ADVERTISEMENT
home / Budget Trips
ఈ వేసవి సెలవుల్లో..  మీరు తెలంగాణలో చూడదగ్గ ఎకో – టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!

ఈ వేసవి సెలవుల్లో.. మీరు తెలంగాణలో చూడదగ్గ ఎకో – టూరిస్ట్ స్పాట్స్ ఇవే..!

వేసవి సెలవులు (Summer Holidays) మొదలై అప్పుడే రెండు వారాలు గడిచిపోయాయి. పిల్లల్ని ఈ వేసవి సెలవుల్లో ఏదైనా విహారయాత్రకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఎక్కడికి వెళితే మంచిది? వెళ్లే ప్రదేశం ఎంత దూరంలో ఉంది? అక్కడి సదుపాయాలేంటి? రవాణా సౌకర్యం ఉందా?  వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు మనలో ఉన్న చాలామంది మెదడ్లని తొలిచేస్తుండచ్చు. వాటికి సమాధానాలను మనం వెతికే ప్రయత్నం చేద్దాం.

ఈ క్రమంలో మనం కూడా ఈ ఎకో – టూరిజంకి (Eco-Tourism), సాధారణ టూరిజంకి ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం.  ఎకో టూరిజం అంటే ప్రకృతితో మమేకమై.. విహారయాత్రలు చేయడం. 

ఈ ఎకో -టూరిజం పట్ల చాలామంది ఆకర్షితులవుతున్న తరుణం ఇది! మన తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఎకో – టూరిజం పై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. ఈ సందర్భంగా.. తెలంగాణలో ఎకో టూరిజంను ప్రమోట్ చేస్తున్న పలు ప్రాంతాల వివరాలు మీకోసం ప్రత్యేకం.

తెలంగాణలో ఎకో టూరిజానికి ఆలవాలమైన ప్రదేశాలు సింహ భాగం జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలోనే ఉన్నాయి.

ADVERTISEMENT

telangana-tourism-1

పాండవుల గుట్ట –  ఈ గుట్టనే పాండవుల గుహలు (Pandavula Caves) అని కూడా అంటారు. వీటిని 1990లో గుర్తించడం జరిగింది.  ఇవి వరంగల్ నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో మరియు రేగొండ మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ Rock Climbing అనేది ప్రధాన ఆకర్షణ. ఎంతో  గొప్ప చిత్రకళా సంపదను కూడా  మనం ఇక్కడ చూడవచ్చు. వారంలో అన్ని రోజులు కూడా ఈ గుట్టను సందర్శించవచ్చు.

ర్యాపెల్లింగ్, హైకింగ్ వంటి అడ్వెంచర్ గేమ్స్ కూడా ఈ ప్రదేశంలో ఆసక్తి ఉన్నవారు చేయవచ్చు. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు పాండవుల గుట్టను టూరిస్టులు సందర్శించవచ్చు. ఈ గుట్ట సందర్శనకు ప్రవేశ రుసుముగా రూ.20 రూపాయలు, పిల్లలకు రూ.10 లను నిర్ణయించింది పర్యాటక శాఖ.

telangana-tourism-2

ADVERTISEMENT

లక్నవరం చెరువు (Laknavaram Lake) –  మన రాష్ట్రంలోనే ఇటువంటి ఒక ప్రదేశం మరొకటి లేదంటే నమ్మశక్యం కాదు. ప్రధానంగా ఇక్కడ చెరువు పైన ఉన్న..L ఆకారంలో ఉండే వంతెన ఈ ప్రాంతం మొత్తానికి ఆకర్షణగా నిలుస్తుంది. అదే సమయంలో ఇక్కడ రాత్రి పూట బస చేయడానికి ప్రత్యేకంగా కాటేజెస్ ఉన్నాయి. అలాగే ఈ చెరువులో షికారు చేయడానికి ఇక్కడ బోటు సౌకర్యం కూడా ఉంది.

ఇక్కడికి చేరుకోవడానికి వరంగల్ నుండి 70 కిలోమీటర్లు కాగా.. హైదరాబాద్ నుండి సుమారు 250 కిలోమీటర్లు ఉంటుంది. వారంలో ప్రతి రోజు ఈ చెరువుని సందర్శించవచ్చు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు.

ఈ చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి సాగునీటిని కూడా సరఫరా చేస్తుంటారు. ఎందుకంటే కాకతీయ రాజులు అప్పటి కాలంలో కర్షకులకు ఆసరా కల్పిస్తూ.. వ్యవసాయానికి నీరందించేందుకు తవ్వించిన చెరువు ఇది.

telangana-tourism-3

ADVERTISEMENT

ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం –  తెలంగాణలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ప్రదేశంగా దీనిని చెప్పుకోవచ్చు. దాదాపు వరంగల్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అభయారణ్యంలో రాత్రి పూట బస చేసేందుకు వీలుగా టూరిజం శాఖ వారు తాడ్వాయి హట్స్ పేరిట గుహలు ఏర్పాట్లు చేశారు. సుమారు 6 గుడిసెలను సకల సదుపాయాలతో రెడీ చేశారు. వీటిని ముందుగానే మనం బుక్ చేసుకోవడానికి తగు ఏర్పాట్లు కూడా టూరిజం శాఖ చేయడం జరిగింది.

ఇక చాలామంది పర్యాటకులు ఉదయం లక్నవరం.. ఆ చుట్టూ పక్కల ప్రాంతాలు సందర్శించి రాత్రికి ఇక్కడ బస చేసేందుకు ఇష్టత చూపుతుంటారు. అవును మరి.. సుమారు 800 కిలోమీటర్ల అభయారణ్యంలో ఒక రాత్రి గడపడమంటే థ్రిల్ అనిపిస్తుంది కదా!

telangana-tourism-4

భోగథ వాటర్ ఫాల్స్ – జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే ఉన్న మరో ఏకో-టూరిస్ట్ స్పాట్ భోగథ వాటర్ ఫాల్స్ (Bhogatha Water Falls). ఈ వాటర్ ఫాల్స్‌ను చూడడానికి మన రాష్ట్ర నలుమూల ప్రాంతాల నుండే  కాకుండా.. పక్క రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఈ జలపాతాలు జిల్లా కేంద్రమైన భూపాలపల్లి నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఏటూరునాగారం నుండి కేవలం 23 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

ADVERTISEMENT

వారంలో అన్ని రోజులు ఇక్కడ పర్యాటకులకు ప్రవేశం ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ జలపాతాలను చూసేందుకు అనుమతినిస్తారు. ఇక్కడ జలపాతాలతో పాటుగా చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్క్ & లైట్ హౌస్ కూడా పర్యాటకులని బాగా ఆకర్షిస్తున్నాయి.

telangana-tourism-5

నెల్లికల్ వ్యూ పాయింట్ –  నాగార్జున సాగర్ డ్యామ్ వద్దనున్న నెల్లికల్ వ్యూ పాయింట్ (Nellikal View Point) కూడా పర్యాటకులని బాగా ఆకర్షిస్తోంది. ప్రధానంగా డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ వ్యూ పాయింట్ ద్వారా నాగార్జున సాగర్ డ్యామ్‌తో పాటు.. ఆ చుట్టుపక్కల ఉన్న అడవులను కూడా చూడవచ్చు.

ఈ వ్యూ పాయింట్ ప్రధాన రహదారి నుండి సుమారు 2.5 కిలోమీటర్ల దూరం మేరకు అడవిలో ఉంటుంది. అక్కడికి కాలి నడకన వెళ్లేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్‌ని కూడా టూరిజం శాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది.

ADVERTISEMENT

telangana-tourism-6

ఆక్టోపస్ వ్యూ పాయింట్ –  నెల్లికల్ వ్యూ పాయింట్ మాదిరిగానే.. శ్రీశైలం డ్యామ్ పైన కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది. దాని పేరే ఆక్టోపస్ వ్యూ పాయింట్ (Octopus View Point). ఈ వ్యూ పాయింట్ నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఉంది. ఇక ఈ వ్యూ పాయింట్‌కి చేరుకోవడానికి హైదరాబాద్ – శ్రీశైలం హైవే వద్ద కనిపించే మన్ననూర్ దగ్గర నుండి 6 కిలోమీటర్ల లోపలికి రావాల్సి ఉంటుంది.

ఇక ఈ వ్యూ పాయింట్ నుండి చూస్తే కృష్ణా నది బ్యాక్ వాటర్స్‌తో పాటుగా.. నది నల్లమల అడవుల్లోకి ప్రవేశించిన మార్గాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఒకరకంగా ఇది చూడడానికి ఆక్టోపస్ ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి.. ఈ వ్యూ పాయింట్‌కి అదే పేరుని పెట్టడం జరిగింది. ఈ వ్యూ పాయింట్‌ని జూన్ నెల నుండి జనవరి నెల మధ్యలో సందర్శిస్తే బాగుంటుంది. ఇక్కడికి దగ్గరలోనే అంటే సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఫర్హాబాద్ వ్యూ పాయింట్‌ను కూడా పర్యాటకులు వీక్షించడానికి అనువైన ప్రదేశంగా చెబుతారు.

telangana-tourism-7

ADVERTISEMENT

అక్కమహాదేవి గుహలు (Akkamahadevi Caves) – ఈ గుహలు కూడా శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్‌కి దగ్గరలోనే ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే శ్రీశైలం డ్యామ్ దగ్గర నుండి బోటులో వెళ్లాల్సిందే. ఇది కూడా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉండే ప్రదేశమే, 12వ శతాబ్దంలో అక్కమహాదేవి ఈ గుహల్లో పరమశివుడిని కొలిచినట్లు చెబుతారు. అందుకు రుజువుగా ఆ గుహల్లో శివుని విగ్రహం మనకి కనిపిస్తుంది.

ఇక ఈ గుహలని సందర్శించినవారు ఎప్పటికి కూడా ఈ అనుభవాన్ని మర్చిపోలేరు. ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ సందర్శించడానికి చేసే బోటు ప్రయాణం.. ఒక్క గొప్ప అనుభవమే.

telangana-tourism-8

మల్లెల తీర్థం జలపాతాలు (Mallela Teertham Water Falls) – ఈ జలపాతాలు కూడా ఈ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే మనం హైదరాబాద్- శ్రీశైలం హైవేలో వచ్చే వత్వార్లపల్లి దగ్గర దిగి అక్కడ నుండి.. సొంత వాహనాల్లో లేదా ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అయితే ఈ జలపాతాలు సందర్శించడానికి అనువైన సమయం – అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు అనే చెప్పాలి. మిగతా సమయంలో ఇక్కడ జలపాతాలలో నీటి ప్రవాహం అంతగా ఉండదు. ఈ ప్రాంతం హైదరాబాద్ నుండి 185 కిలోమీటర్లు ఉండగా.. శ్రీశైలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ADVERTISEMENT

తెలుసుకున్నారుగా.. తెలంగాణ ప్రాంత ఎకో – టూరిజం విశేషాలు. మరింకెందుకు ఆలస్యం.. పైన పేర్కొన్న దానిలో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని.. మీ కుటుంబసభ్యులతో ఈ వేసవిలో ఒక చిన్న పాటి విహారయాత్రకు వెళ్లిరండి.

Images : http://forests.telangana.gov.in/  & www.telanganatourism.gov.in

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో బెస్ట్ ‘హలీమ్’ రుచి చూడాలంటే.. ఈ 10 హోటల్స్‌కి వెళ్లాల్సిందే..!

ADVERTISEMENT

భాగ్యనగరంలో బీజింగ్ కళ చూస్తారా.. అయితే ఈ చైనీస్ రెసార్టెంట్లకు వెళ్లాల్సిందే..!

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు పండగే.. హైటెక్ సిటీ మెట్రో లైన్ వచ్చేసింది..!

26 Apr 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT