ADVERTISEMENT
home / ఫ్యాషన్
లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోన్న.. అందాల చందమామ కాజల్ అగర్వాల్..!

లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోన్న.. అందాల చందమామ కాజల్ అగర్వాల్..!

కాజల్ అగర్వాల్ (Kajal aggarwal).. తెలుగు సినీపరిశ్రమలో ప్రత్యేకించి పరిచయం అవసరం లేని పేరు. లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తెలుగువారింట అందాల చందమామగా గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ. ఈ అమ్మడు తన ఫ్యాషన్స్‌తో కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.

చక్కని చీర కట్టినా, వెస్ట్రన్ లుక్‌లో అదరగొట్టినా అది కాజల్‌కే చెల్లింది. అందుకే తీరిక లేకుండా షూటింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా గడిపే ఈ అందాల చందమామ వీలున్నప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు పోస్ట్ చేస్తూ, అభిమానులతో అప్పుడప్పుడూ ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఇటీవలే ఓ ఫొటోషూట్‌లో పాలు పంచుకున్న కాజల్ ఆ స్టిల్స్‌ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అందరితోనూ పంచుకుంది. ఇందులో రెడ్ కలర్ సాటిన్ అవుట్ ఫిట్‌తో ఉన్న కాజల్ లుక్ చాలా హాట్‌గా ఉండడమే కాదు.. మత్తెక్కించే అందాలతో అందరి మతులు కూడా పోగొడుతోంది. కావాలంటే ఆ స్టిల్స్‌ని మీరూ ఓసారి చూడండి..

ఎరుపు రంగు స్ట్రాప్డ్ శాటిన్ అవుట్ ఫిట్ ధరించిన కాజల్ హాఫ్ అప్ టాప్ నాట్ హెయిర్ స్టైల్‌తో చాలా క్యూట్ గా కనిపిస్తోంది కదూ.. ఇక అవుట్ ఫిట్‌కు జతగా ఆమె ధరించిన ఫ్లోరల్ కేప్ అయితే మొత్తం అవుట్ ఫిట్ లుక్‌నే ఇనుమడించేలా చేసింది. ఈ ఫొటోలను కాజల్ పోస్ట్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో ఇవి వైరల్‌గా మారిపోయాయి.

ADVERTISEMENT

కేవలం ఇవి మాత్రమే కాదు.. మునుపు కూడా తన మత్తెక్కించే అందాలతో హాట్ స్టిల్స్‌ని పోస్ట్ చేసిందీ సుందరి. లేస్ మోడల్ బ్లాక్ అవుట్ ఫిట్‌తో స్మోకీ ఐస్‌తో ఎంత అందంగా కనిపించిందో మీరే చూడండి..

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటించిన ‘సీత’ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న మరొక చిత్రంలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. అలాగే తమిళంలో క్వీన్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోన్న పారిస్ పారిస్‌లోనూ కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ తెగ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ

కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !

ADVERTISEMENT

ఇవి కూడా చదవండి

బాపూ గారి బొమ్మ ప్ర‌ణీత ఫ్యాష‌న్స్ ఫాలో అవ్వండి.. మీరూ భ‌లేగా మెరిసిపోండి..!

ఈ సుంద‌రి అంద‌మే కాదు.. ఫ్యాష‌న్స్ కూడా లావ‌ణ్య‌మే..!

కలర్ ఫుల్ అండ్ కూల్ ఫ్యాషన్స్.. ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధ శ్రీ‌నాథ్ సొంతం..!

ADVERTISEMENT
22 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT