ADVERTISEMENT
home / Fitness
హైదరాబాద్ ట్రెండ్స్ : బెస్ట్ జిమ్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి..!

హైదరాబాద్ ట్రెండ్స్ : బెస్ట్ జిమ్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి..!

ఫిట్ నెస్ (fitness) అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. చాలామంది వ్యాయామాన్ని కేవలం బరువు తగ్గించేందుకు లేదా పెంచేందుకు కాకుండా ఫిట్‌గా ఉండేందుకు కూడా చేస్తున్నారు. వ్యాయామం అంటే కేవలం జిమ్‌కి (Gym)  వెళ్లి కార్డియో, వెయిట్ ట్రైనింగ్ తీసుకోవడమే కాదు.  యోగా, క్రాస్ ఫిట్, జుంబా లాంటి వాటిని కూడా ప్రయత్నించేవాళ్లు  చాలామందే ఉన్నారు.

ఫిట్ నెస్ ఫ్రీక్స్ రోజు రోజుకీ పెరిగిపోతున్న ఈ క్రమంలో.. హైదరాబాదీలకు మంచి ఫిట్ నెస్ సెంటర్స్ లేదా జిమ్స్ ఎక్కడున్నాయి అనే సందేహం రావడం సహజం. అందుకే భాగ్యనగరంలోని ప్రముఖ జిమ్స్, ఫిట్ నెస్ సెంటర్ల వివరాలను మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. 

just dial

ADVERTISEMENT

1. పల్స్8 ఎలైట్ జిమ్

పల్స్ 8.. హైదరాబాద్‌లోని అత్యుత్తమైన జిమ్స్‌లో ఇది కూడా ఒకటి. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ జిమ్ అప్పటి నుంచి సక్సెస్ బాటలోనే నడుస్తోంది. ఇందులో ఉన్న ట్రైనర్స్‌లో ఎక్కువమంది అనుభవం ఉన్నవారే కావడం దీని సక్సెస్‌కి కారణం. ఫిట్‌నెస్‌కి సంబంధించి ప్రతి ఒక్క విషయం గురించి వివరిస్తూ.. మన శరీరతత్వాన్ని బట్టి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ వివరిస్తారు. ఇందులో కేవలం జిమ్ మాత్రమే కాదు.. కిక్ బాక్సింగ్, క్రాస్ ఫిట్, జుంబా, పవర్ యోగా వంటి వాటికి కూడా తరగతులను నిర్వహిస్తున్నారు. అబిడ్స్ కేంద్రంగా ఈ జిమ్ పనిచేస్తోంది. 

ఫోన్ : 9912525027

2. 360 డిగ్రీస్ ఫిట్ నెస్

జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఈ జిమ్ నగరంలోని ప్రముఖ జిమ్స్‌లో ఒకటి. ఖరీదైన పరికరాలు, విశాలమైన స్థలం ఈ జిమ్ ప్రత్యేకత. మార్కెట్లో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ మొత్తం ఇక్కడ లభిస్తుంది. 20 సంవత్సరాల అనుభవం గల ఇక్కడి నిపుణులు.. ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటికి తగినట్లుగా శిక్షణనిస్తుంటారు. ఇక్కడ ఖర్చు కొంత ఎక్కువ కాబట్టి.. కొంతమంది సంశయిస్తుంటారు. కానీ నగరంలోని ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లు ఈ తరహా ఫిట్‌నెస్ సెంటర్లనే ఎంచుకుంటూ ఉంటారు.

ఫోన్ : 9000111360

ADVERTISEMENT

హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం

justdial

3. క్రిస్ గెతిన్ జిమ్స్

ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన జిమ్ సెంటర్ల చెయిన్ ఇది. గ్లోబల్ ఫిట్ నెస్ బ్రాండ్స్ అన్నింటినీ నగర వాసులకు అందుబాటులో తెచ్చేందుకు దీన్ని ప్రారంభించారనుకోవచ్చు. ఈ జిమ్‌ని ప్రారంభించి దీనికి ప్రాచుర్యం కల్పించేందుకు.. క్రిస్ గెతిన్ కొన్ని రోజుల పాటు హైదరాబాద్‌కి కూడా రావడం విశేషం. ఇక్కడ ఫలితం చాలా తొందరగా వస్తుందని అంతా చెబుతుంటారు. కూకట్ పల్లిలో ప్రస్తుతం ఈ జిమ్ నడస్తోంది. 

ADVERTISEMENT

ఫోన్ : 83670 29991

4. ఎఫ్ 45

ఎఫ్ 45.. అత్యద్భుతమైన సర్వీస్‌ని అందించే ఫిట్ నెస్ సెంటర్స్ చైన్ ఇది. నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ చైన్‌లో భాగంగా మూడు సెంటర్లకు ఫ్రాంచైజీ తీసుకున్న సంగతి తెలిసిందే. రకుల్ ఏర్పాటు చేసిన సెంటర్లు గచ్చిబౌలి, కోకాపేట్, విశాఖపట్నం ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడ కస్టమర్ సంతృప్తి ప్రధాన ధ్యేయం. అందుకే ప్రారంభించి ఇన్నేళ్లైనా.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా కొనసాగడంతో పాటు.. బ్రాంచీలను పెంచుకుంటూ పోతోందీ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ జిమ్ సెంటర్లకు నగరంలోనూ మంచి పేరుంది.

ఫోన్ : 73060 24545

ADVERTISEMENT

justdial

5. అపోలో లైఫ్

అపోలో ఫౌండేషన్ తరఫున ప్రారంభించిన జిమ్ ఇది. టాలీవుడ్ సెలబ్రిటీల్లో ఎక్కువ మంది ఇదే జిమ్‌లో వ్యాయామం చేస్తుంటారు. ఇక్కడ అత్యద్భుతమైన సౌకర్యాలతో పాటు.. అనుభవం ఉన్న ఫిట్ నెస్ ట్రైనర్లు కూడా అందుబాటులో ఉంటారు. కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. ఇందులో పిలాటిస్, స్విమ్మింగ్, ఏరోబిక్స్, యోగా, జుంబా, కిక్ బాక్సింగ్ వంటివి చేసే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. జుబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాలలో ఈ జిమ్స్ అందుబాటులో ఉన్నాయి. 

ఫోన్ : 8048068277

6. క్వాడ్ ఫిట్ నెస్ హబ్

2017లో ప్రారంభించిన ఈ ఫిట్‌నెస్ హబ్ నగరంలోనే అత్యుత్తమని చెప్పుకోవచ్చు. జిమ్ సేవలతో పాటు జుంబా క్లాసులు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇందులోని జుంబా క్లాసులకు పాపులారిటీ చాలా ఎక్కువ. ఫిట్ నెస్ ఫ్రీక్స్ అందరికీ ఒకే చోట.. అన్నీ దొరికే స్థలంగా ఇది పాపులారిటీ సాధించింది. వనస్థలిపురంలో ఉన్న ఈ ఫిట్ నెస్ సెంటర్.. చుట్టుపక్కల ఏరియాల్లో కూడా మంచి ప్రాచుర్యం పొంది బెస్ట్ జిమ్‌గా నిలిచింది. ఇందులో ఎక్సర్ సైజ్, జుంబాతో పాటు యోగా, ఏరోబిక్స్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

ADVERTISEMENT

ఫోన్ : 96187 64477

హైదరాబాద్ ట్రెండ్స్: మంచి బ్యూటీ పార్లర్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి

justdial

ADVERTISEMENT

7. ప్రొక్వెస్ట్ ఫిట్ నెస్

సికింద్రాబాద్‌లోని సింధీ కాలనీలో ఉన్న ఈ ఫిట్‌నెస్ క్లబ్ నగరంలోని బెస్ట్ జిమ్‌లలో ఒకటి. ఇది తమ కస్టమర్లకు కావాల్సిన విధంగా ట్రైనింగ్ అందిస్తూ.. వారి లక్ష్యాలను చేరేందుకు ప్రయత్నించే అతి కొద్ది జిమ్స్‌లో ఒకటి. ఇందులో కిక్ బాక్సింగ్, స్పిన్నింగ్ స్టూడియో వంటివన్నీ ఉన్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్ ఇక్కడ ఉంది. 36 కార్డియో స్టేషన్లతో నగరంలోనే అతి పెద్ద జిమ్‌గా ఇది పేరు గాంచింది.

ఫోన్ : 040 2772 2992

8. గోల్డ్స్ జిమ్

2013లో ప్రారంభించిన గోల్డ్ జిమ్ కేవలం వ్యాయామం మాత్రమే కాదు.. ఏరోబిక్స్, యోగా, కిక్ బాక్సింగ్, జుంబా, క్రాస్ ఫిట్ వంటి సేవలన్నింటినీ అందిస్తుంది. అత్యద్భుతమైన శిక్షణ అందించే నిపుణులు ఈ జిమ్ సొంతం. అంతేకాదు.. ఇక్కడ వర్కవుట్‌కి రివార్డు పాయింట్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో సినిమా టికెట్లు, ఫోన్లు వంటివి కొనుగోలు చేసే వీలుంటుంది. అంటే కష్టపడిన దానికి రెండు రకాల ఫలితం ఉంటుందన్నమాట.

ఫోన్ : 7680989874

ADVERTISEMENT

justdial

9. తల్వాల్కర్స్

హైదరాబాద్‌లోని అత్యంత పాత జిమ్ ఇది. దీని బ్రాంచీలు నగరంలో చాలా చోట్ల ఉన్నాయి. చాలా తక్కువ ఫీజుతో మెంబర్ షిప్ అందించే ఈ జిమ్ 1932 నుంచి కొనసాగుతోంది. జుంబా, కార్డియో, పవర్ యోగా వంటి ఎన్నో సర్వీసులు ఇందులో అందుబాటులో ఉంటాయి. మెంబర్ షిప్ ఆఫర్లు ఎన్నో ప్రకటిస్తూ ఫిట్‌నెస్ ప్రియులకు మరింత చేరువవుతుంది తల్వాల్కర్స్ జిమ్.

10. ఫిట్‌నెస్ లాంజ్

ఎల్‌బీ నగర్‌లో ఉన్న మరో చక్కటి జిమ్ ఇది. ఇక్కడ రిజల్డ్స్ గ్యారంటీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉంటాయి. క్రిస్ గెతిన్ జిమ్స్‌లో మాస్టర్ ట్రైనర్‌గా ఉన్న సతీష్ పర్యాదా ఈ జిమ్‌కి సహ యజమాని. జిమ్ మేనేజ్ మెంట్‌‌లో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఆయన ప్రేరణలో నెలకొల్పబడిన ఈ జిమ్‌లోనూ ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు.

ADVERTISEMENT

ఫోన్ : 96183 88988

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

హైదరాబాద్‌ ట్రెండ్స్: షాపింగ్ చేయాలా? అయితే ఈ మార్కెట్లపై ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT
16 Jul 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT