ADVERTISEMENT
home / Fitness
జుంబా డ్యాన్స్ అందించే ప్రయోజనాలు తెలిస్తే.. ‘జుంబారే జుంజుంబారే’ అనేస్తారు !

జుంబా డ్యాన్స్ అందించే ప్రయోజనాలు తెలిస్తే.. ‘జుంబారే జుంజుంబారే’ అనేస్తారు !

ఇటీవలి కాలంలో జుంబా డ్యాన్స్ (Zumba dance) అంటే క్రేజ్ పెరుగుతోంది. ఎప్పుడూ ఒకే రకం వ్యాయామాలు చేసి బోర్ కొట్టినవారంతా.. ఇప్పుడు జుంబా డ్యాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. శ్రమపడినట్టు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందిస్తుందీ జుంబా డ్యాన్స్. పైగా ఆరోగ్యం మెరుగుపడేలా కూడా చేస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో జుంబా డ్యాన్స్ పై ఆసక్తి  చూపుతున్నవారు క్రమంగా ఎక్కువ అవుతున్నారు. అసలు ఈ జుంబా డ్యాన్స్ ఎందుకు చేస్తారు? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఇలాంటి విషయాలన్నీ మనమూ తెలుసుకొందాం.

1. బరువు తగ్గుతుంది 1-zumba-dance

బరువు తగ్గడానికి జిమ్‌కి వెళ్లి పెద్ద పెద్ద బరువులు ఎత్తి శరీరాన్ని శ్రమ పెట్టాల్సిన అవసరం లేకుండానే.. సరదాగా డ్యాన్స్ చేస్తూనే క్యాలరీలను కరిగించుకోవచ్చు. పైగా జుంబా డ్యాన్స్‌ను గ్రూప్‌తో కలసి చేస్తాం కాబట్టి.. అలసటే తెలియకుండా ఎంతసేపైనా డ్యాన్స్ చేయగలుగుతాం. రోజులో ఒక గంట డ్యాన్స్ చేయడం ద్వారా 500 నుంచి 1000 క్యాలరీల వరకు ఖర్చవుతాయి.

2. ఫుల్ బాడీ వర్కవుట్

ADVERTISEMENT

జుంబా డ్యాన్స్ చేస్తున్నప్పుడు తల నుంచి పాదాల వరకు ప్రతి అవయవం కదులుతుంది. కాళ్లు, చేతులు, భుజాలు, నడుము, పాదాలు, తల, మెడ.. అసలు కదలని భాగం అంటూ ఉండదు. జంపింగ్, స్క్వాటింగ్, స్లైడింగ్.. లాంటివి చేస్తుంటాం కాబట్టి పూర్తి శరీరానికి వ్యాయామం అందుతుంది. పైగా దీనిలో డ్యాన్స్‌తో పాటు ఏరోబిక్స్ కూడా కలిసి ఉంటాయి. దీని వల్ల మీ శరీరం చాలా ఫ్లెక్సిబుల్‌గా తయారవుతుంది. కొన్ని రోజులు జుంబా డ్యాన్స్ కంటిన్యూ చేస్తే మీరు ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయిపోవడం ఖాయం.

3. ఒత్తిడి తగ్గిస్తుంది

3-zumba-dance 

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఒత్తిడి భారం అధికమవుతోంది. జుంబా డ్యాన్స్ చేయడం ద్వారా ఒత్తిడిని సులభంగా అధిగమించవచ్చు. ఎందుకంటే ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. మెదడుకి కూడా ప్రశాంతతను అందిస్తుంది. సంగీతం, డ్యాన్స్ రెండూ మనలోని ఒత్తిడిని తగ్గిస్తాయి. జుంబాలో సంగీతం, డ్యాన్స్ రెండూ ఉంటాయి. కాబట్టి ఒత్తిడి చిటికేసినట్టుగా మాయమవుతుంది. అంటే మానసికంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

ADVERTISEMENT

4.  మెదడు షార్ప్‌గా తయారవుతుంది

వినడానికి విడ్డూరంగాానే ఉన్నా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ట్రైనర్‌ని చూస్తూ స్టెప్పులేయడంతో పాటు వాటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మేధో వికాసాన్ని పెంచుతుందట. ఈ విషయం కొన్ని అధ్యయనాల్లో సైతం రుజువైంది. రోజూ క్రమం తప్పకుండా జుంబా చేసే వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగు పడటంతో పాటు నిర్ణయం తీసుకొనే సామర్థ్యం సైతం మెరుగుపడిందని తేలింది.

5. గుండె ఆరోగ్యాన్ని మెరుగపరుస్తుంది

5-zumba-dance1

ADVERTISEMENT

జుంబా డ్యాన్స్ చేయడం వల్ల బరువు మాత్రమే తగ్గుతామనుకొంటే పొరపాటే. ఎందుకంటే ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుంబా డ్యాన్స్‌లో భాగంగా మీరు చేసే మూవ్స్ కార్డియో ఎక్సర్సైజెస్ మాదిరిగా పనిచేస్తాయి. వీటి వల్ల గుండె కండరాలు ఆరోగ్యంగా తయారవుతాయి.

6. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది 

జుంబా డ్యాన్స్ చేస్తున్నప్పుడు శరీరం మొత్తం కదలుతుంది. ఇలా వేగంగా కదలడం వల్ల బాడీ టోనింగ్ అవడం మాత్రమే కాకుండా.. కండరాలన్నీ దృఢంగా తయారవుతాయి. ముఖ్యంగా పొట్ట కండరాలు, తొడ కండరాలు, చేతి కండరాలు బలంగా తయారవుతాయి.

7. చర్మం అందంగా

ADVERTISEMENT

4-zumba-dance

అసలు జుంబా డ్యాన్స్‌కు, చర్మ సౌందర్యానికి సంబంధమేంటని సందేహం వస్తోంది కదా? కానీ ఇది నిజం. జుంబా డ్యాన్స్ చేయడం వల్ల చెమట అధికంగా పడుతుంది. దీని వల్ల నీరు ఎక్కువగా తాగాల్సిన అవసరం ఏర్పడుతుంది. నీరు తాగడం వల్ల మొటిమలు, ర్యాషెస్ వంటివి రావడానికి కారణమైన టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి మొటిమలు రావు. రోజులో 30 నిమిషాలు జుంబా డ్యాన్స్ చేయడం ద్వారా చర్మంలో వచ్చే మార్పును కచ్చితంగా మీరు గుర్తిస్తారు.

8. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

జుంబా డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి భాగానికి రక్తం సరఫరా అవుతుంది. దీని వల్ల శారరీక ఆరోగ్యంతో పాటు వ్యాధి నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. జుంబా చేయడం ద్వారా అధిక రక్తపోటుతో పాటు ఇతర లైఫ్ స్టయిల్ డిసీజెస్ సైతం తగ్గుముఖం పడతాయి.

ADVERTISEMENT

Images: Shutterstock

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ

కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !

ఇవి కూడా చదవండి:

ADVERTISEMENT

ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి చేయాల్సిన సులభమైన వ్యాయామాలివే..

30 రోజుల పాటు షుగర్‌కి దూరంగా ఉంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

గుండె వ్యాధులను నివారించే.. సులభమైన చిట్కాలు..!

16 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT