ADVERTISEMENT
home / ఫ్యాషన్
ఫ్యాష‌న్స్‌లో కూడా “హ‌నీ ఈజ్ ది బెస్ట్” అనిపిస్తోన్న మెహ‌రీన్..!

ఫ్యాష‌న్స్‌లో కూడా “హ‌నీ ఈజ్ ది బెస్ట్” అనిపిస్తోన్న మెహ‌రీన్..!

తెలుగులో “కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ‌”తో మ‌హాల‌క్ష్మిగా త‌న కెరీర్‌ను ప్రారంభించింది మెహ‌రీన్ (Mehreen pirzadaa). ఆ త‌ర్వాత ఆమె న‌టించిన మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్, జ‌వాన్, పంతం, నోటా.. ఇలా దేనిక‌దే ప్ర‌త్యేకంగా నిలిచాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఎఫ్‌-2 అయితే ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఎక్క‌డ క‌నిపించినా హ‌నీ ఈజ్ ద బెస్ట్.. అంటున్నారంటే ఆ సినిమాలో ఆమె పాత్ర ఎంత‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాలా?

అయితే ఈ చిన్న‌ది కేవ‌లం తన కెరీర్‌లోనే కాదు.. ధ‌రించే ఫ్యాష‌న్స్ విష‌యంలోనూ బెస్ట్ అనే అనిపించుకుంటోంది. రెగ్యుల‌ర్ ఫ్యాష‌న్స్‌నే ఎక్కువ‌గా ఎంచుకునే ఈ భామ వాటికి త‌న‌దైన శైలిలో చిన్న చిన్న మార్పులు- చేర్పులు చేసి ధ‌రిస్తూ ఉంటుంది. ఇక‌, త‌న శ‌రీరాకృతికి త‌గ‌ని ఫ్యాష‌న్స్‌ను మాత్రం మెహ‌రీన్ అస్స‌లు ఎంపిక చేసుకోదు. ఆమె స్టైల్ ఫైల్ పై ఓ లుక్కేస్తే ఈ విష‌యం ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మైపోతుంది. మ‌రి, హ‌నీ ఫాలో అయ్యే ఫ్యాష‌న్స్ ఎలా ఉంటాయో మ‌న‌మూ ఓసారి చూసేద్దాం రండి..

కాలేజీకి వెళ్లే అమ్మాయిల్లో చాలామంది త‌మ డ్ర‌స్సింగ్ చాలా సింపుల్‌గా ఉన్న‌ప్ప‌టికీ న‌లుగురిలోనూ తామే సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిల‌వాల‌ని ఆరాట‌ప‌డుతూ ఉంటారు. మీరూ అంతేనా?? అయితే మెహ‌రీన్ ధ‌రించిన ఈ అవుట్ ఫిట్‌ని ఫాలో అయిపోతే స‌రి..! ఎరుపు రంగు ప్లెయిన్ క‌ల‌ర్ డ్ర‌స్‌కు స‌న్న‌ని బ్లాక్ క‌ల‌ర్ బెల్ట్ జ‌త చేసి ఎంత ఫ్యాషన‌బుల్‌గా మెరిసిపోతోందో చూడండి..

వ‌చ్చేది స‌మ్మ‌ర్.. అంటే బోలెడ‌న్ని సెల‌వులు.. మ‌రి, ఏదో ఒక ప్ర‌దేశానికి టూర్‌కి చెక్కేయ‌క‌పోతే మ‌న‌సు ఊరుకుంటుందా చెప్పండి?? అందుకే స‌మ్మ‌ర్ ఫ్రెండ్లీ‌గా ఉండే అవుట్ ఫిట్స్ కోసం అన్వేషిస్తూ ఉంటారంతా..! మీరూ అదే ప‌నిలో ఉన్నారా? అయితే మెహ‌రీన్ ధ‌రించిన ఈ అవుట్ ఫిట్ స‌మ్మ‌ర్ వెకేష‌న్‌కి మంచి ఎంపిక. ఇటు సౌక‌ర్య‌వంతంగా ఉంటూనే మ‌న‌ల్ని స్టైలిష్‌గా మెరిపించే ఈ అవుట్ ఫిట్‌ను మిక్స్ అండ్ మ్యాచ్ త‌ర‌హాలో ర‌క‌ర‌కాలుగా మ‌నం ధ‌రించ‌వ‌చ్చు.

ADVERTISEMENT

స్పెష‌ల్ అకేష‌న్ అన‌గానే అమ్మాయిలంతా ముందుగా చూసేది శారీవైపే! అందుకే వాటిలోనూ న‌యా ట్రెండ్స్ వ‌స్తూనే ఉన్నాయి. అలాంటి ట్రెండ్స్‌లో ర‌ఫెల్డ్ శారీ కూడా ఒక‌టి. మ‌న హ‌నీ కూడా శారీని భిన్నంగా క‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శారీకి జ‌త‌గా ఆమె ఎంపిక చేసుకునే బ్లౌజ్ ద్వారా భిన్న‌మైన లుక్‌లో క‌నిపించేందుకు ట్రై చేస్తుంది. అందుకే ఈ స‌మ్మ‌ర్ పింక్ క‌ల‌ర్ ర‌ఫెల్డ్ శారీకి కూడా డిఫ‌రెంట్ స్టైల్ బ్లౌజ్‌ని జ‌త చేసింది.

ప్ర‌కాశ‌వంతంగా ఉండే క‌ల‌ర్స్‌తో పాటు, నియాన్ షేడ్స్ ధ‌రించాలంటే కాస్త ధైర్యం ఎక్కువ‌గానే ఉండాలి. ఎందుకంటే అవి అంద‌రికీ అంత‌గా న‌ప్ప‌వు. ఒక‌వేళ న‌ప్పినా వాటిని ధ‌రించే క్ర‌మంలో ఏమాత్రం అజాగ్ర‌త్త వ‌హించినా లుక్ మొత్తం ఎబ్బెట్టుగా మారి ఇబ్బంది పెట్ట‌క త‌ప్ప‌దు. కానీ మెహ‌రీన్‌ను చూస్తే ఎలాంటి క‌ల‌ర్ అయినా ధ‌రించ‌డం చాలా సుల‌భం అనిపిస్తుంది. మ‌ల్టీ క‌ల‌ర్ టాప్‌కు, ప్లెయిన్ లెమ‌న్ ఎల్లో బాట‌మ్ జత చేసి దానికి రెడ్ క‌ల‌ర్ స్కార్ఫ్‌తో అదిరిపోయే ట‌చ్ ఇచ్చి త‌నెంత ప్ర‌త్యేక‌మో చెప్పింది చూడండి.

పార్టీలు, ఫంక్ష‌న్స్.. ఇలా ప్ర‌త్యేక సంద‌ర్భాలు వ‌చ్చిన‌ప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలంతా ప‌టాకాలా మెరిసిపోవాల‌ని అనుకుంటున్నారు. మీరూ అంతేనా?? అయితే ఇటు ట్రెడిష‌న‌ల్‌గా ఉంటూనే.. అటు ట్రెండీ లుక్‌లో మ‌న‌ల్ని మెరిపించే ఈ అవుట్ ఫిట్ చూడండి. ఈ ఫొటో చూస్తుంటే నిజంగా.. హ‌నీ ఈజ్ ద బెస్ట్ అనాల‌నిపిస్తుంది క‌దూ!

అఫీషియ‌ల్ డ్ర‌స్సింగ్‌లో అందంగా మెరిసిపోవాలంటే అది అన్ని అవుట్ ఫిట్స్‌తోనూ సాధ్యం కాద‌నే చెప్పాలి. సౌక‌ర్య‌వంతంగా క‌నిపిస్తూనే మ‌న‌ల్ని స్టైలిష్‌గా క‌నిపించేలా చేసే అలాంటి అతికొద్ది ఫ్యాష‌న్స్‌లో పెప్ల‌మ్ కూడా ఒక‌టి. మ‌రి, ఈ పెప్ల‌మ్‌కు ర‌ఫెల్స్ ట్రెండ్ కూడా జ‌త చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇదుగో.. మ‌న హ‌నీ ధ‌రించిన అవుట్ ఫిట్ లానే ఉంటుంది.

ADVERTISEMENT

ఈ రోజుల్లో చీర స్థానంలో రెడీమేడ్ శారీస్ చాలానే వ‌చ్చాయి. వాటిలో శారీ గౌన్ కూడా ఒక‌టి. ఇది చూడ‌డానికి చీర‌లానే ఉన్నా.. ధ‌రించ‌డం మాత్రం చాలా సుల‌భం. అదీకాకుండా దీని ద్వారా వ‌చ్చే లుక్ మిగ‌తా ఏ అవుట్ ఫిట్ ధ‌రించినా రావ‌డం క‌ష్ట‌మే. అందుకే మెహ‌రీన్ కూడా ఎరుపు రంగు శారీ గౌన్‌తో అందంగా మెరిసిపోయింది.

కేప్ ఫ్యాష‌న్ అనుస‌రించ‌డంలోనూ ఒక్కొక్క‌రిదీ ఒక్కో శైలి. కొంద‌రు చీర‌కు ధ‌రించే బ్లౌజ్ పై కేప్‌ని జ‌త చేస్తే ఇంకొంద‌రు వెస్ట్ర‌న్ అవుట్ ఫిట్ పై ధ‌రిస్తారు. కానీ మ‌న హ‌నీని చూస్తే ఇండియ‌న్ వేర్ పై కూడా కేప్ ద్వారా భిన్న‌మైన లుక్ పొందేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చ‌ని అర్థ‌మ‌వుతోంది క‌దూ! అయితే మీరిలా కేప్‌తో భిన్న‌మైన లుక్ కోసం ప్ర‌య‌త్నం చేసే ముందు.. ఆ శైలి మీకు న‌ప్పుతుందో లేదో అని తెలుసుకునేందుకు మీ వ్య‌క్తిగ‌త డిజైన‌ర్ స‌హాయం తీసుకుంటే మంచిది.

ఇవి కూడా చ‌ద‌వండి

క‌ళ్లు చెదిరే అంద‌మే కాదు.. చ‌క్క‌ని ఫ్యాష‌న్ సెన్స్ కూడా పాయ‌ల్ సొంతం..!

ADVERTISEMENT

శ్రీ‌ముఖి ఫ్యాష‌న్స్.. భిన్న‌మే కాదు.. భ‌లే అందంగా కూడా ఉంటాయి..!

అందాల అన‌సూయ ఫ్యాష‌న్స్‌తో.. స‌మ్మ‌ర్‌లోనూ కూల్ లుక్స్‌తో మెరిసిపోవ‌చ్చు..!

25 Mar 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT