మీ రాశిఫలాలు వీక్షించండి.. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి..!

మీ రాశిఫలాలు వీక్షించండి.. వివేకంతో నిర్ణయాలు తీసుకోండి..!

ఈ రోజు (మే 13) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..


 


మేషం (Aries) – ఈ రోజు కొత్త వారిని ఉద్యోగంలోకి తీసుకోవాలన్నా లేక మీ టీంలో కొత్త సభ్యులను చేర్చుకోవాలన్నా అందుకు చాలా కీలకమైన కారణం ఉండాల్సిందే. ఏ విషయంలోనూ తొందరపడకండి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా మీ భాగస్వామితో  ఘర్షణ పడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి.


వృషభం (Tarus) –  మీ క్రియేటివిటీ లోపించిన కారణంగానో లేదా సంస్థాగత మార్పుల వల్లనో పనిలో జాప్యం జరగవచ్చు. ఈ సమయంలో సమస్యల పరిష్కారానికి కొత్త ఆలోచనలతో ముందుకు రావాల్సి ఉంటుంది. ఇక మీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీ కుటుంబ సభ్యులు కూడా మీరు వారితో సమయం గడపాలని భావిస్తారు. వారిని అశ్రద్ధ చేయకండి.


మిథునం (Gemini) –  ఈ రోజు పనంతా చాలా సజావుగా ముందుకు సాగుతుంది. క్లయింట్స్ వద్ద నుంచి రావాల్సిన పేమెంట్స్, ఆర్డర్స్ విషయంలో కాస్త జాప్యం జరగవచ్చు. అంతమాత్రాన వారిని అపార్థం చేసుకోకండి. క్రియేటివ్ ఫీల్డ్ లేదా ట్రేడింగ్ పరిశ్రమలో ఉన్నవారికి ఈ రోజు చాలా బాగుంటంది.


కర్కాటకం (Cancer) –  పని ప్రదేశంలో ఇతరులతో విభేదించకండి. అది మీరు చేసే పనిపై ప్రభావం చూపచ్చు. గత కొద్ది రోజులుగా మీరు అసహనంతో ఉంటున్నారు. అందుకు మీ చుట్టూ ఉన్నవారు కారణం కాదని గ్రహించండి. మీరు చేసిన పొరపాట్లను గ్రహించి సరిదిద్దుకుంటే అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి.


సింహం (Leo) –  ఈ రోజు ఆఫీసులో అన్ని పనులు మీరు అనుకున్న విధంగానే జరుగుతాయి. ముఖ్యమైన పనులు, సమావేశాలు మీరు ఊహించినట్లే ముగుస్తాయి. కుటుంబపరమైన జీవితం కూడా చాలా నిదానంగా, సున్నితంగా ముందుకెళ్తుంది. కొన్ని అనుకోని పనుల కారణంగా వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలను బ్యాలన్స్ చేయడం కాస్త కష్టం కావచ్చు.


క‌న్య (Virgo) –  మీకున్న కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు పని ప్రదేశంలో అంతా బాగానే జరిగినా.. బయట మాత్రం మీ ఊహకు వ్యతిరేకంగా జరగచ్చు. ఈ కారణంగా ఎవరితోనూ ఘర్షణకు దిగకండి. ముఖ్యంగా భాగస్వామితో సహనంతో వ్యవహరించండి. మీ చిరాకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిపైనా చూపకండి.


తుల (Libra) –  ఆఫీసులో మీకు బాగా ఒత్తిడి అనిపించే పనుల్లో.. మీ సహచరుల సహాయం తీసుకోవడం ద్వారా సులభంగా వాటిని పూర్తి చేయచ్చు. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్నట్లైతే అందుకు సంబంధించి ప్రయత్నాలు చేసేందుకు ఈ రోజు చాలా అనువైనది.


వృశ్చికం (Scorpio) –  ఈ రోజు ఎక్కడ పని అక్కడ ఆగిపోయినట్లుగా అనిపించవచ్చు. కానీ డెడ్ లైన్ ప్రకారం కొన్ని పనులను పూర్తి చేయడానికి మీరు బాగా శ్రమించాల్సి రావచ్చు. అధిక సమయంలో పనిలో ఉండిపోవడం వల్ల మీ భాగస్వామి తనను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని భావించవచ్చు. కాబట్టి రెండూ బ్యాలన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్లండి.


ధనుస్సు (Saggitarius) –  పనికి సంబంధించి మీకో స్పష్టత రావడంతో.. మీ ప్రాజెక్టులు చాలా పాజిటివ్‌గా సాగుతాయి. అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూసే వారు కూడా ఈ రోజు శుభవార్త వినే అవకాశాలున్నాయి. సహచరులతో ఘర్షణకు దిగకండి. మీ కోసం మీరు సమయం కేటాయించుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడండి.


మకరం (Capricorn) –  పేమెంట్స్‌లో జాప్యం జరిగే కారణంగా చేసే పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి విషయాలు మిమ్మల్ని అసహనానికి కూడా గురిచేయవచ్చు. ఈ క్రమంలో క్లయింట్స్ మిమ్మల్ని డిమాండ్ చేసినా మీరు వారితో హుందాగా, స్నేహపూర్వకంగా వ్యవహరించడం మంచిది. లేదంటే పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారతాయి. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. మీరు చాలా రోజుల తర్వాత మీ మనసుకు బాగా ఇష్టపడే వ్యక్తిని కలుసుకోనున్నారు.


కుంభం (Aquarius) – ఈ రోజు చేయాల్సిన పనులు ఎక్కువగా ఉన్న కారణంగా ముఖ్యమైన కుటుంబ సమావేశాలు లేదా అధికారిక సమావేశాలకు మీరు హాజరుకాలేకపోవచ్చు. ఇలాంటి విషయాల వల్ల మీ కుటుంబ సభ్యులు అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక పరిస్థితిని సాధ్యమైనంత వరకూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లడం మంచిది. 


మీనం (Pisces) –  గత కొద్ది రోజులతో పోలిస్తే ఈ రోజు పని చాలా వేగంగా జరుగుతుంది. అయితే పని ప్రదేశంలో ఇతర వ్యక్తుల మనస్తత్వాలు, వ్యవహరిస్తున్న తీరును బట్టి మీరూ ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీ అవసరం ఉంటుంది. మీరు పలువురికి రుణాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. 


Credit: Asha Shah


ఇవి కూడా చ‌ద‌వండి


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?


ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!