Advertisement

Beauty

చంకల్లో నలుపు సమస్యా? ఇలా చేస్తే చిటికెలో మాయమవుతుంది..!

Soujanya GangamSoujanya Gangam  |  Aug 22, 2019
చంకల్లో నలుపు సమస్యా? ఇలా చేస్తే చిటికెలో మాయమవుతుంది..!

Advertisement

మోడ్రన్ దుస్తులు వేసుకోవాలన్నా.. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లోనే కొత్త ట్రెండ్స్ ఫాలో అవ్వాలన్నా.. ప్రస్తుతం ఎక్కువగా స్లీవ్ లెస్ (sleeveless) వేసుకోవడానికి అంతా ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలామంది అమ్మాయిలు మాత్రం స్లీవ్ లెస్ వేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. దీనికి కారణం చంకల్లో (Underarms) నల్లగా (dark) ఉండడమే.. ఎక్కువగా చెమట రావడం, క్వాలిటీ లేని డియోడరెంట్ వాడడం, షేవింగ్ చేసేటప్పుడు ఎదురైన ఇబ్బందుల వల్లే కాక.. కొందరికి ఇది జన్యుపరంగా కూడా వస్తుంటుంది.

చర్మంపై ఉన్న సూక్ష్మ జీవులు కూడా తేమ ఎక్కువగా ఉండే ఇలాంటి ప్రదేశాల్లో చేరి దాన్ని నల్లగా మారుస్తాయి. దీన్ని తిరిగి చర్మపు రంగులోకి మార్చుకోవడానికి చాలామంది ఎన్నో ట్రీట్ మెంట్లను ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దానికోసం ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు.. మీ చంకలు తెల్లగా మారతాయి. మీకు నచ్చినట్లుగా స్లీవ్ లెస్ టాప్స్ వేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది.

వ్యాక్సింగ్ ప్రయత్నించండి.

shutterstock

చంకల్లో చర్మం నల్లగా మారేందుకు ముఖ్య కారణం షేవింగ్. వెంట్రుకలు చాలా చిన్నగా ఉన్నప్పుడే షేవ్ చేయడం వల్ల చర్మం పాడవుతుంది. నల్లగా మారుతుంది. దీన్ని నివారించేందుకు వ్యాక్సింగ్‌ని ఉపయోగించడం మంచిది. ఇది షేవింగ్ కంటే చాలా సులువైనది కూడా. అంతేకాకుండా వెంట్రుకలను కుదుళ్ల నుంచి తొలగిస్తుంది. చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. వెంట్రుకల పెరుగుదలను కూడా నెమ్మదిగా మారేలా చేస్తుంది.

చర్మాన్ని మెరిపించే సున్నిపిండి.. ఎలా తయారుచేయాలో తెలుసా?

నిమ్మరసం రాయండి..

shutterstock

నిమ్మ కాయ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుందని ..దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం తెల్లగా మారుతుందనేది మనలో చాలామందికి తెలిసిన విషయమే. నిమ్మకాయ గుజ్జుతో.. చంకల్లో రోజూ రుద్దడం వల్ల అవి కూడా చర్మపు రంగులోకి మారతాయి. నిమ్మరసం రోజూ ఉపయోగించడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే నిమ్మరసం స్న్రేలు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని కూడా వాడవచ్చు. అంతేకాదు.. చంకల్లో వెంట్రుకలను తొలగించడానికి లెమన్ హెయిర్ రిమావల్ స్ప్రే ఉపయోగించడం వల్ల రెండు ప్రయోజనాలూ అందుతాయి.

డియోడరెంట్ వద్దు..

shutterstock

డియోడరెంట్ మన దగ్గర మంచి సువాసన వచ్చేలా చేస్తుంది. అయితే ఇందులోని కెమికల్స్ మన చర్మంపై ప్రభావం చూపుతాయి. నేరుగా చంకల్లో ఉపయోగిస్తే అవి నల్లగా మారతాయి. అందుకే డియోడరెంట్‌ని వాడకూడదు. దీని బదులు పెర్ఫ్యూమ్ లాంటివి ఉపయోగించాలి. ఇవేవీ వద్దనుకుంటే బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. అది మీ చర్మంపై మృత చర్మాన్ని తొలిగించి.. వాసన రాకుండా చేస్తుంది. అలాగే బ్యాక్టీరియాను తొలగించి.. మీ చంకలను చర్మపు రంగులోకి మారేలా చేస్తుంది.

షేవింగ్ తర్వాత వచ్చే వెంట్రుకలు.. గుచ్చుకోకుండా ఉండాలంటే..?

కీర దోస, బంగాళాదుంప

shutterstock

చర్మం నల్లగా ఉంటే.. ముందుగా ఉపయోగించాల్సిన పదార్థాలు కీర దోస, బంగాళాదుంప. ఈ రెండు కూరలు ఆమ్ల గుణాలను కలిగి ఉంటాయి. అందుకే చర్మాన్ని బ్లీచ్ చేస్తాయి. అందుకే ఈ రెండింట్లో ఒక దాన్ని పేస్ట్ చేసి చంకల్లో రాసుకోవాలి. ఆ తర్వాత.. పావుగంట పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి. దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి కాకుండా మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే.. అప్పుడే తాజాగా కట్ చేసిన ఆకు నుంచి జెల్ తీసి దాన్ని రోజూ అప్లై చేయడం వల్ల చర్మపు రంగులో మార్పు కనిపిస్తుంది.

లైటెనింగ్ స్క్రబ్

shutterstock

మార్కెట్లో లభించే ఈ స్కిన్ లైటెనింగ్ స్క్రబ్స్.. చాలా సులభంగా లభిస్తాయి. అయితే వీటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. మీ చర్మానికి తగిన ఉత్పత్తులను ఎంచుకోవాలి. తరచూ మార్చకుండా ఒకే కంపెనీ స్క్రబ్ ఉపయోగించాలి. నివియా, బాడీ షాప్, ఎవర్ యూత్ నేచురల్స్ వంటి మంచి పేరున్న కంపెనీలకు చెందిన స్క్రబ్స్ ఉపయోగించడం మంచిది.

ఫేషియ‌ల్ బ్లీచ్‌తో.. మెరిసే అందాన్ని సొంతం చేసుకుందాం.. ! (How To Bleach Facial Hair At Home)

వెనిగర్‌తో..

shutterstock

వెనిగర్ బ్యాక్టీరియాతో పోరాడేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే చంకల్లో నలుపుదనాన్ని తొలగించడానికి ఇది చక్కటి ఆప్షన్. ఇది కేవలం నలుపుదనాన్ని మాత్రమే కాదు.. వాసనను కూడా తొలిగిస్తుంది. దీనికోసం బియ్యప్పిండి, వెనిగర్ కలిపి.. ప్యాక్ చేసుకొని చంకల్లో రుద్దుకోవాలి. ఆ తర్వాత పావు గంట పాటు ఉంచుకొని.. తర్వాత కడిగేసుకోవాలి.

పెరుగు ఉపయోగించండి..

shutterstock

పెరుగు యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియాతో పాటు, సూక్ష్మ జీవులను సంహరిస్తుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి, స్క్రబ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మంచి ఫలితాలు కావాలంటే.. దీన్ని రోజూ చంకల్లో అప్లై చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే యోగర్ట్ క్రీం మాస్క్‌ను ఉపయోగించవచ్చు. పెరుగులోని విటమిన్ ఎ చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది.

కుంకుమ పువ్వుతో..

Shutterstock

కుంకుమ పువ్వు ఉపయోగించడం అంటే కాస్త ఖరీదైన పనే. కానీ దీనివల్ల ఫలితం చాలా బాగుంటుంది. దీనికోసం పాలు లేదా క్రీంలో.. కుంకుమ పువ్వు వేసి రాత్రి పడుకోబోయే ముందు చంకల్లో నల్లగా మారిన భాగానికి రుద్దుకొని.. రాత్రంతా అలాగే ఉంచుకొని పడుకోవాలి. ఆ తర్వాత.. ఉదయాన్నే మామూలుగా స్నానం చేసేయవచ్చు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లైటెనర్‌గా పనిచేస్తుంది. దీన్ని ఇంట్లో తయారుచేసుకోవడం ఇబ్బంది అయితే.. కుంకుమ పువ్వు క్రీం ప్యాక్ కొనుక్కొని దాన్ని ఉపయోగించవచ్చు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.