాయిలలో మాత్రమే కనిపిస్తుంది కదా.. అని అది కేవలం వారికి సంబంధించిన సమస్యగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహిళల్లోనూ ఈ తరహా లక్షణాలు అప్పుడప్పుడూ కనిపిస్తాయి. మగవాళ్లలాగే జుట్టు రాలడం మహిళల్లోనూ కామన్. దాదాపు యాభై శాతం మంది మహిళలు జీవితంలో ఏదో ఒక సందర్భంలో జుట్టు రాలే సమస్యతో బాధపడిన వారే. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల ఈ రాలడం ఎక్కువగా ఉండి బట్టతలగా మారుతుంది.

ADVERTISEMENT

22

2. తరచూ తలస్నానం చేస్తే జుట్టు రాలుతుంది.

తరచూ తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలదు.. సరికదా ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే దీనికోసం జుట్టును ప్రతిసారి రసాయనాలతో తయారుచేసే షాంపూలతో కాకుండా.. సహజ ఉత్పత్తులు ప్రయత్నించి చూడండి. అంతే కాదు.. వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది. అంతకంటే ఎక్కువ చేయడం వల్ల మాత్రం జుట్టు రాలదు. కానీ కెమికల్స్ ప్రభావం వల్ల జుట్టు పొడిబారిపోయే ప్రమాదం ఉంటుంది.

3. ఎక్కువగా దువ్వడం వల్ల జుట్టు రాలుతుంది.

జుట్టును దువ్వితే.. దువ్వెనలోకి వస్తుంది కదా. ఈ సమస్య దువ్వడం వల్లే ఎదురవుతుందని భావించడం తప్పు. మీ జుట్టును గట్టిగా లాగడం వల్ల.. అది తెగడం లేదా కుదుళ్లు వదులుగా మారి వూడిపోవడం జరుగుతుంది. అంతేకాదు.. జుట్టు తడిగా ఉన్నప్పుడు.. దువ్వడం వల్ల కూడా జుట్టు తెగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

4. రంగులు ఉపయోగిస్తే జుట్టు రాలుతుంది.

జుట్టుతో రకరకాల ప్రయోగాలు చేయడం చాలామందికి ఇష్టం. అయితే  సైడ్ ఎఫెక్ట్స్ లేని పద్ధతులను పాటించడం మేలు. అలాగే కలరింగ్ విషయానికి వస్తే.. రసాయనాలు తక్కువగా ఉండే రంగులు ఉపయోగించవచ్చు. అయితే పర్మనెంట్ రంగులు కాకుండా.. టెంపరరీవి ఉపయోగించడం వల్ల జుట్టుకి వాటివల్ల హాని కలగకుండా కాపాడుకోవచ్చు.

5. గుండు చేయించుకుంటే జుట్టు రాలడం తగ్గుతుందా?

గుండు చేయించుకోవాలని మీకు కోరిక ఉంటే మాత్రమే చేయించుకోవడం మంచిది. కానీ జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడానికో లేక పల్చని జుట్టు లావుగా మారడానికో దీన్ని మార్గంగా ఎంచుకుంటానంటే మాత్రం.. మీరు గుండు
చేయించుకున్న తర్వాత నిరుత్సాహానికి గురవుతారని కచ్చితంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT

జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలంటే..

జుట్టు రాలడానికి చాలా కారణాలుంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం చేసే కొన్ని పనుల వల్ల జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. అందుకే మన జుట్టు రాలడానికి కారణం తెలుసుకుంటే చాలు.. దాన్ని అరికట్టడం సులువే.. అందుకే కొన్ని కారణాలను, మనం చేయాల్సిన పనులను తెలుసుకుందాం రండి..

fe

దువ్వెన మార్చండి.

జుట్టు రాలుతున్నప్పుడు తలలో దువ్వెన పెట్టాలంటే చాలు.. ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే సరైన దువ్వెన ఉపయోగించడం వల్ల సమస్య లేకుండా చూసుకోవచ్చు. దీనికోసం ముందు వెడల్పాటి పళ్లున్న దువ్వెన ఉపయోగించి చిక్కులు తీసుకోవాలి. ఆ తర్వాత సాధారణ దువ్వెనను ఉపయోగించి దువ్వుకోవచ్చు. దీనివల్ల జుట్టు తెగి రాలిపోయే అవకాశం తగ్గుతుంది. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎక్కువగా తెగుతుంది. అందుకే పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే జుట్టును దువ్వుకోవాలి. అంతేకాదు.. దువ్వెనలను ప్రతి వారం శుభ్రం చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

సరైన ఉత్పత్తులు వాడాలి

తలస్నానం చేయడానికి సల్ఫేట్, సిలికోన్, పారాబెన్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించాలి. అంతేకాదు.. మన తలను కెమికల్స్ ఉన్న షాంపూలతో నింపకుండా జాగ్రత్త పడాలి. ఇది జుట్టు తెగిరాలిపడేలా చేస్తుంది. తలస్నానం చేసిన తర్వాత జుట్టును టవల్ సాయంతో ఆరబెట్టుకోవాలి. హెయిర్ డ్రయర్ ఉపయోగిస్తే దాని నుంచి వేడి రాకుండా చూసుకోవాలి.

11

స్టైలింగ్ చేసుకోవచ్చా?

జుట్టును టైట్ చేయడం.. అనగా గట్టిగా జడ వేసుకోవడం లేదా ముడి వేసుకోవడం వల్ల చికాకుగా ఉండకుండా కాపాడుకోవచ్చని భావిస్తారు చాలామంది. కానీ ఇలా చేయడం వల్ల జుట్టు లాగినట్లు ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కుదుళ్లు వదులుగా తయారవుతాయి. పైగా చెమట ఆరే అవకాశం లేకపోతే జుట్టులో ఫంగస్, చుండ్రు పెరిగే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల కూడా జుట్టు రాలుతుంది. అందుకే మీ హెయిర్ స్టైల్ మీ జుట్టుపై అదనపు భారాన్ని పెంచకుండా కాపాడుకోవాలి. అంతే కాదు.. కెమికల్ హెయిర్ ట్రీట్మెంట్స్ చేయించుకునేముందు మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..

ఇంటి చిట్కాలు..

జుట్టు రాలకుండా ఉండేందుకు ఇంట్లోనే తయారుచేసుకొని జుట్టుకు అప్లై చేసుకునే.. కొన్ని రకాల హెయిర్ ప్యాక్స్ బాగా పనిచేస్తాయి. వీటిని తరచూ వేసుకుంటే జుట్టు రాలడం ఆగుతుంది. వీటిని ఎలా తయారు చేసుకోవాలంటే..

tea

గ్రీన్ టీతో ప్రయత్నించండి. 

గ్రీన్ టీ తాగడంతో పాటు తలకు ప్యాక్‌లా పట్టించడం వల్ల కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికోసం నాలుగైదు గ్రీన్ టీ బ్యాగ్‌ల‌ను.. అర‌లీట‌ర్ నీటిలో వేసి వేడి చేసి ఆ త‌ర్వాత చ‌ల్లారిన నీటిని పక్కన పెట్టుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో తలను తడుపుకొని పది నిమిషాల పాటు ఉండి.. ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇది మంచి కండిష‌న‌ర్‌గా ప‌నిచేస్తుంది.

మందార హెయిర్ ప్యాక్

దీనికోసం ముందుగా మందార పూలను రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. నలిపితే పొడిగా మారేవరకూ.. అలా ఎండబెట్టుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల పెరుగులో.. ఓ టేబుల్ స్పూన్ ఈ పౌడర్ కలపాలి. ఇందులో రోజ్ మేరీ ఎస్సెన్స్ కూడా కలుపుకోవచ్చు. ఇది పింక్ రంగులోకి మారిన తర్వాత దీన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.

కరివేపాకుతో..

పావులీటర్ కొబ్బరి నూనె తీసుకొని దాన్ని మందపాటి అడుగున్న పాత్రలో పోసి అందులో కరివేపాకు రెబ్బలను వేయాలి. స్టవ్ వెలిగించి ఈ నూనెను కొన్ని నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. నూనె మొత్తం ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిన తర్వాత దాన్ని దింపేయాలి. ఈ నూనెను రెండు రోజులకోసారి తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

ADVERTISEMENT

8-homemade-tips-to-stop-hair-loss

ఉసిరి హెయిర్ ప్యాక్

ఉసిరితో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు నల్లగా మిలమిలలాడుతూ ఉండడం  మాత్రమే కాదు.. రాలడం కూడా ఆగుతుంది. దీనికోసం నాలుగు ఉసిరి కాయలు ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు టీస్పూన్ల మెంతులతో వీటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఆపై ఒక గుడ్డును తీసుకొని.. దాన్ని బాగా గిలక్కొట్టి అందులో ఈ మిశ్రమాన్ని కలిపి తలకు దాన్ని అప్లై చేసి.. అరగంట పాటు ఉంచుకొని తలస్నానం చేస్తే సరి. 

ఉల్లిపాయ రసంతో.. 

ఉల్లిపాయ రసం జుట్టు పెరిగేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. కానీ ఇది ఎక్కువ మోతాదులో లభించదు. కాబట్టి ఈ ఉల్లిపాయ రసాన్ని కలబంద గుజ్జు, కొబ్బరి నూనెలతో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత అరగంట పాటు అలాగే ఉంచుకొని తలస్నానం చేసేయవచ్చు. 

సెలూన్ ట్రీట్మెంట్స్..

జుట్టు రాలకుండా ఉండేందుకు సెలూన్ ట్రీట్మెంట్లను కూడా ప్రయత్నించవచ్చు. వీటివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం ఎలాంటివి వాడవచ్చంటే..

1. హెయిర్ స్పా

సాధారణంగా జుట్టు రాలుతోంది అనగానే.. యాంటీ హెయిర్ డౌన్‌ఫాల్ అంటూ వచ్చే షాంపూలు, కండిషనర్లు ఇతర ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. అయితే పార్లర్లో స్పా ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల మన జుట్టుకి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఇది మన మాడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తూ.. జుట్టును కూడా ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఇది జుట్టు ఫాలికల్స్ దగ్గరున్న ఫంగస్‌ని దూరం చేసి కుదుళ్ల నుంచి జుట్టు బలంగా పెరిగేలా చేస్తుంది. మన తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాదు.. ఇది మనల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది కూడా.

ADVERTISEMENT

55

2. లేజర్ ట్రీట్మెంట్

లో లెవల్ లేజర్ ట్రీట్ మెంట్ (ఎల్ ఎల్ టీ) ఇప్పుడు జుట్టు పెరుగుదల కోసం చక్కటి లేజర్ చికిత్సగా పేరు సాధించింది. ఇది కుదుళ్లలోని డ్యామేజ్డ్ కణాలకు చక్కటి ఆరోగ్యాన్ని అందించి.. అవి తిరిగి  మామూలుగా పనిచేసి జుట్టు తిరిగి పెరగడం ప్రారంభమయ్యేలా.. జుట్టు రాలకుండా ఉండేలా చేస్తుంది. 

ఎన్నిరకాలుగా ప్రయత్నించినా మనం సరైన ఆహారం తీసుకోకపోతే అది వ్యర్థమవుతుంది. కొన్నాళ్ల పాటు జుట్టు వూడడం ఆగుతుందేమో.. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం దొరకదు. అందుకే మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండి, పోషకాలన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. శరీరానికి, ముఖ్యంగా జుట్టుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

దీనికోసం పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవడంతో పాటు నీళ్లు కూడా ఎక్కువగా తాగాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు.. కార్బొనేటెడ్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. అలాగే విటమిన్ ఇ, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు వంటివి కూడా ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టే వీలుంటుంది. 

ఇవి కూడా చదవండి. 

ADVERTISEMENT

అవిసె గింజ‌ల‌తో ఆరోగ్య‌మే కాదు.. అంద‌మైన మోము కూడా సొంత‌మ‌వుతుంది..!

మీ అంద‌మైన మెరిసే జుట్టు కోసం.. చ‌క్క‌టి షాంపూ బ్రాండ్లివే..! – Best Shampoos For Different Hair Types In India

స్ట్రెయిటెనింగ్‌, స్మూతెనింగ్‌తో.. జుట్టును స్టైలిష్‌గా మార్చుకుందాం.. (Hair Straightening And Smoothening In Telugu)

19 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT