ADVERTISEMENT
home / Diet
ఆయుర్వేదం.. మీ బరువునీ సులభంగా తగ్గించేస్తుంది..(Ayurveda For Weight Loss In Telegu)

ఆయుర్వేదం.. మీ బరువునీ సులభంగా తగ్గించేస్తుంది..(Ayurveda For Weight Loss In Telegu)

ఆయుర్వేదం (Ayurveda).. మన శరీరంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా సహజసిద్ధమైన చిట్కాలతో, సహజ ఉత్పత్తుల వైద్యంతో తగ్గించే మంత్రం ఇది. కేవలం ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు మాత్రమే కాదు.. ఆయుర్వేదం ద్వారా మరెన్నో ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అందులో ముఖ్యమైనది బరువు తగ్గడం (Weight loss)..

అవును. బరువు తగ్గడానికి క్రాష్ డైట్లు, కష్టతరమైన వ్యాయామాలు.. ఇలా ఎన్నెన్ని పాటించినా ఫలితం లేనివారికి కూడా ఆయుర్వేదం సులువుగా ఆ సమస్యను తీరుస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటించడంతో పాటు జీవన శైలిలోనూ మార్పులు – చేర్పులు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ బరువు చాలా వేగంగా తగ్గుతుంది. ఆయుర్వేదం ద్వారా బరువు తగ్గించుకునేందుకు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకుందాం రండి..

ఈ కథనంలోని ముఖ్యాంశాలు

దోషాలను బట్టి ఆహార నియమాలు
బరువు తగ్గడానికి జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు
బరువు తగ్గేందుకు తీసుకోవాల్సిన పదార్థాలు
తరచూ వచ్చే సందేహాలకు సమాధానాలు

ADVERTISEMENT

Shutterstock

ఏయే దోషాల వారు ఏ ఆహారం తీసుకోవాలంటే..

ఆయుర్వేదం ద్వారా బరువు తగ్గించుకోవడం సులభమే. కానీ దానికి తగిన ఆహార నియమాలు పాటించడం కూడా ఎంతో అవసరం. ఈ నియమాలు సైతం అందరికీ ఒకేలా ఉండవు. మన శరీరంలోని దోషాల ఆధారంగానే ఆహారమూ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ దోషం ఉన్నవారు ఏయే ఆహారపదార్థాలు తీసుకోవాలంటే..

వాత దోషం : వాత దోషం ఉన్నవారు చలిని తట్టుకోలేరు. చంచలస్వభావులు. ఆత్మీయత, అనురాగం వీరికి తెలియవు. వెంట్రుకలు కొబ్బరిపీచులా ఉంటాయి. ఈ దోషం ఉన్నవారు క్వినోవా, బియ్యంతో వండిన పదార్థాలు, ఉడికించిన కూరగాయలు, ఎర్ర పప్పు, బీఫ్, గుడ్లు, చేపలు, మిరియాల పొడి, కొత్తిమీర, పల్లీలు, అవిసె గింజలు, నువ్వుల నూనె, నెయ్యి వంటివి తీసుకోవచ్చు. యాపిల్స్, చెర్రీల వంటివి ఉడికించి మాత్రమే తినాలి. డ్రైఫ్రూట్స్, యాపిల్, పుచ్చకాయ, పచ్చివి లేదా ఫ్రిజ్ లో పెట్టిన కూరగాయలు, బంగాళాదుంపలు, బార్లీ, శెనగలు, పెరుగు, మొక్కజొన్న, మటన్, చికెన్, చాక్లెట్.. వంటి వాటికి దూరంగా ఉండాలి.

పిత్త దోషం : ఈ దోషం ఉన్నవారికి దాహం, ఆకలి ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. కళ్లు ఎర్రగా ఉంటాయి. తరచూ నోటిపూత వస్తుంటుంది. జ్ఞాపకశక్తి ఎక్కువ. గొప్పలు చెప్పుకునే స్వభావం కూడా ఎక్కువే. ఈ దోషం ఉన్నవారు డ్రైఫ్రూట్స్, పుచ్చకాయ, కాలీఫ్లవర్, బ్రొకొలీ, పాస్తా, ఉలవలు, వెన్న, చికెన్, గుడ్లు, బాదం పప్పు, కొబ్బరి వంటివి తీసుకోవచ్చు. వీరు కారం, చేపలు, పులిసిన బ్రెడ్, అవకాడో, ఆప్రికాట్స్, ఉల్లిపాయలు, పాలకూర, సోయా సాస్, బీఫ్, చాక్లెట్.. వంటి వాటికి దూరంగా ఉండాలి.

ADVERTISEMENT

కఫ దోషం : కఫ దోషం ఉన్నవారు సౌమ్యులు.. వీరిని అంచనా వేయడం కష్టం. వీరికి ఆకలి మామూలుగా ఉంటుంది. కానీ నిగ్రహం ఉంటుంది కాబట్టి ఉపవాసాలు చేయగలరు. బుద్ధిమంతులు, నిజాయతీపరులు. కష్టాలను ఓర్చుకునే శక్తి కలిగి ఉంటారు. ఈ దోషం ఉన్నవారు యాపిల్స్, క్యారట్లు, బీన్స్, మజ్జిగ, చీజ్, రొయ్యలు, చికెన్ వంటివి తినాలి. దబ్బ పండ్లు, మేడి పండ్లు, కీరదోస, ఓట్స్, గోధుమలు, టోఫూ, చేపలు, కెచప్, చాక్లెట్.. వంటివి తినకూడదు.

బరువు తగ్గడానికి జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు

బరువు తగ్గడానికి ఆయుర్వేద ఉత్పత్తులు ఉపయోగించడం ఎంత అవసరమో.. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అంతకంటే ఎక్కువ ముఖ్యం. బరువు తగ్గేందుకు ఆయుర్వేదం ప్రకారం ఎలాంటి జీవనశైలిని పాటించాలంటే..

Shutterstock

ADVERTISEMENT

మూడుసార్లు భోజనం చేయండి..

ఆయుర్వేదం ప్రకారం భోజనం అనేది కేవలం మన శరీరానికి శక్తిని అందించేందుకు మాత్రమే.. కాబట్టి మన శరీరానికి అప్పుడప్పుడు మాత్రమే దాన్ని అందించాలి. ముందు అందించిన ఇంధనం అరగకముందే మళ్లీ తినడం వల్ల మన శరీరం దాన్ని కరిగించడం మానేస్తుంది. అందుకే తక్కువ మోతాదులో బ్రేక్ ఫాస్ట్ ని ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్యలో చేయండి.

తర్వాత లంచ్ పదకొండు నుంచి రెండు గంటల లోపు తీసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన పదార్థాలన్నీ తీసుకోవచ్చు. రాత్రి భోజనం ఈ రెండింటి కంటే తక్కువగా ఉండాలి. సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిది లోపు డిన్నర్ చేసేయడం మంచిది. ఈ సమయంలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో భోజనం చేయడం మంచిది.

సహజమైనవే తినండి.

మనకు అవసరమైనవన్నింటినీ ప్రక్రుతి ఎప్పటినుంచో అందిస్తోంది.. కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. సీజన్ ప్రకారం లభ్యమయ్యే పండ్లు ఇతరత్రావన్నీ మన బరువును కూడా కంట్రోల్లో ఉంచుతాయి. బియ్యం, గోధుమలు, పండ్లు, కూరగాయలు.. వంటివన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి.

ADVERTISEMENT

Shutterstock

సూర్యుడితో పాటే నిద్ర, మెలకువ

సూర్య రశ్మి మన శరీరంలో జీవ గడియారాన్ని సమన్వయం చేస్తుంది. దీని ప్రకారం పాటిస్తే హార్మోన్ల స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. మన పూర్వీకులు సూర్యాస్తమయం తర్వాత పెద్దగా పనిచేసేవారు కాదు. పగలంతా ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్లు సూర్యాస్తమయం అయిన తర్వాత మంట చుట్టూ కూర్చొని మాట్లాడుకునేవాళ్లు. భోజనం చేసి అందరితో మాట్లాడి పడుకునేవారు.

ఇప్పుడు స్క్రీన్స్ ఎక్కువగా చూడడం వల్ల మన మెదడు రాత్రుళ్లు కూడా మెలకువగా ఉండేలా చేస్తూ మన జీవ గడియారాన్ని పాడుచేస్తున్నాయి. అందుకే పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు ఫోన్, లాప్ టాప్, టీవీ చూడడం మానేయాలి. పది గంటలకు ముందే నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవడం వల్ల మరుసటి రోజు కోసం శరీరం సిద్ధమవుతుంది. మంచి నిద్ర ఉంటే శరీరంలో ఒత్తిడి పెంచి బరువు పెంచే కార్టిసాల్ హార్మోన్ కూడా తక్కువగా విడుదలవుతుంది.

వారానికోసారి ఉపవాసం చేయండి.

బరువు అదుపులో ఉంచుకోవడం కోసం వారానికోసారైనా మన జీర్ణ వ్యవస్థకు కాస్త విశ్రాంతిని అందించాలి. దీని కోసం వారానికోసారి వీలైతే రోజు మొత్తం నీళ్లు, మజ్జిగ వంటివి తప్ప ఏమీ తీసుకోకుండా లంఖణం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ఒక్క పూట భోజనం మానేసి మిగిలిన రెండు పూటలు తేలిగ్గా అరిగే పండ్లలాంటివి తీసుకొని ఉపవాసం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి బరువు తగ్గే వీలుంటుంది.

ADVERTISEMENT

Shutterstock

నీళ్లు ఎక్కువగా తాగండి

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల పొట్ట నిండుగా ఉండి బరువు తగ్గే వీలుంటుంది. కానీ దీన్ని ఆహారంతో పాటు లేదా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవడం వల్ల కడుపులోని యాసిడ్లు డైల్యూట్ అవుతాయి. ఇది జీర్ణ ప్రక్రియ మరింత నెమ్మదిగా  అయ్యేలా చేసి, మనల్ని లావుగా మారుస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల అది టాక్సిన్లుగా మారుతుంది. అలా అరగకపోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత వంటి సమస్యలు ఎదురవుతాయి. అలా కాకుండా రోజంతా కాస్త వేడి నీళ్లు తాగడం వల్ల శరీరం డీటాక్సిఫై అవుతుంది.

ఆరు రుచులు అవసరమే..

ఆయుర్వేదంలో ఆరు రుచులు ఎంతో ముఖ్యమైనవి. తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారం ఇవన్నీ మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ప్రక్రుతి లో భాగమైన ఈ ఆరు రుచులు మన శరీరం సరైన రీతిలో ఉండేందుకు తోడ్పడతాయి. తీపి, పులుపు, ఉప్పు మన శరీర నిర్మాణంలో భాగమైతే.. కారం, వగరు, చేదు రుచులు కొవ్వును కరిగించే గుణాలను కలిగి ఉంటాయి. బరువు తగ్గడానికి ఎక్కువగా తీపి, పులుపు, ఉప్పు వంటివి తోడ్పడతాయి. అయితే మిగిలిన ఆహార పదార్థాలతో దాన్ని బ్యాలన్స్ చేయడం వల్ల బరువు పెరగకుండా ఉండొచ్చు.

ADVERTISEMENT

Shutterstock

సీజనల్ పండ్లు కూరగాయలు తీసుకోండి.

వేసవిలో చల్లచల్లగా ఉంచేందుకు ప్రక్రుతి మనకు పుచ్చ, తర్బూజా, మామిడి, ముంజలు.. వంటివి అందించడంతో పాటు కూరగాయలను కూడా అందిస్తూ శరీరం చల్లగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. ఇక చలికాలంలో దుంపలు, నట్స్, ఇతర పండ్లు, మాంసాహారం వంటివన్నీ మనల్ని వేడి నుంచి కాపాడతాయి. చలికాలంలో మనం తీసుకున్న ఎసిడిక్ డైట్ నుంచి జీర్ణ వ్యవస్థను శుభ్రం చేయడానికి వసంత కాలంలో బెర్రీలను మనకు అందిస్తుంది. ఇలా ప్రతి సీజన్ లోనూ ఆయా సీజన్ కి సంబంధించిన, ఆయా సమయాల్లో అవసరమైన పోషకాలను ప్రక్రుతి మనకు అందిస్తుంది.

ADVERTISEMENT

భోజనం తర్వాత నడవండి..

ఆయుర్వేదం కేవలం ఆహారం విషయంలో మాత్రమే జాగ్రత్త వహించదు. భోజనం తర్వాత కనీసం వంద నుంచి రెండు వందల అడుగులు వేయాలని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే ప్రతి భోజనం తర్వాత ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం పది నుంచి ఇరవై నిమిషాల పాటు నడవడం వల్ల ఆహారం త్వరగా అరిగే వీలుంటుంది. వీలుంటే పడుకునేటప్పుడు కూడా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

భోజనం తర్వాత నడుస్తున్నాం కదా అని వ్యాయామాన్ని తక్కువ చేయకూడదు. రోజూ ఉదయం కనీసం 30 నుంచి 60 నిమిషాలు యోగా, నడక, పరుగు, సైక్లింగ్, జాగింగ్, బరువులు ఎత్తడం వంటివి చేయడంతో పాటు ఐదు నుంచి పది నిమషాల పాటు తప్పనిసరిగా ధ్యానం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గడం చాలా సులభం.

బరువు తగ్గేందుకు తీసుకోవాల్సిన పదార్థాలు

బరువు తగ్గడం కోసం ఆయుర్వేదం కొన్ని నియమాలను చెప్పింది. అయితే ఆ నియమాలను రోజూ పాటించడంతో పాటు మన శరీరంలోని కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడే కొన్ని పదార్థాలు కూడా తీసుకోవడం వల్ల కొవ్వు వేగంగా కరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆహార పదార్థాలు వ్యాయామం లేదా డైట్ కి ప్రత్యామ్నాయం మాత్రం కాదు. వీటిని తీసుకుంటూ ా ఆరోగ్యకరమైన డైట్ పాటించడం, రోజూ వ్యాయామం లాంటి పైన చెప్పిన నియమాలన్నింటినీ కూడా పాటించడం వల్ల మాత్రమే బరువు తగ్గే వీలుంటుంది. వీటిని రోజూ కనీసం 45 రోజుల నుంచి రెండు మూడు నెలల వరకూ తీసుకొని చూడండి. మార్పు తప్పక కనిపిస్తుంది. 

ADVERTISEMENT

Shutterstock

మెంతులు

మెంతులు ప్రతి వంటింట్లోనూ ఉండే మందు. బరువు తగ్గేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కొవ్వును బాగా తగ్గిస్తుంది. దీని కోసం స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో వేసి రుబ్బి మరిన్ని నీళ్లు కలిపి ఉదయాన్నే పరిగడుపున తీసుకోవచ్చు. దీంతో పాటు వేయించిన మెంతులను సలాడ్స్ తో పాటు తీసుకోవచ్చు.

మిరియాల పొడి

కారం బరువు తగ్గించడంలో బాగా తోడ్పడుతుంది. అయితే మిరపకాయల కారం వల్ల కడుపులో మంట, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. మిరియాల కారం వల్ల ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. అందుకే రోజూ చిటికెడు మిరియాల పొడి, నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.

ADVERTISEMENT

Shutterstock

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మన శరీర జీవక్రియల వేగాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరిగించేందుకు కూడా ఇది చాలా మంచి మందు. ఇందులోని సిన్నమాల్డిహైడ్ విసరల్ ఫ్యాట్ టిష్యూని తగ్గిస్తుంది. అంటే పొట్ట దగ్గరున్న కొవ్వును పూర్తిగా తగ్గిస్తుందన్నమాట. కప్పు వేడినీటిలో స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి టీ పెట్టుకొని ఉదయాన్నే తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

క్యాబేజీ

బరువు తగ్గేందుకు ఉపయోగపడే ఆయుర్వేద పదార్థాల్లో క్యాబేజీ కూడా ముఖ్యమైనది. శరీరంలో కొవ్వు కరిగించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. సాయంత్రం తీసుకునే అనారోగ్యకరమైన స్నాక్స్ బదులు క్యాబేజీ సలాడ్ ని తీసుకోవడం మంచిది. దీన్ని ఉడికించి తీసుకోవడం కంటే పచ్చిది తీసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది. రోజూ క్యాబేజీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.

ADVERTISEMENT

Shutterstock

అల్లం

అల్లం బరువు తగ్గించేందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే కాదు.. సైనస్, ఫ్యాటీ లివర్, గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ముక్క అల్లం తీసుకొని పేస్ట్ చేసుకొని అందులో నిమ్మరసం పిండి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి సగం అయ్యేవరకూ మరిగించాలి. ఇప్పుడు ఈ రెండు గ్లాసుల నీటిని రోజు మొత్తంలో మూడుసార్లుగా తీసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితాలుంటాయి.

ఉలవలు

రోజూ ఉడికించిన ఉలవలను తినడం వల్ల కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది. ఈ ప్రక్రియను కనీసం 45 రోజులు పాటించి చూడడం వల్ల ఫలితాన్ని సులువుగా గుర్తించే వీలుంటుంది. ఇది ఆయుర్వేదంలోనే ఉత్తమమైన పద్ధతి. దీని కోసం మీరు చేయాల్సింది కూడా పెద్దగా ఏమీ ఉండదు. రాత్రి కప్పు ఉలవలను తీసుకొని వాటిని నానబెట్టి ఉదయాన్నే వాటిని ఉడికించి తీసుకోవాలి. కావాలంటే వాటిలో ఉప్పు, ఉల్లిపాయలు, టొమాటోలు వేసుకోవచ్చు. ఆపై ఓ గ్లాసు మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

ADVERTISEMENT

Shutterstock

కలబందతో డ్రింక్

కలబంద కూడా బరువు తగ్గేందుకు ఎంతో తోడ్పడుతుంది. దీని కోసం రెండు టేబుల్ స్పూన్ల కలబంద రసం, చిటికెడు పసుపు, చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు కరక్కాయ పొడి, తిప్పతీగ పొడి చిటికెడు వేసి కలిపి అందులో గ్లాసు వేడినీటిని కలిపి ఆ డ్రింక్‌ని రోజూ తాగాలి. కావాలంటే టీస్పూన్ తేనె వేసుకోవచ్చు. దీన్ని ఉదయాన్నే పరిగడుపున తాగి మరో గంట పాటు ఏమీ తినకుండా తాగకుండా ఉండాలి. దీన్ని అనుకున్న బరువుకి చేరుకునే వరకూ రోజూ తాగడం మంచిది.

గుగ్గుల్

గుగ్గుల్ గా పిలిచే ఈ పదార్థం చాలా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే గుగ్గుల్ స్టెరాన్ అనే కెమికల్ బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. శరీర జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అంతేకాదు.. ఇది కొలెస్ట్రాల్‌ని కూడా తగ్గించేందుకు తోడ్పడుతుంది. గుగ్గుల్ టీ ఇందుకు చాలా తోడ్పడుతుంది. ఇందుకు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో గుగ్గుల్ మిశ్రమం (ఆయుర్వేద మందుల దుకాణాల్లో లభిస్తుంది) వేసి కాసేపు మరిగించి ఆ నీటిని తాగాలి.

ADVERTISEMENT

Shutterstock

త్రిఫల

త్రిఫల చూర్ణం ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే చూర్ణం. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలను ఎండబెట్టి పొడిచేసి వాటిని సమానపాళ్లలో కలిపిన చూర్ణం ఇది. ఇది మన శరీరాన్ని డీటాక్సిఫై చేసేందుకు బాగా తోడ్పడుతుంది. తద్వారా బరువు కూడా తగ్గే వీలుంటుంది. ప్రతి రోజూ దీనిని తీసుకోవడం వల్ల పోషకాలు అందడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. దీని కోసం రోజూ ఒక గ్లాస్ వేడినీటిలో టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి. ఇలా కనీసం రెండు నుంచి మూడు నెలలు పాటించాలి.

పునర్ణవ

పునర్ణవ బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని డైయూరిటిక్ గుణాలు కిడ్నీ, యూరినరీ సమస్యలను తగ్గించేందుకు తోడ్పడతాయి. దీన్ని ఉపయోగించడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ బయటకు పోకుండా కేవలం టాక్సిన్లు మాత్రమే బయటకు వెళ్లిపోతాయి. కాళ్లు వాపు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు ఇది బరువు కూడా తగ్గిస్తుంది. దీని కోసం ఉదయాన్నే పునర్ణవ చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని రోజూ తాగడం వల్ల బరువు తగ్గే వీలుంటుంది.

వీటితో పాటు నిమ్మరసం, వెల్లుల్లి, లవంగాలు, కలోంజీ, వాము, కరివేపాకు, విజయ్సార్.. వంటివి కూడా ఉపయోగించడం వల్ల బరువు వేగంగా తగ్గే వీలుంటుంది.

ADVERTISEMENT

తరచూ ఎదురయ్యే సందేహాలకు సమాధానాలివే..

Shutterstock

1. ఆయుర్వేదిక్ మసాజ్ బరువు తగ్గడంలో తోడ్పడుతుందా?

ఆయుర్వేదిక్ మసాజ్ లేదా అభ్యంగం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అందులో ఒకటి మన శరీరంలోని విషపదార్థాలను తొలగించి శరీర బరువు తగ్గించడం. మసాజ్ మంచి ఫ్యాట్ బర్నర్ గా పనిచేయడంతో పాటు మన శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. కాబట్టి ఇది బరువు తగ్గేందుకే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి పద్ధతి. కేవలం ఇదొక్కటే కాదు.. నరాలకు స్వాంతన కలిగించి మంచి నిద్రను అందించడం, చర్మాన్ని మ్రుదువుగా మార్చి ముడతలను తగ్గించడం, రక్త ప్రసరణ శరీర సక్రమంగా జరిగేలా చేయడం ద్వారా అవయవాల ఆరోగ్యాన్ని కాపాడడం వంటి ప్రయోజనాలు కూడా దీని వల్ల అందుతాయి.

2. ఆయుర్వేదం ద్వారా బరువు వేగంగా తగ్గే వీలుంటుందా?

సహజ పద్ధతుల ద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఆయుర్వేదం మనకు అందిస్తుంది. అయితే ఆయుర్వేద పద్ధతుల్లో వేగంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. జీవన శైలిలో మార్పులతో మన శరీరంలో ఉన్న సమస్యలన్నింటినీ తొలగిస్తుంది కాబట్టి ఆయుర్వేదం ద్వారా కాస్త నెమ్మదిగా అయినా బరువు తగ్గడం మంచిది. దీని ద్వారా నెలకు రెండు నుంచి ఐదు కేజీల వరకూ బరువు తగ్గే వీలుంటుంది.

ADVERTISEMENT

Shutterstock

3. ఆయుర్వేదిక్ డీటాక్స్ డైట్ అంటే ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది?

ఆయుర్వేద డీటాక్స్ డైట్ అంటే మన శరీరానికి హాని కలిగించే పదార్థాల నుంచి కొంతకాలం దూరమై శరీరాన్ని సరైన దిశగా తీసుకెళ్లడం అన్నమాట. సాధారణంగా 45 రోజులు ఉండే ఈ డీటాక్స్ డైట్ కి ముందు పదిహేను రోజుల ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ఈ రోజుల్లో రాత్రి లేదా ఉదయం మిగిలినవి, ప్రాసెస్ చేసినవి, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటివన్నీ మానేయాలి. ఆర్గానిక్ ఆహారం మాత్రమే తీసుకోవాలి. అందులోనూ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

కెమికల్స్, పురుగు మందులు, క్రుత్రిమ ఎరువులు వేసి పండించినవి తినకూడదు. డైరీ ఉత్పత్తుల్లో ఛీజ్, పెరుగు వంటివి, డీప్ ఫ్రై చేసినవి, పచ్చి ఆహారపదార్థాలు, స్వీట్స్ , ఇంకా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారపదార్థాలన్నింటికీ దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, అల్లం, పసుపు, ధనియాలు, సోంపు, మెంతులు వంటివి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య తగ్గి జీర్ణ క్రియ వేగం పెరిగి బరువు త్వరగా తగ్గే వీలుంటుంది.

ADVERTISEMENT

4. ఆయుర్వేద మందులు మార్కెట్లో చాలా లభిస్తున్నాయి. వీటిని బరువు తగ్గడానికి ఉపయోగించవచ్చా?

ఆయుర్వేద మందులు మార్కెట్లో చాలా లభ్యమవుతున్నాయి. కానీ వాటిని సంబంధిత ఆయుర్వేద వైద్యుడు సూచిస్తేనే వేసుకోవడం మంచిది. ఆయుర్వేదంలో అందరికీ ఒకే రకమైన మందు ఉండదు. శరీరతత్వాన్ని బట్టి మందులు పనిచేస్తాయి కాబట్టి వైద్యుల సలహా తీసుకొని వాడడం మంచిది. అది కూడా బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారే ఉపయోగించాలి. అంతకంటే తక్కువ బరువున్నవారు ఇంట్లో తయారుచేసుకోగలిగే పదార్థాలతో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

 ఇవి కూడా చదవండి.

ADVERTISEMENT

బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండి

బరువు సులభంగా తగ్గాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!

పొట్ట దగ్గర కొవ్వు మటుమాయం కావాలా?? అయితే ఈ ఆహారం తినాల్సిందే..!

18 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT