ADVERTISEMENT
home / సౌందర్యం
మీ హెయిర్ స్టైల్ .. మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో తెలుసా??

మీ హెయిర్ స్టైల్ .. మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో తెలుసా??

ప్రతి అమ్మాయి తనకంటూ ప్రత్యేకంగా ఏదో ఒక హెయిర్ స్టైల్‌ని (Hairstyle)  ఫాలో అవుతూ ఉంటుంది. కొందరు సందర్భం ఏదైనా కామన్ హెయిర్ స్టైల్‌తో మెరిసిపోతే.. ఇంకొందరు మాత్రం సందర్భానికి అనుగుణంగానే తమ హెయిర్ స్టైల్ కూడా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. భిన్నమైన హెయిర్ స్టైల్స్‌తో వారు మెరిసిపోవడమే కాకుండా.. చుట్టూ ఉన్నవారి చూపుని కూడా తమవైపు తిప్పుకుంటూ ఉంటారు.

అయితే ప్రత్యేకమైన ఆసక్తి మేరకో లేక సందర్భానికి అనుగుణంగానో ఫాలో అయ్యే ఈ హెయిర్ స్టైల్స్ మాట కాసేపు పక్కన పెడితే.. చాలామంది తమకంటూ ఒక సిగ్నేచర్ హెయిర్ స్టైల్‌ని ఫాలో అవుతూ ఉంటారు. ఇలా మీరు వేసుకునే సిగ్నేచర్ హెయిర్ స్టైల్స్ మీరు ఎలాంటి వ్యక్తో చెప్తాయంటే నమ్ముతారా? నిజమండీ. మీ అలవాట్లు, మూడ్.. ఇలా ప్రతి అంశం గురించీ అవి ఎదుటివారికి తెలియజేస్తాయి. మరి, ఏ హెయిర్ స్టైల్ ఎలాంటి వ్యక్తిత్వం గురించి చెబుతుందో మనం తెలుసుకుందాం రండి..

బెలరినా బన్

బన్ హెయిర్ స్టైల్ వేసుకునేవారు అనవసర విషయాలు, సమయాన్ని వేస్ట్ చేసే అంశాల గురించి అస్సలు పట్టించుకోరట. ఇంకా చెప్పాలంటే ఇలాంటి విషయాల్లో వీరికి ఏ మాత్రం సహనం కూడా ఉండదట. కేవలం చేపట్టిన పనిని పూర్తి చేయడంపైనే వీరి ఫోకస్ అంతా ఉంటుంది. ఓ వైపు మితమైన వస్తువులు, యాక్సెసరీస్.. వంటివి ఉపయోగిస్తూనే వీలైనంత స్టైలిష్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

వీరు తాము చెప్పే మాట మీద తప్పకుండా నిలబడతారు. అలాగే మనసులో ఎలాంటి ఉద్దేశం ఉన్నా దాని గురించి ఎదుటివారికి చాలా స్పష్టంగా, నిర్భయంగా చెప్తారు. మాటలకు తేనె పూసి మాయ చేసే ప్రయత్నం అస్సలు చేయరు. ఇతరులు వీరిలో అమితంగా ప్రేమించే లక్షణాలు కూడా ఇవేనట.

ADVERTISEMENT

 

Learn More: Trending hairstyles for ladies

పోనీ టెయిల్

పోనీ టెయిల్ ఎక్కువగా వేసుకునే వారు కేవలం సరదాగా ఉండడం మాత్రమే కాదు.. చాలా సున్నిత మనస్కులు కూడా. పైగా లుక్స్‌లో కూడా అంతే స్టైలిష్ గా ఉంటారు.

వీరు సరదాగా ఉన్నప్పుడు కాస్త పైకి పోనీ టెయిల్ (హై పోనీ) వేసుకుంటే; క్లాసీ లుక్‌లో మెరిసిపోవాలని అనుకున్నప్పుడు కాస్త కిందకు పోనీ టెయిల్ (లో పోనీ) వేసుకుంటారు.

ADVERTISEMENT

లేయర్డ్ వేవ్స్

వీరికి దయాగుణం చాలా ఎక్కువ. దేనినీ అంతగా లెక్కచేయరు. వీరితో గడిపే సమయం చాలా సంతోషంగా గడిచిపోతుంది. అందుకే ఎక్కువమంది స్నేహితులు వీరితో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తమకు తాముగా పెట్టుకునే నియమ, నిబంధనల ప్రకారమే వీరు తమ జీవితాన్ని కొనసాగిస్తారు. రిస్క్‌లు తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు. అలాగే తమతో తాము ఏకాంతంగా సమయం గడపడానికి వీరు చాలా ఇష్టపడతారు. వీరు చేసే ప్రతి పనిలోనూ వీరి ఆత్మవిశ్వాసం తాండవిస్తుంది.

లో బన్

వీరికి కష్టించే లేదా శ్రమించేతత్వం చాలా ఎక్కువ. అందరి కంటే బాగా కష్టపడి పని చేసి అధికారుల ప్రశంసలు లేదా బహుమతులు అందుకోవాలని వీరు ఆశిస్తూ ఉంటారు. ప్రతి దానిలోనూ ది బెస్ట్ ఎంపిక చేసుకుంటారు. సానుకూల ధోరణిలో ప్రతి ఛాలెంజ్‌ని స్వీకరిస్తారు. అలాగే ప్రతి సవాలునీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారు.

సంప్రదాయబద్ధంగా అల్లిన జడ

వీరు శాంతిని ఎక్కువగా ఇష్టపడతారు. తమ చుట్టూ అంతా ప్రశాంతంగా ఉండాలని భావిస్తారు. ఒత్తిడి ఎదురైన సందర్భాల్లో చాలా నిదానంగా, సహనంతో వ్యవహరిస్తారు. వీరి చుట్టూ ఉన్నవారికి వీరిలో ఉన్న ఈ గుణం బాగా నచ్చుతుంది. అలాగే వీరు ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్‌గా ఉండాలని భావిస్తారు.

అందమైన కర్ల్స్..

వీరి అందమైన ఉంగరాల జుట్టులానే వీరి మనసు, ఆలోచనలు కూడా చాలా అందంగా ఉంటాయి. ఎంత బోర్‌గా అనిపించే పనిపైనా వీరి కొత్త ఐడియాలతో ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వీరికున్న కర్లీ హెయిర్ స్టైల్‌లానే వీరి వ్యక్తిత్వం కూడా ఎక్కడికెళ్లినా వీరిని నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ADVERTISEMENT

మెస్సీ వేవ్స్..

చూడడానికి వీరు చాలా సున్నిత మనస్కులుగా, భయస్థుల్లా కనిపిస్తారు. కానీ అది అవాస్తవం. నిజానికి వీరు ఒక ఆడపులి. రూపం, ఆత్మసౌందర్యం, చేసే పని.. ఇలా ప్రతి అంశంలోనూ చక్కని ఆత్మవిశ్వాసంతో వీరు వ్యవహరిస్తారు. నెగెటివ్‌గా ఆలోచించే వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు. అలాగే డ్రామాలకు కూడా ఆమడ దూరంలో ఉంటారు.

కార్న్ రో..

సందర్భం ఏదైనా సరే.. వీరు ఎప్పుడూ ఒకేలా ఉండేందుకు ఇష్టపడతారు. విజయం సాధించేందుకు ఎంత శ్రమకోర్చడానికైనా వీరు సిద్ధమే. అంతేకాదు.. సవాళ్లు ఎదుర్కొనే క్రమంలో ఎప్పటికప్పుడు ఇతరుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ వాటి ద్వారా తమని తాము సరిదిద్దుకుంటూ మరింత మెరుగ్గా తమ ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఏ విషయంలోనైనా సరే.. వీరిది పై చేయి అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటారు. కాబట్టి ఈ తరహా అమ్మాయిలతో పోటీకి దిగాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి దిగడం మంచిది. ఏమంటారు??

Feature Image: Instagram

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

కళ్లను మరింత అందంగా.. మార్చేసే కాటుకలు ప్రత్యేకంగా మీకోసం..!

పగిలిన మడమలా? ఇలా చేసి కాళ్ల పగుళ్లు సులభంగా తగ్గించుకోవచ్చు..!

ఈ చిట్కాలు వాడితే చాలు.. పొడుగైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..

 

17 Jun 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT