Advertisement

Beauty

చిట్కాలు చిన్నవే.. కానీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి.. (Tips To Grow Long And Healthy Hair)

Lakshmi SudhaLakshmi Sudha  |  Jan 1, 2019
చిట్కాలు చిన్నవే.. కానీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి.. (Tips To Grow Long And Healthy Hair)

అందమైన, పొడవాటి, ఒత్తైన కురులు (hair) కావాలనే అమ్మాయిలంతా కోరుకొంటారు. అయితే తాచుపాము లాంటి వాలుజడ మాత్రం కొంతమంది భామలకు మాత్రమే సొంతమవుతుంది. అప్పుడప్పడూ వారికి అంత పొడవైన జుట్టు ఎలా సొంతమైందబ్బా అని ఆశ్చర్యపోవడం తప్ప మనం చేసేదేమీ ఉండదు. కొన్నిసార్లు జుట్టు పొడవుగా, లావుగా అవుతుందనే ఆశతో కొన్ని చిట్కాలు(tips) సైతం పాటిస్తుంటాం. అయితే ఈ క్రమంలోనే మనం చేసే పొరపాట్లే జుట్టు ఎదుగుదలకు అవరోధాలుగా మారతాయి. అవేంటో తెలుసుకుంటే.. పొడవాటి కురులు సొంతం చేసుకోవచ్చు. 

పొడవైన జుట్టు పొందడం ఎలా?(How To Grow Long Hair)

జుట్టు పొడవుగా అవ్వాలని మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. రకరకాల నూనెలు ఉపయోగిస్తాం. నెట్లో సెర్చ్ చేసి మరీ హెయిర్ ప్యాక్స్ వేసుకుంటాం. అయితే రోజూ మనం చేసే కొన్ని పొరపాట్లు జుట్టు రాలడానికి కారణమవుతుంటాయి. తలకు నూనె పెట్టుకోవడం దగ్గర నుంచి తలస్నానం చేసే వరకు మనం చేసే చిన్న చిన్న తప్పులు జుట్టు పొడవుగా ఎదగకుండా చేస్తాయి. ఈ విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. మన జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. అవేంటో మనమూ తెలుసుకొందాం.

1. దళసరి టవల్ పక్కన పెట్టేయండి. (Avoid Using Thick Towel To Dry Hair) 

తలస్నానం చేసినప్పుడు దళసరి టర్కీ టవల్ తలకు చుట్టుకోవడం మనలో చాలామందికున్న అలవాటు. దీనివల్ల జుట్టుకు జరిగే మంచి కంటే చెడే ఎక్కువ. ఈ టవల్‌లో ఉన్న దారపు పోగులు వల్ల వెంట్రుకలు బిరుసుగా తయారవడం మాత్రమే కాకుండా.. తెగిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా జుట్టు తడిగా ఉన్నప్పుడు మనం గట్టిగానే తుడుచుకుంటాం. దీనివల్ల వెంట్రుకలు మరీ ఎక్కువగా తెగిపోతుంటాయి. అందుకే దళసరి టవల్‌ను ఇకపై ఉపయోగించకండి.

Also Read: ఆముదం వల్ల కురులకు కలిగే ప్రయోజనాలు (Benefits Of Castor Oil For Hair)

1-tips-for-long-hair-kareena

Source: Instagram

Pro Tip: తలస్నానం చేసినప్పుడు తల తుడుచుకోవడానికి మీ పాత టీషర్ట్ ఉపయోగించండి. తలస్నానం చేసిన తర్వాత దీన్ని తలకు చుట్టుకోండి.

2. గోరువెచ్చని నూనెతో మర్ధన (Massage Your Scalp With Hot Oil)

తలకు నూనె రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. మరి పొడవాటి కురులు కావాలంటే ఏం చేయాలి? తలస్నానం చేసే ముందు గోరువెచ్చని నూనెతో మర్ధన చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే.. కచ్చితంగా మీ జుట్టు పొడవుగా ఎదుగుతుంది.

Pro Tip: గోరు వెచ్చని నూనెతో తలకు మర్ధన చేసుకొన్న ఒక గంట గడిచిన తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

తలకు నూనె రాసుకోవడం వల్ల కలిగే

3. దువ్వుకొనేటప్పుడు జాగ్రత్త (Careful While Combing Your Hair)

ఇప్పుడు అందరూ బిజీ బిజీగానే రోజు గడుపుతున్నారు. అందుకేనేమో ప్రతి పని హడావుడిగానే పూర్తి చేసేస్తున్నారు. ఇది తల దువ్వుకొనే విషయంలోనూ కనిపిస్తుంది. వేగంగా జుట్టు దువ్వుకోవడం వల్ల చిక్కులు పడి వెంట్రుకలు తెగిపోతుంటాయి. అందుకే కాస్త నిదానంగా తల దువ్వుకోవాలి. దీనికోసం కనీసం ఐదు నిమిషాలైనా సమయం కేటాయించండి.

Pro Tip: జుట్టు చిక్కులు తీసుకొనేటప్పడు.. అంతా ఒకేసారి దువ్వడం కాకుండా.. వెంట్రుకలను భాగాలుగా చేసి చిక్కు తీసుకోవడం మంచిది.

Also Read: జుట్టు రాలకుండా చేసే సహజమైన చిట్కాలు (Home Remedies To Prevent Hair Fall)

3-tips-for-long-hair-Deepika

Source: Instagram

4. కురుల ఆరోగ్యాన్ని పాడుచేేసే వస్తువులకు దూరంగా.. (Stay Away From Products That Causes Hair Damage)

ఇటీవలి కాలంలో తలస్నానం చేసిన తర్వాత జుట్టు త్వరగా ఆరడానికి హెయిర్ డ్రయ్యర్లు ఉపయోగిస్తున్నారు. అలాగే హెయిర్ స్ట్రెయిటనర్ వినియోగం కూడా నేటి తరంలో ఎక్కువైంది. ఇవి ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలో మీరు రెడీ అవ్వచ్చు. కానీ డ్రయ్యర్, స్ట్రెయిటనర్ ఎక్కువ వాడటం వల్ల వెంట్రుకలకు చాలా నష్టం జరుగుతుంది. అందుకే వాటిని అత్యవసరమైనప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో ఉపయోగించకపోవడమే మంచిది.

Pro Tip: మృదువైన, పొడవైన కురులు కావాలనుకొంటే.. తలస్నానం చేసిన తర్వాత జుట్టును సహజంగా ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల జుట్టు చక్కగా ఎదుగుతుంది.

Also Read: పొడవు జుట్టున్న అమ్మాయిలకు నప్పే హెయిర్ కట్స్ (Haircuts For Long Hair)

5. వెడల్పు పళ్లున్న దువ్వెన ఉపయోగించాలి.. (Use a Wide-Toothed Comb)

చాలామంది దువ్వెన ఎంపిక విషయంలో అంత జాగ్రత్తగా వ్యవహరించరనే చెప్పుకోవాలి. తల దువ్వుకోవడానికి పళ్లు వెడల్పుగా ఉండటంతో పాటు వాటి మధ్య ఖాళీ ఎక్కువగా ఉన్న దువ్వెన ఎంచుకోవాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. తల తడిగా ఉన్నప్పుడే ఈ దువ్వెనతో చిక్కులు తీసుకోవడం మంచిది.

Pro Tip: వెంట్రుకలు పాడవకుండా ఉండాలంటే.. చెక్కతో తయారుచేసిన దువ్వెన ఎంచుకోవడం మంచిది.

5-tips-for-long-hair-Aishwaraya

Source: Instagram

6. చివరలు కత్తిరిస్తూ.. (Do Regular Trims)

పొడవైన కురులు కావాలని మీరు అనుకొంటున్నట్లయితే.. అప్పుడప్పుడూ మీ జుట్టు చివరలు కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదల వేగవంతం అవుతుంది.

Pro Tip: 6 నుంచి 8 వారాలకోసారి జుట్టు కత్తిరిస్తూ ఉండాలి. అప్పుడే జుట్టు వేగంగా పెరుగుతుంది.

జుట్టు ఒత్తుగా పెరగడానికి తినాల్సిన శాఖాహారం

7. రోజూ తలస్నానం వద్దు (Avoid Washing Your Hair Everyday)

రోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల దానిలో ఉన్న రసాయనాలన్నీ వెంట్రుకలపై పేరుకుపోతాయి. ఫలితంగా కురుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది.

Pro Tip: మృదువుగా షాంపూ చేసుకోండి. ఎక్కువగా వెంట్రుకలను రుద్దకూడదు.

7-tips-for-long-hair-sonakshi

Source: Instagram

8. సహజసిద్ధమైన ఉత్పత్తులకు ప్రాధాన్యం (Use Natural Products For Hair Care)

ప్ర‌కృతి అందించిన కలబంద, తేనె, వెనిగర్ వంటి ఉత్పత్తులు జుట్టుకి చాలా మేలు చేస్తాయి. అందుకే వీటితో తయారైన ఉత్పత్తులను వినియోగించడానికి ప్రయత్నించండి. మీ కురులపై రసాయనాల ప్రభావం పడకుండా ఉంటుంది.

Pro Tip: కురులకు మేలు చేసే సహజసిద్ధమైన ఉత్పత్తుల జాబితాను తయారుచేయండి. అందులో మీకు సరిపోయేవాటిని ఎంచుకోండి.

Read More: Best Heat Protection Spray

9. సమతులాహారం తీసుకోవాలి (Include Nutritious Foods In Your Diet)

మనం తీసుకొనే ఆహారంపైనే జుట్టు ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. అందమైన జుట్టు కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సరైన ఆహారం తీసుకోకపోతే.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆహారంలో ఆకుకూరలు, మాంసంతో పాటు విటమిన్లు పుష్కలంగా ఉండే పదార్థాలను సైతం భాగం చేసుకోండి.

Pro Tip: ఈ విషయంలో న్యూట్రిషనిస్ట్‌ను కలవడం మంచిది.

9-tips-for-long-hair-sonakshi

Source: Instagram

10. నిద్రపోయే ముందు మరోసారి.. (Hair Care Before You Sleep Everyday)

జుట్టు చిక్కు పడకుండా ఉండాలంటే.. రాత్రి నిద్రపోయే ముందు చక్కగా దువ్వుకొని వదులుగా జడవేసుకోవాలి. దీనివల్ల మరసటి రోజు మీకు తల దువ్వుకోవడం సులభమవుతుంది.

Pro Tip: తల దువ్వుకొనే ముందు కాస్త నూనె రాసుకోవాలి.

ఇదీ అమ్మాయిలూ.. జుట్టు పొడవుగా ఎదగడానికి పాటించాల్సిన చిట్కాలు. చిన్న చిన్న జాగ్రత్తలే మన కురుల ఆరోగ్యాన్ని ఎలా రక్షిస్తాయో తెలుసుకొన్నారుగా. ఇంకెదుకాలస్యం.. మీరు కూడా వీటిని పాటించి పొడవైన, ఒత్తైన కురులను సొంతం చేసుకోండి.

Featured Image: Instagram

ఇవి కూడా చదవండి

కేశ సంరక్షణకు ఉత్తమ హెయిర్ ఆయిల్స్ ఇవే.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

మీ కేశాలు పెరగడానికి పాటించాల్సిన 11 పద్ధతులు ఇవే.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

బాడీ హెయిర్ గ్రోత్ నివారణకు చిట్కాలివే.. ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవండి

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Also read different shampoo brands in India for your hair type