ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. మీ లక్ష్యాలు సాధించేందుకు బాటలు వేసుకోండి..

ఈ రోజు రాశిఫ‌లాలు చదవండి.. మీ లక్ష్యాలు సాధించేందుకు బాటలు వేసుకోండి..

ఈ రోజు (మే 28) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..


మేషం (Aries) – మిమ్మల్ని మీరే ఎక్కువగా నిందించుకోవడం వల్ల నిరుత్సాహానికి గురి కావచ్చు. గతంలో జరిగిన సంఘటనల గురించి ఆలోచించకుండా మీకున్న ప్లస్ పాయింట్స్, ఎనర్జీల గురించి ఆలోచించండి. కొత్త ఐడియాలు మీకు సత్ఫలితాలనిస్తాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా మంచి చేస్తాయి.


వృషభం (Tarus) – పనిలో మీకు ఈ రోజు చాలా డిమాండ్ ఉంటుంది. అయితే ఆ పనులు కూడా అంతే విలువైనవని గుర్తించండి. మీరిచ్చే ప్రజెంటేషన్ లేదా ప్లాన్స్ లో చివరి నిమిషంలో మార్పులు చేస్తారు. ఇవన్నీ మీకు ఫేవర్ గానే జరుగుతాయి. కొత్త కాంట్రాక్ట్స్ లేదా డీల్స్ పై సంతకం చేసేందుకు ఈ రోజు చాలా మంచిది. మీ గతానుభవాల ఆధారంగా ఇతరులకు సలహాలు ఇవ్వకండి.


మిథునం (Gemini) – పని అంతా పాజిటివ్ గా జరగడమే కాదు.. ఫలితాలు కూడా మీరు కోరుకున్న విధంగానే వస్తాయి. అయితే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా మీరు ఎమోషనల్ గా అలసిపోయినట్లు ఫీలవుతారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఏదైనా సరే మనసు విప్పి నేరుగా మాట్లాడండి. గతంలో జరిగిన సంఘటనలను వర్తమానంపై ప్రభావం చూపనీయకండి.


కర్కాటకం (Cancer) – మీరు దేని కోసం పని చేస్తున్నారో మీకు తెలియకపోవడం వల్ల పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఒక్కసారి వెనకడుగు వేసి బాగా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకుని తదనుగుణంగా ముందడుగు వేయండి. అలాకాకుండా నేరుగా నిర్ణయాలు తీసుకుంటే చిక్కుల్లో పడేది మీరేనని గ్రహించండి. మధ్యాహ్నం సమయంలో మాత్రం మీరు ఇష్టపడిన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు.


సింహం (Leo) – పనిలో పెద్దగా మార్పులు ఉండవు. కానీ కొత్తగా వచ్చే ఆర్డర్స్ లేదా కొత్తగా జరిగే ప్రారంభాల పట్ల మీరు మరింత ఏకాగ్రతతో వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఓ పని ప్రాముఖ్యం కలిగి ఉంది. దానిన గుర్తించి వెంటనే దానిని పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. పాత స్నేహితులను కలిసి వారితో సంతోషంగా గడపండి.


క‌న్య (Virgo) – చేసే పనిలో పెద్దగా మార్పులు ఉండవు. అంతేకాదు.. ఎప్పట్నుంచో ఆగిపోయిన పని ఈ రోజు పూర్తైపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో మీకు చాలా మంచి జరుగుతుంది. పని ప్రదేశంలో సహచరులకు అప్పగించిన బాధ్యతలను మరోసారి సరిచూసి చిన్న చిన్న మార్పులు చేయాలని మీరు భావిస్తారు. ఈ విషయంలో ద్రుఢంగా వ్యవహరించండి. మీకు, మీ భాగస్వామికి మధ్య ఉన్న అనుబంధంలో రొమాన్స్ ని తిరిగి చిగురింపచేయండి.


తుల (Libra) – మీరు కొత్త డెవలప్ మెంట్స్ పై ఎక్కువగా ద్రుష్టి పెట్టడం వల్ల చేసే పని కాస్త నెమ్మదిస్తుంది. ఒక ముఖ్యమైన వ్యక్తికి సహాయం చేసేందుకు మీ షెడ్యూల్ ని మీరు మళ్లీ పునర్నిర్మించుకోవాల్సి రావచ్చు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. అయితే ఈ రోజు మీ సామాజిక జీవితానికి సంబంధించిన ప్రణాళికలు ఆసక్తికరంగా ముందుకు సాగుతాయి.


వృశ్చికం (Scorpio) – పని ఎక్కువగా ఉన్నప్పటికీ అంత ఉత్పాదకంగా అనిపించకపోవచ్చు. రోజు ముగిసే సమయానికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మీకు అలసిపోయిన భావన కలుగుతుంది. పనికి సంబంధించిన కొత్త డెవలప్ మెంట్స్ గురించి ఎవ్వరితోనూ చర్చించకండి. తోబుట్టువుల కారణంగా ఒత్తిడి కలగచ్చు. వారితో మీకు గొడవలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.


ధనుస్సు (Saggitarius) – చేపట్టిన పనులు సక్రమంగా జరిగేలా ఈ రోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీ పాత క్లయింట్స్ కూడా మీకు టచ్ లోకి వస్తారు. మీ పాత స్నేహితులను కలిసి వారితో కాస్త సంతోషంగా గడపండి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.


మకరం (Capricorn) – పని విషయంలో ఈ రోజు మీ బాధ్యతలు పెరగచ్చు. మీరు చేసే ఈ ప్రయాణం పట్ల మీకు సంతోషంగా అనిపించకపోవచ్చు. మీ లక్ష్యాలను మరోసారి సరిచూసుకొని వాటిని సాధించేందుకు మానసికంగా మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకుంటారు. తద్వారా ఓ స్పష్టత తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి దూరం జరిగి ఒంటరిగా సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు.


కుంభం (Aquarius) – పనులు జరిగేలా మీరు పరిస్థితులను బలవంతంగా ముందుకు తోసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో మీకు ఈ రోజు ఓ స్పష్టత వస్తుంది. కాస్త ప్రశాంతమైన మనసుతో ఆలోచించడానికి ప్రయత్నించండి. పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసేందుకు కుటుంబంతో తక్కువ సమయం గడుపుతారు.


మీనం (Pisces) – పెండింగ్ లో ఉన్న పనులు, కొత్తగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు.. ఇలా వీటి నడుమ రోజంతా చాలా బిజీగా గడుస్తుంది. ప్రస్తుతం మీరు చేపట్టిన ఒక ప్రాజెక్టుకు సంబంధించి మీకు ఈ రోజు ఓ స్పష్టత వస్తుంది. మీ టీం మెంబర్ చేయాల్సిన పని కూడా మీరే చేయాల్సి రావచ్చు. ఫలితంగా పనిలోనే అధిక సమయం గడిచిపోతుంది.


ఇవి కూడా చ‌ద‌వండి


నేటి రాశిఫలాలు చదవండి.. మీ జీవిత గమ్యాలను చేరుకోండి..


మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలని భావిస్తే.. ఈ చిత్రమైన చైనీస్ జ్యోతిష్యం చదివేయండి..!


సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?